ఈ జాగ్రత్తలు తీసుకుంటే చర్మం పదిలం

27-10-2016,ఆంధ్రజ్యోతి:సీజన్‌ మారినా చాలా మంది చర్మ సంరక్షణ అలవాట్లను మార్చుకోరు. వేసవిలో వాడిన స్కిన్‌ కేర్‌ ప్రోడక్ట్స్‌నే వింటర్‌లోనూ వాడుతుంటారు. దీనివల్ల స్కిన్‌ డ్రైగా మారుతుంది. వింటర్‌లో చర్మ సంరక్షణ కోసం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి.

చలి తీవ్రత పెరుగుతున్నప్పుడు వేడి నీటితో ముఖం కడుక్కోవడం తప్పనిసరి. ఒకవేళ మీరు ఫేస్‌ క్లీన్సర్‌తో వాష్‌ చేసుకుంటున్నట్లయితే చల్లటి నీటిని ఎంచుకోవచ్చు. మిగతా సమయాల్లో గోరువెచ్చని నీటితో కడుక్కోవచ్చు.
ఆల్కహాల్‌ కంటెంట్‌ ఉన్న స్కిన్‌ కేర్‌ ప్రోడక్ట్స్‌కు వింటర్‌లో దూరంగా ఉండాలి. ఇవి చర్మాన్ని పొడిబారేలా చేయడమే కాకుండా డ్యామేజ్‌ చేస్తాయి.
ఎక్కువ సమయం ఆవిరి పట్టడం మంచిది కాదు. ఆవిరి వల్ల నేచురల్‌ ఆయిల్స్‌ ఉత్పత్తి తగ్గిపోతుంది. ఫలితంగా చర్మం పొడిబారుతుంది. కాబట్టి అతిగా ఆవిరి పట్టడం సరికాదు.
సీజన్‌ మారగనే యాయిశ్చరైజర్‌ను మార్చుకోవాలి. . సమ్మర్‌లో క్రీమీ మాయిశ్చరైజర్‌ అవసరం ఉండదు. కానీ వింటర్‌లో అవసరం. అందుకే తగినవిధంగా మాయిశ్చరైజర్‌ను మార్చుకోవాలి.
వింటర్‌లో ఎక్కువ సార్లు ముఖం కడగడం కరెక్ట్‌కాదు. అలా చేయడం వల్ల చర్మం నిర్జీవంగా మారుతుంది.