ముఖం మెరవాలంటే..

ఆంధ్రజ్యోతి(25-07-2019): ముల్తానీ మట్టి, లవంగం నూనె, గంధం పొడిని పాత్రలో తీసుకొని మెత్తని పేస్టులా చేసుకోవాలి. దీనికి వేప ఆకుల పేస్టు కలపాలి. ఈ మిశ్రమాన్ని మొటిమల మీద రుద్దుకోవాలి. ఆరిన తరువాత నీళ్లతో కడిగేయాలి. రోజూ ఇలాచేస్తే మొటిమలు మాయమై, ముఖం కాంతిమంతంగా మారుతుంది.

ముల్తానీ మట్టి, రోజ్‌వాటర్‌, కర్పూరం మిశ్రమాన్ని ఫ్రిజ్‌ల్‌ ఉంచాలి. ఈ పేస్ట్‌ అప్లై చేస్తే ముఖం మీది మలినాలు తొలగి, తాజాగా కనిపిస్తుంది.