పాదాల పగుళ్లు మాయం!

చలికాలం మొదలైతే పాదాల పగుళ్లూ మొదలవుతాయి. దాంతో పాదాలు అందవిహీనంగా కనిపించడంతో పాటు, చర్మానికి గీసుకుపోతూ చికాకు పెడతాయి. ఈ సమస్యలు తొలగాలంటే....
బక్కెట్‌లో సగానికి గోరువెచ్చని నీళ్లు నింపి, రాతి ఉప్పు, నిమ్మరసం, గ్లిజరిన్‌, రోజ్‌వాటర్‌ కలపాలి.
ఈ నీటిలో పాదాలు 15 నిమిషాల పాటు ముంచి ఉంచాలి.
తర్వాత ప్యూమిస్‌ స్టోన్‌తో రుద్ది పాదాలు శుభ్రం చేసుకోవాలి.
నిమ్మరసం, గ్లిజరిన్‌, రోజ్‌వాటర్‌ సమపాళ్లలో కలిపి, ఈ మిశ్రమాన్ని పాదాలకు పూసుకుని రాత్రంతా వదిలేయాలి.
ఇలా కనీసం వారం రోజుల పాటు చేస్తే పాదాల పగుళ్లు పోయి, కోమలంగా మారతాయి.