తేనెతో ఫేసియల్‌ వాక్స్‌

ఆంధ్రజ్యోతి(14-11-15): పావుకప్పు తేనెలో ఒక కప్పు చక్కెర, రెండు టేబుల్‌స్పూన్ల నిమ్మరసం కలపాలి. చక్కెర మొత్తం కరిగే వరకు ఈ మిశ్రమాన్ని వేడి చేయాలి. ఆ తరువాత ఇరవై సెకన్లపాటు దీన్ని మైక్రో ఓవెన్‌లో వేడిచేయాలి. ఈ మిశ్రమం పూర్తి గా చల్లారాక ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. వెంటనే కాటన్‌ స్ట్రిప్స్‌ని వాక్స్‌పై అంటించి వెంట్రుకలు పెరిగే దిశలో లాగేయాలి. ఈ వాక్స్‌ వల్ల నొప్పి అంతగా ఉండదు. దీనివల్ల అవాంఛింత రోమాల సమస్య తీరుతుంది. తేనెతో కూడిన ఈ వాక్స్‌ వల్ల చర్మం మృదువుగా, కాంతివంతంగా  తయారవుతుంది. అలాగే ఈ వాక్స్‌ వల్ల చర్మానికి సంబంధించిన ఎటువంటి అలర్జీలు దరి చేరవు. ఈ రకమైన వాక్స్‌ అన్ని రకాల చర్మాలపై బాగా పనిచేస్తుంది.