తెల్లమచ్చలు తగ్గవని ఎవరన్నారు?

ఆంధ్రజ్యోతి(08-10-13): తెల్ల మచ్చల వ్యాధి పట్ల సమాజంలో అనాదిగా కొన్ని అపోహలు ఉన్నాయి. అవి దశాబ్దాలుగా మనిషి ఆలోచనలను ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. అందుకే ఒక డాక్టర్‌ తెల్ల మచ్చలు త గ్గుతాయనే సత్యాన్ని ఎంత శాస్త్రీయంగా చెప్పినా, కొందరికి ఆ సత్యం ఒక పట్టాన మనసుకు ఎక్కదు.  కానీ, ఆయుర్వేద వైద్య విధానంలో తెల్లమచ్చలు పూర్తిగా నయమైపోతాయన్నది నిజం. ఆ మచ్చల్ని తగ్గించడం సులభసాధ్యం కాకపోవచ్చు. కానీ అసాధ్యం మాత్రం కాదు. అయితే, ఒక అసాధారణ కృషితో కొన్ని అరుదైన మూలికల్ని సంపాధించిన డాక్టర్‌కు తెల్ల మచ్చల్ని తగ్గించ డం  సులభ సాధ్యమేనంటోంది ఆర్‌ కే ఆయుర్వేద వైద్యబృందం. 
 

ఒంటి మీద అక్కడో ఇక్కడో వచ్చిన ఒకటి రెండు తెల్ల మచ్చలు శరీరమంతా ఎక్కడ వ్యాపిస్తాయోనన్న భయం. మాకొచ్చిన ఈ వ్యాధి మా పిల్లలకు ఎక్కడ వస్తుందో నన్న భయం. నలుగురూ చూసే చిన్నచూపు జీవితమంతా భరించలేమేమో అన్న భయం. నిజంగా తెల్ల మచ్చల వ్యాధితో ఎన్ని భయాలు? కానీ, తెల్ల మచ్చల మూలాలన్నిటినీ తొలగించడం ద్వారా ఆయుర్వేదం ఈ భయాలన్నిటినీ కచ్ఛితంగా దూరం చేస్తుంది. తెల్ల మచ్చల ( ల్యూకోడెర్మా) వ్యాఽధి చికిత్సలో ఆయుర్వేదం ప్రత్యేకించి రెండు విషయాలకు సమాన ప్రాతినిధ్యం ఇస్తుంది. వాటిలో మొదటిది అప్పటికే ఏర్పడిన తెల్లమచ్చలు, శరీర మంతా రాకుండా నిరోధించడం మొదటిది. ఆ తరువాత ఉన్న మచ్చల్ని సమూలంగా, శాశ్వతంగా తొలగించడం రెండవ ది. వాస్తవానికి అప్పటికే ఒకటి రెండు తెల్ల మచ్చల కన్నా అవి శరీరమంతా ఎక్కడ పాకుతాయోనన్న ఆందోళనే వారిని ఎక్కువగా బాధిస్తూ ఉంటుంది.అందుకే ఉన్న మచ్చలు ఇతర భాగాలకు పాకకుండా చూడటాన్ని కూడా ఆయుర్వేదం తన లక్ష్యంగా స్వీకరిస్తుంది. 

ప్రకృతిలో ఎంతో ఔషధ శక్తి

ప్రకృతి ఒక అద్భుతం. ప్రకృతిలోని కోటానుకోట్ల ఔషధ మూలికల గురించి తెలిసిన ఆయుర్వేదం మరీ అద్భుతం. వేయి మూలికల్ని చూశాను కానీ, ఏముంది గొప్ప? ఈ వ్యాధిని నయం చేసే శక్తి ఏ ఒక్కదాంట్లోనూ లేదని ఎవరైనా అంటే, మీరు వేయి మూలికల్ని చూసి ఉండవచ్చు. కానీ, ఆ వెయ్యి మూలికల్లో నేను లేను. నేను వెయ్యిన్నొకటో మూలికను అంటుందో మూలిక ఎంతో ఆత్మవిశ్వాసంతో. నిజమే మరి! వె య్యో మూలిక దగ్గరే ఆగిపోయిన వ్యక్తికి ఆ వెయ్యిన్నొకటో మూలిక గురించి ఏం తెలుస్తుంది? ఆ చివరి మూలికే తెల్లమచ్చల్ని మాయం చేసే దివ్య ఔషధమూలిక కావచ్చు కదా! అడవుల్లో ఒక్కోసారి కొన్ని అరుదైన మొక్కలు ఎదురవుతాయి. వాటిలోని అద్భుతమైన ఔషధ గుణం తెలిసినప్పుడు నివ్వెరపోవడం తప్ప మరేమీ ఉండదు. కానీ, వనమూలికలకున్న ఆ శక్తి గురించి చాలా మందికి తెలియదు. అందుకే ఎక్కువ మంది వ్యాధిగ్రస్తులో నిలువెత్తు నిరాశలు క మ్ముకుని ఉంటున్నాయి. ఏ ఔషదానికీ తన వ్యాధి తగ్గదనే భావనతో అసలు వైద్యానికే వెళ్లరు. 

కష్టసాధ్యమే కానీ, అసాధ్యం కాదు

కొన్ని రకాల వ్యాధుల్ని పూర్తిగా నయం చేయడం అసాద్యమంటూనే అసాధారణ కృషి జరిపితే వాటిని కూడా నయం చేయడం సాధ్యమే అన్నారు ఆయుర్వేద పితామహులు. సాధారణ కృషితో అసాధ్యమైనవెన్నో అసాధారణ కృషితో సుసాధ్యమవుతాయన్న సత్యం ఆయుర్వేద వైద్యానికి అక్షరాలా వర్తిస్తుంది.ఎన్నో రకాల వ్యాధులు ఎంతో కొంత వ్యవధిలో తగ్గిపోతున్నప్పుడు తెల్ల మచ్చల వ్యాధి ఎందుకు తగ్గడం లేదు? దీనికి వ్యాధి మూలాలు అత్యంత సూక్ష్మ కణజాలంలోకి, సప్తధాతువుల్లోకి చేరిపోవడమే కారణం. ఇతర వైద్య విధానాల్లో వ్యాధిని ఒక వ్యాధిగానే చూస్తారు. ఆ వ్యాధి లక్షణాలను తొలగించడం ద్వారా వ్యాధిని నయం చేశామనుకుంటారు. కానీ, ఆ వ్యాధి శరీరంలోని కణకణానికీ సప్తధాతువుల్లోకి వ్యాపించిన విషయాన్ని వారు గుర్తించలేరు. అందుకే ఆ మూలాల్ని తొలగించలేరు. అందుకే వ్యాధిని అణచివేసే మందులకే పరిమితమవుతారు. అణచివేతతో తాత్కాలిక ఉపశమనంగా అనిపించినా, మందులు ఆపగానే వ్యాధి మళ్లీ పెరిగిపోతూనే ఉంటుంది. అందుకే ఏ మందులతోనూ తెల్ల మచ్చల వ్యాధి నయం కాద నే తమ బలహీనమైన భావజాలాన్ని అన్ని వైద్య విధానాలకూ ఆపాదించాలని చూస్తారు. అయితే, ఆయుర్వేద వైద్య విదానం వాటన్నిటికన్నా భిన్నమైనది అతీతమైనది. ఎందువల్ల అంటే రస, రక్త, మాంస , మేధో, అస్థి, మజ్జ, శుక్ర అనే సప్తధాతువుల్లోకి వ్యాపించిన వ్యాధి మూలాల్ని సైతం బయటికి పంపించే శక్తి కేవలం ఒక్క ఆయుర్వేద విధానంలోనే ఉంది మరి! ఆయుర్వేద కొన్ని రకాల ఔషధ ద్రవ్యాలను కొన్నింటి మిశ్రమంతో ఇస్తే అవి శరీరంలోని సూక్ష్మ కణాల దాకా వెళ్లి, వాటిని చైతన్య పరుస్తాయి. వ్యాధి మూలకాలతో విముక్తమయ్యేలా చేస్తాయి. 

పంచకర్మలతోనే పరిపూర్ణ విముక్తి

శరీరంలోని ప్రతి కణంలోనూ పేరుకుపోయిన వ్యర్థ, విషపదార్థాలను తొలగించడం అంటే ఏమిటి? కడుపులోని గడ్డను కత్తి కోతతో తీసివేసినట్లు కాదు. ప్రతి కణంలోకీ కొన్ని ద్రవ్యాలను పంపి అణువణువునూ శుద్ధి చేయాలి. శుద్ధి చేయడం సరే కానీ, అసలా విషపదార్థాలు ఎలా ఏర్పడ్డాయి? విషపదార్థాలు పేరుకుపోవడానికి ఒకటా?రెండా? వేల కారణాలు ఉంటాయి. ఆ కారణాల ఆదారంగా అతని శరీర తత్వాన్ని అనుసరించి ద్రవ్యాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ ద్రవ్యాలు సూక్ష్మ కణస్థాయిలో శుద్ధి చేయగల సునిశితమైనవై ఉండాలి. నిజానికి ఆ ద్రవ్యాలను ఎంచుకోవడంలోనే ఎంతో విషయం ఉంటుంది. ఈ ప్రక్రియల్లో ప్రత్యేకించి పంచకర్మ చికిత్సల పాత్ర కీలకంగా ఉంటుంది. పంచకర్మలతో శుద్ధి చేశాకే ఔషధాలు ఇవ్వాలి. అప్పుడే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. మచ్చలు పైపైనే ఉన్నాయి కాబట్టి పంచకర్మ చికిత్సలు అవసరం లేద ని ఎవరైనా అనుకుంటే అది వ్యాధి మూలాల్ని లోలోపలే మిగుల్చుకోవడమే అవుతుంది. వ్యాధిని ముదర పెట్టుకోవడమే అవుతుంది.

శరీర తత్వాల ఆధారంగా...

శరీరంలోని కల్మషాలను తొలగించడం ఒక ఎత్తయితే, శరీరానికి వ్యాధినిరోధక శక్తిని అందించడం రె ండవ ఎత్తు. ఈ రెండు ప్రక్రియల్ని సమర్థవంతంగా నిర్వర్తించడ వల్లే తెల్లమచ్చలు 3 నుంచి 6 మాసాల్లో తగ్గుమఖం పడుతున్నాయి. తెల్ల మచ్చల వ్యాధిని సమూలంగా తొలగించడంలో క ల్మషాల్ని తొలగించడంతో పాటు వ్యాధినిరోధక శక్తిని పెంచడం కీలమకమవుతుంది. అయితే, ఆయుర్వేద వైద్య చికిత్సలో రోగి మాన సిక ఒత్తిళ్లు, ఆందోళనలను తగ్గించే విధానాలు కూడా అందులో భాగమవుతాయి?. ఈ ప్రక్రియలేవీ గంపగుత్తలా అందరికీ ఒకే తరహా చికిత్సలు ఉండవు. ఆయా వ్యక్తుల వేరు వేరు శరీరర ధర్మాలను అసుసరించి ఆ చికి త్సలు వేరువేరుగా ఉంటాయి. ఆ వైవిద్యాన్ని పాటించడం అన్నది ఆ వైద్యుని సుదీర్ఘమైన అనుభవం మీదే ఆధారపడి ఉంటుంది. సమస్యను సవాలుగా తీసుకోవడం మీదే అతని విజయం ఆధారపడి ఉంటుంది.వ్యాధి సూక్షకణజాల స్థాయికి వెళ్లిందీ అంటే కణజాలంలో ఒక శక్తిహీనత ఏర్పడి ప్రతి కణమూ తన పనితనాన్ని కోల్పోయిందని అర్థం. ఈ స్థితిలో సమస్త కణజాలాన్నీ, సప్తధాతువుల్నీ తిరిగి శక్తివంతం చేయడానికి ప్రత్యేకమైన రసాయన చికిత్సలు అవసరమవుతాయి. ఈ ప్రక్రియలన్నీ కొత్త మచ్చలు రాకుండా చూడటంతో పాటు, పాత మచ్చల్ని సమూలంగా తొలగించివేస్తాయి.

అపోహల్ని నమ్ముతూ...

తెల్లమచ్చలు తగ్గిపోయే అవకాశాల గురించిన నిజాల్ని ఈ వ్యాధిసోకిన తరువాతే డాక్టర్‌ చెబుతున్నాడు. కానీ, ఎన్నో దశాబ్దాలుగా ఈ సమాజం తన భయాలనూ, అపోహలనూ అందరి మీదా రుద్దుతూ వచ్చింది. ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆ ప్రభావాలు తన మెదడు మీద పనిచేస్తూనే ఉన్నాయి. అందుకే డాక్టర్‌ ఎంత శాస్త్రీయంగా చెప్పినా కొంత మందికి అవేవీ మనసుకు ఎక్కడం లేదు. అందుకే ఎంతో మంది తెల్లమచ్చల వ్యాధి గ్రస్తులు అసలు ఆయుర్వేద డాక్టర్‌ను సంప్రదించడమే లేదు.. ‘ తెల్ల మచ్చలు మొదలయ్యి అప్పటికే ఏడాది గ డిస్తే ఇంక ఆ మచ్చలు పోవని, మచ్చ ఉన్న ప్రదేశంలోని వెంట్రుక ఎర్రగా మారితే ఆ మచ్చలు ఎప్పటికీ తగ్గవని, ఒక మచ్చ, మరో మచ్చతో కలిసిపోయి పెద్ద మచ్చగా మారితే తగ్గవని ’’ ఇలా పలు రకాల అపోహలు సమాజంలో ఉన్నాయి 

ఆయుర్వేద విశేషం

సాధారణ చికిత్సలకే పరిమితమైతే వ్యాధి తగ్గకపోవచ్చు. కానీ, విశేషమైన కొన్ని ఆయుర్వేద చికిత్సలు చేసినప్పుడు ఆ స్థితిలోనూ వ్యాధి నయమవుతుంది. ఇది నిజం. ఆయుర్వేద వైద్య చికి త్సలతో పాటు ప్రకృతి వైద్య విధానంలోని ‘ఆతప స్నానం’ మట్టిపూత వంటి చికిత్సలు కూడా తీసుకుంటే వ్యాధి వేగంగా తగ్గుతుంది. ఆతప స్నానంతో శరీరంలోని కల్మషాలన్నీ బయటికి వెళ్లిపోయాక ప్రకృతి సహజమైన లవణాలు శరీరానికి అందించే మట్టిపూత ప్రక్రియ ఉంటుంది. మట్టి పూత వల్ల శరీరం పుష్టికరంగా మారుతుంది. పూతకోసం మట్టిని తీసుకున్న ప్రదేశాన్ని బట్టి, మట్టిని తీసుకున్న రుతువును బట్టి ఆ మట్టి ప్రభావం శరీరం మీద ఉంటుంది. అది చర్మవ్యాధుల్ని తగ్గించడంలో తోడ్పడుతుంది. కొండల మీదినుంచి, సెలయేర్లలోంచి, వర్షపు వరదల ద్వారా గానీ, అడవుల్లోంచి, మూలికల్లోంచి, రకరకాల, భూములు, రాళ్లు, చెట్లను వీటన్నిటినీ ఒరుసుకుని వచ్చే నీళ్లు మట్టితో కలిసి వచ్చి ఒండ్రు మట్టిగా నిలుస్తుంది. అలాంటి ఒండ్రుమట్టిలో ఒక సారం ఉంటుంది. ఆ మట్టిలో ఉండే ప్రకృతి గుణం, ఔషధ గుణం మనకు ఎంతగానో తోడ్పడ తాయి. వీటన్నింటినీ సమష్టి ప్రక్రియలే తెల్లమచ్చల వైద్యం. తెలిసీ తెలియక ఎవరో చేసిన వ్యాఖ్యానాలే నిజమనుకుని తెల్ల మచ్చల బాధను జీవితమంతా భరించడంలో అర్థం లేదు. ఒక సమగ్రమైన శాస్త్రీయ అవగాహనతో తెల్ల మచ్చలను సమూలంగా తొలగించే వైద్య చికిత్సలు మీ ముందున్నాయి. వెంటనే సంప్రదించి సత్పలితాలను పొందండి. 
 
ఆర్‌ కె ఆయుర్వేద వైద్య బృందం
ఆర్‌ కె ఆయురే ్వదిక్‌ అండ్‌ సొరియాసిస్‌ సెంటర్‌
క్లినిక్స్‌: హైదరాబాద్‌,విజయవాడ, వైజాగ్‌, హన్మకొండ,కర్నూలు, తిరుపతి
 ఫోన్స్‌:98492 54587, 040-23057483