తెల్లమచ్చల వైద్యం ఎక్కువ కాలమేమీ కాదు

ఆంధ్రజ్యోతి(03-12-13): దాతువుల్లోంచి పుట్టుకొచ్చే ఒక తీవ్రమైన వ్యాధి  శ్విత్రం. దీన్నే తెల్ల మచ్చల వ్యాధి లేదా ల్యూకోడెర్మా అని పిలుస్తారు. దీర్ఘకాలికంగా ఉంటున్న ఒక క్రానిక్‌ వ్యాధికి దీర్ఘకాలికమైన చికిత్స అవసరం. దీనికి కారణం ఈ వ్యాధి సప్త ధాతువుల్లోని రస, రక్త, మాంస, మేధో ధాతువు దాకా వ్యాపించడమే. మేధో ధాతువుదాకా వెళ్లిన తరువాతే చర్మం మీద ఈ మచ్చలు కనపడతాయి. అందువల్ల వ్యాధి అప్పుడప్పుడే కనిపించినా అది శరీరంలో ఎప్పటి నుంచో తిష్ట వేసి ఉందని అర్థం. అలాంటి వ్యాధిని కేవలం  పదీ పదిహేను రోజుల్లో నయం చేయడం అన్నది అసాధ్యం. ఒకవేళ అలా తగ్గిందే అనుకుంటే తాత్కాలిక ఉపశమనమే తప్ప  అది శాశ్వత వైద్యం కాదు. అయితే ఆయుర్వేద వైద్యంతో  తెల్ల మచ్చలు ఒకటి రెండు మాసాల్లో బాగా తగ్గుముఖం పడతాయి. ఇది మరీ ఎక్కువ సమయమేమీ కాదు కదా అంటోంది ఆర్‌. కె ఆయుర్వేద కేంద్రంలోని వైద్య బృందం. 
 

 స్టెరాయిడ్స్‌ ఇవ్వడం ద్వారా ఎవరైనా అతి తక్కువ కాలంలోనే వ్యాధిని నయమైనట్లు చూపించవచ్చు. కానీ, అది రోగికి తాత్కాలిక ఉపశమనంగానే తప్ప పూర్తి స్థాయి వైద్యం కానే కాదు. ఎందుకంటే అది కొద్దిరోజుల్లోనే మళ్లీ వస్తుంది. అలాంటి అవకాశం లేకుండా ఆయుర్వేదంలో ఆ వ్యాధి మూలాల్ని తొలగించే వైద్య చికిత్సలు ఉన్నాయి. 

శ్విత్రం వ్యాధిని దారుణ, అరుణ, కిలాస అంటూ మూడు రకాలుగా విభజిస్తారు. వాత, పిత్త, కఫాల వ్యత్యాసాలను అనుసరించే ఈ విభజన జరిగింది. దారుణలో చర్మం రూక్షంగా ఉంటుంది. మచ్చలు ముదురు ఎరుపు వర్ణంలో ఉంటాయి. అరుణ అంటే చర్మం ఎరుపు రంగులోనే ఉంటుంది. కిలాస అనేది చివరి దశ. ఇందులో మేధో దుష్ప్రభావానికి గురయ్యిందని అర్థం. ఈ దశంలో మొతం చర్మం తెలుపు రంగులోకి మారిపోతుంది. సాధారణంగా పెదవుల పైగానీ, జననాంగాల పైన గానీ, వచ్చే మచ్చలు చాలా సంక్లిష్టమైనవి మిగతా మచ్చలతో పోలిస్తే వీటికి వైద్యం చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. మిగతా భాగాల్లో ఉండే చర్మం పొరలకు ఈ పొరలకూ మధ్య ఎంతో తేడా ఉండడమే అందుకు కారణం. స్టెరాయిడ్స్‌ ఇవ్వడం ద్వారా ఎవరైనా వ్యాధిని తగ్గిస్తే దాని వల్ల ఫలితమేముంది. వారం పదిరోజుల్లోనే మళ్లీ ఆ వ్యాధి తిరగతోడుతుంది. సహజంగా ఏ వ్యాధి అయినా ధాతుస్థాయిలో దెబ్బ తీస్తూ ఉంటుంది. ఆ దెబ్బ తిన్న ధాతువులను తిరిగి శక్తివంతంగా మార్చనంత కాలం ఆ వ్యాధి సమూలంగా తొలగిపోయినట్లు కాదు. అలా వ్యాధిని సమూలంగా నిర్మూలించే క్రమంలో కొంత ఎక్కువ సమయమే తీసుకోవచ్చు. కానీ, వ్యాధిని కూకటి వేళ్లతో పెకిలించడానికి ఆ మాత్రం సమయం అవసరం. అది ఆయుర్వేదం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. 

ఆలస్యం ఎలా అంటారు? 

ఆయుర్వేద ఔషధాలు చాలా ఆలస్యంగా పనిచేస్తాయనే అపోహ బాగా ప్రచారంలో ఉంది. నిజానికి ఎంత మాత్రమూ నిజం కాదు. ఏ వైద్య చికిత్స అయినా, ఆ వ్యాధి తీవ్రతను అనుసరించి ఉంటుంది. దగ్గు, జలుబు వంటి సాధారణ వ్యాధుల్లాగే వ్యాధులన్నీ తగ్గవు కదా! ధాతువులనే ప్రభావితం చేసి ఏర్పడే వ్యాధికి వ్యాధిని శాశ్వతంగా నయం చేయడానికి వెచ్చించే ఈ కాలం నిజానికి చాలా తక్కువ. తెల్ల మచ్చల వ్యాధి బ్రాజక పిత్తం వల్ల తలెత్తే వ్యాధి. బ్రాజక పిత్తం దూషించడం వల్లే చర్మం మీద ఉండే మెలినోసైట్స్‌ దె బ్బ తింటాయి .అదే తెల్ల మచ్చల వ్యాధికి దారి తీస్తుంది. శమన చికిత్సలో భాగంగా ఈ వ్యాధికి ఇచ్చే కొన్ని ఔషధాలు భ్రాజక పిత్తాన్ని సమిస్థితికి తెచ్చి దెబ్బ తిన్న మెలినోసైట్స్‌ తిరిగి ఏర్పడేందుకు దోహదం చేస్తాయి. ఆయుర్వేద వైద్యానికి వ్యాధిని నయం చేయడం ఒక్కటే లక్ష్యంగా ఉండదు. ధాతువృద్ధిని, వ్యాధినిరోధక శక్తిని పెంచే  దిశగా పనిచేస్తూ ఉంటుంది. ధాతు నిర్మాణం గానీ, ధాతువులు క్షీణించిపోవడం గానీ, ఒక క్రమానుగతంగా సాగుతుందే కానీ రాత్రికి రాత్రే జరిగిపోదు. ఏ ధాతువైనా తిరిగి పూర్వ స్థితికి చేరుకోవడానికి ఒక నెలరోజులైనా పడుతుంది. ఆ క్రమంలోనే ఏ వ్యాధి అయినా నయమవుతుంది. స్థాయిలోనే లోపం సరిచేయడం వల్ల ఆ వ్యాధి తిరిగి ఏర్పడే అవకాశం లేదు.  

దోషాలను సరిచేయాల్సిందే

ఏ వ్యాధి అయినా వాత పిత్త కఫాలనే త్రిదోషాల మీద ఆధారపడి ఉంటుంది. అందుకే ఆయుర్వేదంలో చేసే శమన చికిత్సలు ఈ దోషాల ఆధారంగానే ఉంటాయి. ఇతర వైద్య విధానాలు లక్షణాల ఆధారంగానే చికిత్సలు చేస్తాయి. ఆయుర్వేదం అలా కాదు. వ్యాధి కారకాలు, వ్యాధి మూలాల ఆధారంగా ఇక్కడ వైద్య చికిత్సలు ఉంటాయి. వాత, పిత్త, కఫాల్లో ఏది ప్రకోపితమయ్యిందో ఆ విషయాన్ని పసిగట్టి, ఆ దోషాన్ని తిరిగి సమస్థితికి తెచ్చే ప్రయత్నం చేస్తాం. వైద్య చికిత్సలో ఇచ్చే ఔషధాల శక్తి కూడా ముఖ్యమే. నిపుణులైన వైద్యులు ఔషధాలు సూచించినప్పుడు వ్యాధి చాలా వేగంగా తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే వ్యాధి కారణంగా ఏ ధాతువు దెబ్బ తిన్నదో తెలుసుకుని ఆ ధాతు వృద్ది చికిత్స చేయడం కూడా ఇందులో విశేషంగా పనిచేస్తుంది. ఇతర వైద్య విధానాల్లో వాళ్ల దృష్టి అంతా రక్తధాతువు దగ్గరే ఆగిపోతుంది. ఆయుర్వేదం మొత్తం సప్తధాతువుల్నీ పరిశీలించి, ఏ ధాతువులో సమస్య ఉంటే ఆ చేరే ఔషధాలు ఇవ్వడం జరుగుతుంది. మొత్తం సప్తధాతువులకూ వైద్యం చేసినా ఎక్కువగా దెబ్బ తిన్న ఆ ధాతువు మీద ప్రత్యేక దృష్టిని పెట్టడం జరుగుతుంది. త్రిదోషాలనూ సమస్థితికి తేవడంతో పాటు, శమన చికిత్సలు అందించడం ద్వారా సప్తధాతువులూ సహజ స్థితిని పొందుతాయి. అన్నింటినీ మించి ఆయుర్వేదం తెల్ల మచ్చల్ని శాశ్వతంగా నయం చేసే ఏకైక లక్ష్యంగా పనిచేస్తుంది. తెల్ల మచ్చల్ని తాత్కాలికంగా తగ్గించే స్టెరాయిడ్‌ వైద్యాలకు వెళతారో, వ్యాధిని శాశ్వతంగా నయం చేసే ఆయుర్వేద చికి త్సలకు వెళతారో ఎవరికి వారు తేల్చుకోవలసిందే!
 
 
ఆర్‌ కె ఆయుర్వేద వైద్య బృందం
ఆర్‌ కె ఆయురే ్వదిక్‌ అండ్‌ సొరియాసిస్‌ సెంటర్‌
క్లినిక్స్‌: హైదరాబాద్‌, విజయవాడ, వైజాగ్‌, హన్మకొండ, కర్నూలు, తిరుపతి 
ఫోన్స్‌: 98492 54587, 040-23057483