సొరియాసిస్‌కు ఆయుర్వేదంతో అడ్డుకట్ట

ఆంధ్రజ్యోతి(23-10-2016): శరీరానికి చర్మం ఒక రక్షణ కవచం. అన్ని రకాలైన క్రిములు, బాక్టీరియా నుంచి వైరస్‌, చలి, ఎండ వాతావరణం నుంచి అది మనల్ని కాపాడుతుంది. ఇటువంటి బాక్టీరియా వైర్‌సల నుంచి వచ్చే ఇన్‌ఫెక్షన్‌ జబ్బుల నుంచి మన శరీరంలో ఉండే రోగ నిరోధక శక్తి కాపాడుతుంది. అయితే, ఈ వ్యాధిలో మాత్రం రోగి నిరోధక శక్తి మన మీదనే దాడి చేస్తుంది. చర్మ కణాలు ఎప్పటికప్పుడు రాలి పోతూనే ఉంటాయి. కింది పొరల్లోంచి పుట్టుకొచ్చిన కొత్త కణాలు పైకి వచ్చి ఆ స్థానాన్ని భర్తీ చేస్తాయి. ఇవి మనకు తెలియకుండానే జరిగే ప్రక్రియ. ఈ ప్రక్రియకు సాధారణంగా ఒక నెల రోజులు పడుతుంది. కాని సొరియాసిస్‌ వ్యాధిలో ఈ ప్రక్రియ చాలా వేగవంతంగా జరుగుతుంది. ఇందువల్ల మందంగా ఉండే ఎర్రటి మచ్చలు వాటిపై తెల్లని పొలుసులు ఏర్పడతాయి. ఇవి పొట్టుగా రాలి పోతుంటాయి. కొందరికి దురద కూడా ఉంటుంది. సొరియాసిస్‌ సాధారణంగా మోచేతులు, మోకాళ్లు, మాడు, వీపు, ముఖం, అరచేతులు పాదలు మీద ఎక్కువగా వస్తుంది.
 
లక్షణాలు 
లేత గులాబి రంగు లేదా ఎర్రటి మందమైన మచ్చలు, వాటిపైన తెల్లటి పొలుసులు ఏర్పడతాయి
చర్మం ఎండి పోవటం. పగలడం, కొన్నిసార్లు చర్మం నుంచి రక్తస్రావం కూడా వస్తుంది.
చర్మం మంట, దురద పెట్టటం, గోళ్లు మందంగా కావటం, గుంతలు పడటం, చీముతో కూడిన గుల్లలు రావటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
సొరియాసిస్‌ ఒక దీర్ఘకాల సమస్య. ఈ వ్యాధి ఏవయస్సు వారికైనా రావచ్చు. తల్లిదండ్రులలో ఎవరికైనా ఈ వ్యాధి ఉంటే పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుంది. తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురయ్యేవారికి కూడా వస్తుంది. ఊబకాయం మూలంగాను ముప్పు జరుగుతుంది. గొంతునొప్పి, జలుబు వంటి ఇన్‌ఫెక్షన్ల వల్ల అధిక రక్తపోటుకి వాడే మందులు, మలేరియా నివారణ మందులు చల్లని వాతావరణం, పొగత్రాగటం అతిగా మద్యం సేవించే అలవాటు వలన ఈ ముప్పు పెరుగుతుంది.
 
ఈ వ్యాధి తీవ్రత వలన ఇతర సమస్యలు కూడా వస్తాయి 
సొరియాటిక్‌ ఆర్ధ్రయిటిస్‌
ఊబకాయం
కంటి సమస్యలు
మధుమేహం
కిడ్నీ జబ్బులు వంటి వ్యాధులు వస్తాయి.
ఈ వ్యాధిని చాలా వరకు లక్షణాలను బట్టి గుర్తిస్తారు. చర్మం, మాడు, గోళ్లు వంటి వాటిని పరీక్షించి సమస్యను నిర్ధారిస్తారు. 
ఆయుర్వేద వైద్యవిధానం సొరియాసిస్‌ వ్యాధిని సమూలంగా నిర్మూలిస్తుంది. ఈ వ్యాధి వర్షాకాలంలో తీవ్రమవుతుంది. ఈ కాలంలో పంచకర్మ చికిత్సలు తీసుకొంటే ఎంతో మేలు. పంచకర్మ చికిత్సలో వమన, విరేచన చికిత్సలు మేలైనవి. వీటి వలన వ్యాధి మూలాల్లోంచి తొలగించబడుతుంది. ఏటా రెండు సార్లు పంచకర్మ చికిత్సలు తీసుకోవాలి. 
ఈ పంచకర్మ చికిత్సల అనంతరం వ్యాధిని నిర్లక్ష్యం చేయకుండా ఒక సంవత్సరం పాటు కడుపులోనికి ఔషధాలు తీసుకోవడం వల్ల సొరియాసి్‌సని శాశ్వతంగా నిర్మూలించవచ్చు. పంచకర్మల చికిత్స అనంతరం రోగి కొన్ని జాగ్రత్తలు పాటించాలి. 
ముఖ్యంగా చల్లగాలిలో తిరగకూడదు. తేలికగా జీర్ణమయ్యే పదార్థాలు తీసుకోవాలి. పగటి నిద్రపోకూడదు. కాటన్‌ దుస్తులు ధరించాలి. 
పంచకర్మ చికిత్సలతో వ్యర్ధపదార్థాలు బయటకు వెళ్లిన తరువాత, కడుపులోకి ఇచ్చే మందులు శరీరానికి పూర్తి స్థాయిలో పని చేస్తాయి. పంచకర్మల్లో పూర్వకర్మ, ప్రధానకర్మ, పాశ్య్చాతకర్మ అనేమూడింటిని పూర్తిగా ఆచరిస్తే సొరియాసిస్‌ వ్యాధిని శాశ్వతంగా నివారించుకోవచ్చు
.                                                                      
 డా. మనోహర్‌, ఎండి. ఆయుర్వేద
                                                                                               స్టార్‌ ఆయుర్వేద 
                                                                                         ఫోన్‌ : 8977336677 
                                                                            టోల్‌ఫ్రీ నం : 1800-108-5566 
                                                                          ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక