సొరియాసిస్‌కు తోడు తెల్లమచ్చలా?

ఆంధ్రజ్యోతి(11-09-13): నిలువెల్లా చేపపొట్టు పరిచినట్లు ఉండే సొరియాసిస్‌ను చూస్తాం. శరీరమంతా తెల్లతెల్లని మచ్చలు ఏర్పడే ల్యూకోడెర్మా లేదా విటిలిగో సమస్యనూ చూస్తాం. ఈ రెండూ ఒకే తరగతికి సంబంధించిన వ్యాధులు. రెండూ చర్మం మీ కనిపించేవే. అయితే ఏ వైద్య చికిత్సలూ తీసుకోకుండా వదిలేసే సొరియాసిస్‌ క్రమంగా తెల్లమచ్చల వ్యాధిగా మారే ప్రమాదం ఉంది. ఈ వ్యాధి ప్రాణాంతకమే కాదు. కానీ, నలుగురిలో కలవలేని స్థితిని క లిగిస్తుంది. అలా జీవితాన్ని హరించివేస్తుంది. అందుకే సొరియాసిసే కదా అని ఎవరైనా నిర్లక్ష్యంగా ఉండిపోతే సొరియాసిస్‌ కాస్తా ల్యూకోడెర్మా లేదా విటిలిగోగా మారి మానసికంగా కుంగ దీస్తుంది. ఒక్కోసారి తెల్ల మచ్చల వ్చాధి సొరియాసిస్‌గా మారే ప్రమాదం కూడా ఉంది. అందుకే ఈ రెండింటిలో ఏ వ్యాధి ముందు వచ్చినా వెంటనే ఆయుర్వేదాన్ని ఆశ్రయించడం ఒక్కటే మార్గం అంటోంది ఆర్‌ కె ఆయుర్వేద వైద్య బృందం.
 
 తెల్లమచ్చల వ్యాధి ప్రాణాంతకమైన వ్యాధేమీ కాదు. కానీ, ఎన్నో ప్రాణాంతక వ్యాధులకన్నా మిన్నగా మనిషి రూపాన్ని వికృతంగా మారుస్తుంది. జీవితం మీద ఆసక్తి లేకుండా చేస్తుంది. ఎవరికీ కనపడనంత దూరంగా ఎక్కడైనా ఒంటరిగా ఉండిపోతే బావుండుననిపిస్తుంది. శరీరం వివర్ణమై, రూపం వికృతమైపోతే, అద్దంలో తనను తాను చూసుకోవడమే క ష్టమైపోతుంది. ఆయుర్వేద వైద్య చికిత్సలో ఈ వ్యాధి సమూలంగానే తొలగిపోతుంది. కాకపోతే చాలా మంది పువా థెరపీ లాంటి తాత్కాలిక ఆధునిక చికి త్సలతో కాల యాపన చేసి సమస్యను మరింత ముదరపెట్టుకుంటున్నారు.

దానికి కారణం ఏ వైద్య విధానంలోనూ తెల్ల మచ్చల వ్యాధికి శాశ్వత వైద్య చికిత్సే లేదన్న భావనే కారణం. మిగతా వైద్య విధానాల మాట ఎలా ఉన్నా ఆయుర్వేదంలో ఈ వ్యాధిని సంపూర్ణంగా తొలగించే వైద్య చికిత్సలు ఉన్నాయి. మిగతా వైద్య విధానాల్లో ఈ వ్యాధి నయం కాకపోవడానికి వ్యాధిది కార కమైన వాత,పిత్త, కఫాల అసమతుల్యతను సరిచేసే విధానాలు లేకపోవడమే. ఆయుర్వేద వైద్య విధానంలో ఈ వ్యాధి సంపూర్ణంగా తొలగిపోవడానికి వాతపిత్త కఫాలను నియంత్రించే శక్తి ఆయుర్వేదానికి అపారంగా ఉండడమే. అలాగే వ్యాధినిరోధక శక్తి లోపించడమే సొరియాసిస్‌కైనా ల్యూకోడెర్యాకైనా మూల కారణం కాబట్టి, ఆ శక్తిని కూడా సంపూర్ణంగా అందించేది కూడా ఆయర్వేదమే. ఏ రకంగా చూసినా తెల్ల మచ్చల వ్యాధి సంపూర్ణంగా తొలగిపోయేది ఆయుర్వేదంలోనే.

ఒకటే అనుకుంటే మరొకటి

ఇన్నేళ్లూ సొరియాసిస్‌తో బాధపడింది చాలదన్నట్లు కొత్తగా ఈ తెల్లమచ్చలేమిటి? అంటూ కొందరు ఒకే సారి ఈ రెండు వ్యాధులతో బాధపడుతుంటారు. అయితే ఈ రెండూ వేరు వేరు వ్యాధులనుకుంటారు గానీ, సొరియాసిస్‌ వల్లే ఈ ఈ తెల్ల మచ్చలు ( ల్యూకోడెర్మా/ విటిలిగో) లేదా శ్విత్రం మొదలయ్యాయన్న విషయాన్ని గుర్తించరు. సొరియాసిస్‌ కారణంగా తెల్ల మచ్చలు రావచ్చు లేదా సొరియాసిస్‌ తరువాత తెల్లమచ్చలు గానీ, తెల్ల మచ్చల వ్యాధి తరువాతే సొరియాసిస్‌ గానీ రావచ్చు. దీనికి కారణం ఈ రెండింటికీ శరీరంలో వ్యాధినిరోధక శక్తి తగ్గడమే మూల కారణాలు. సహజంగా చర్మం అనేది అవభాషిణి, లోహిత, శ్వేత, తామ్ర, వేదిని, రోహిణి, మాంస అనే ఏడు పొరలతో నిర్మితమవుతుందని ఆయుర్వేదం చెబుతుంది. అయితే సొరియాసిస్‌లోగానీ, విటిలిగోలో గానీ, అవభాషిణి, లోహిత, శ్వేత, తామ్ర, ఈ నాలుగు పొరలే ప్రభావితమవుతుంది. 

కాకపోతే సకాలంలో వైద్య చికిత్సలు అందని సొరియాసిస్‌ వ్యాధిగ్రస్తుల్లో ఎముకలకు సంబంధించిన అస్తి కూడా ప్రభావితమై ఎముకలను దెబ్బతీసే సొరియాటిక్‌ ఆర్థరైటిస్‌ వచ్చే స్థితి కూడా ఏర్పడుతుంది. అలాగే శరీరంలోని రస, ర క్త, మాంస, మేధో, అస్థి, మజ్జ, శుక్ర అనే సస్తధాతువుల్లో మొత్తం ఏడు సొరియాసిస్‌లో ప్రభావితమవుతాయి. అదే ల్యూకోడెర్మా లేదా విటిలిగోలో రస, రక్త, మాంస మేధో ధాతువుల దాకా ప్రభావితమవుతాయి. 

మెలినోసైట్స్‌ తగ్గడమే మూలం

సొరియాసిస్‌ వ్యాధిగ్రస్తుల్లో మెలినోసైట్స్‌ అనే కణజాలం తగ్గడం వల్ల ల్యూకోడెర్మా అంటే తె ల్ల మచ్చల సమస్య వస్తుంది. ఆయుర్వేదంలో ఈ సమస్యను శ్విత్రం అంటారు. సొరియాసిస్‌లో లాగే విటిలిగో సమస్యలో కూడా వాత, పిత్త, కఫాల సమతుల్యత దెబ్బతినడమే కారణంగా ఉంటుంది. ఈ రెండు వ్యాధుల కారణం ఒకటే అయినా ముందే సొరియాసిస్‌ వచ్చి ఉంటే అది కొందరిలో విటిలిగో సమస్యగా మారుతుందని ఒక పరిశోధనలో 1955లోనే బయటపడింది. సొరియాసిస్‌లో ఎపిడెర్మిస్‌ పొర పొట్టులా రాలిపోవడం వల్ల అక్కడ చ ర్మాన్ని సజీవంగా ఉండే మెలినోసైట్స్‌ తయారయ్యే అవకాశం బాగా త గ్గిపోతుంది.ఇదే తెల్ల మచ్చలు లేదా ల్యూకోడెర్మా వ్యాధి రావడానికి కారణమవుతుంది.

 ఎలా తెలుస్తుంది? 

ల్యూకోడెర్మా వ్యాధి తొలిదశలోనే తెల్ల మచ్చల రూపంలో ఏమీ కనపడదు. కాకపోతే అక్కడక్కడ చర్మం తన సహజవర్ణాన్ని కోల్పోతుంది. అక్కడక్కడ ఎరుపు, బూడిద రంగులోకి చర్మం మారిపోతుంది. ఈ మచ్చలు కనిపించగానే అది ల్యూకోడెర్మాయేయోనని అనుమానించి ఆయుర్వేద వైద్యుల్ని సంప్రదించడం ఎంతో ఉత్తమం. ఆ దశలో నిర్లక్ష్యం చేసే అవి పూర్తి స్థాయిలో తెలుపు రంగులోకి మారిపోతాయి. శ్విత్రం వ్యాధిలో కనిపించే మచ్చలు అందరిలో తెలుపు రంగులోనే ఉంటాయని కాదు. కొందరిలో ఇవి ఎరుపు రంగులోనూ ఉండవచ్చు. శరీరంలో టైరోసిన్‌ అనే ఒక ఎంజైము ఉంటుంది.ఇది మెలినోసైట్స్‌ను ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. ఏ కారణంగానైనా టైరోసిన్‌ ఉత్పత్తి తగ్గిపోతే మెలనోసైట్స్‌ వృద్ధి తగ్గిపోయి తెల్ల మచ్చలు ఏర్పడతాయి. తెల్ల మచ్చలు ఏర్పడే క్రమంలో శరీరంలో దారుణ, అరుణ, కిలాస అనే దశలు ఉంటాయి. దారుణ ఉన్నప్పుడు వాతం ఎక్కువగా ఉండి రసధాతువు ప్రభావితం కావడం ఎక్కువగా ఉంటుంది. అరుణ ఉన్నప్పుడు పిత్తం ఎక్కువగా ఉండి, రక్త ,మాంస ధాతువులు ప్రభావితం కావడం ఎక్కువగా ఉంటుంది. అదే కిలాస ఉన్నప్పుడు కఫం ఎక్కువగా ఉండి, మేధో ధాతువు ప్రభావితం కావడం ఎక్కువగా ఉంటుంది. 

జన్యు మూలాలూ కారణమే

కుటుంబ నేపథ్యాన్ని పరిశీలిస్తే ఈ వ్యాధి జన్యుపరమైన కారణాలతో కూడా వచ్చే అవకాశం ఉందని స్పష్టమవుతోంది. విటిలిగో, సొరియాసిస్‌ ఈ రెండు వ్యాధులూ ఉన్న కుటుంబ చరిత్ర ఉన్న వారిలో 5 శాతం మంది పిల్లలు ఈ వ్యాధికి గురయ్యే అవకాశం ఉంది. సొరియాసిస్‌ కుంటుంబ చరిత్ర గల కుటుంబీకుల సంతానంలో 62 శాతం మందికి విటిలిగో వచ్చే అవకాశం ఉంది. అదే విటిలిగో కుటుంబ చరిత్రగల వారి సంతానంలో సొరియాసిస్‌ రావడానికి  28. 5 శాతం అవకాశం ఉంది. కుటుంబ చరిత్ర గల వారి సంతానంలో సొరియాసిస్‌తో పాటు విటిలిగో కూడా రావడానికి 9.5 శాతం అవకాశం ఉంది. మౌలికంగా సొరియాసిస్‌, ల్యూకోడెర్మా లేదా తెల్ల మచ్యల వ్యాధి ఒకే రకమైన చర్మవ్యాధిగా ఆయుర్వేదం గుర్తించింది. కాకపోతే సొరియాసిస్‌ శరీరంలోని సప్తధాతువుల్నీ దెబ్బ తీస్తుంది. ల్యూకోడెర్మా మాత్రం చర్మం ఉపరిభాగానికే పరిమితమై ఉంటుంది. చర్మంలో కెరటోసైట్స్‌, మెలెనో సైట్స్‌, లాంగర్‌ హాన్స్‌ , మర్కెల్‌ సెల్స్‌ అని వివిధ రకాల కణజాలం ఉంటుంది. ఇవన్నీ చర్మాన్ని పర రక్షిస్తూ ఉంటాయి. చర్మానికి సంబంధించిన వ్యాధినిరోధక శక్తిని పెంచడంలోనూ ఇవే కీలక భూమికను నిర్వర్తిస్తూ ఉంటాయి. శ్విత్రంలో ప్రధానంగా చర్మానికి జీవాన్ని, వెలుగునీ ఇచ్చే మెలినోసైట్స్‌ దెబ్బ తింటూ ఉంటాయి దీనివల్ల చర్మం తన సహజమైన వర్ణాన్ని కోల్పోతుంది. ఇలా వర్ణాన్ని కోల్పోవడం తప్ప తెల్ల మచ్చల వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏమాత్రం ఉండవు. సొరియాసిస్‌లో ఒక దశలో స్పర్శజ్ఞానం తగ్గిపోయే స్థితి ఏర్పడుతుంది. కానీ, ల్యూకోడెర్మాలో ఆ పరిస్థితి ఎప్పుడూ రాదు. అయితే శరీరంలోని అంతర్భాగాలకు కూడా చొచ్చుకుని పోయే సొరియాసిస్‌ ఒక దశలో ల్యూకోడెర్యాగా మారే ప్రమాదం ఉంది.ఏమైనా సొరియాసిస్‌ గానీ, ల్యూకోడెర్మా గానీ, వ్యాధినిరోధక శక్తి లోపాల వ ల్ల తలెత్తే సమస్య లే కాబట్టి వ్యాఽధి నిరోధక శక్తిని పెంచే వైద్య చికిత్సలే సొరియాసిస్‌కుగానీ, ల్యూకోడెర్మాకు గానీ ముఖ్యమవుతాయి. 

ఆయుర్వేద ఒక అద్భుతం

ల్యూకోడెర్మా వ్యాధి సొరియాసిస్‌లా శరీరపు అంతర్భాగాలకు చొచ్చుకుపోకపోయినా, దీని వైద్య చికిత్సలకు సొరియాసిస్‌ కన్నా ఎక్కువ సమయం పడుతుంది. దీనికి చర్మానికి సంబంధించిన మెలినోసైట్స్‌ ఉత్పత్తి తగ్గిపోవడమే కారణం మెలినోసైట్స్‌ తిరిగి ఉత్పత్తి కావడానికి అనేక రకమైన వైద్య చికిత్సలు అవసరమవుతాయి. కాకపోతే ఇవన్నీ బాహ్య చికిత్సలుగానే ఉంటాయి. వమన, విరేచన చికిత్సలతో పాటు పంచకర్మ చికిత్సలు కూడా అసవరమవుతాయి. దీనికి అనుసంధానంగా ప్రకృతి వైద్య చికిత్సలు ( నేచురోపతి) ఇచ్చి వ్యాధిని సమూలంగా తొలగించడంలో ముందువరుసలో ఉంటున్నాం. శమన చికిత్సలు, శోధన చికిత్సలు ఈ రెండూ తెల్ల మచ్చల నిర్మూలనతో ఎంతో తోడ్పడతాయి. శమన చికిత్సల్లో శరీరం ఉపరి భాగంలో చేసే చికిత్సలు, కడుపులోకి ఇచ్చే కొన్ని మందులు ఉంటాయి. శోధన చికి త్సల్లో పంచకర్మ చికిత్సలు ఉంటాయి. పంచకర్మ చికిత్సలు ఆయుర్వేద వైద్యులందరూ చేయవచ్చు అయితే, పంచకర్మ చికిత్సలో భాగంగా వాడే ఔషధాలే భిన్నంగా ఉంటాయి. ఆ ఔషధాల్ని రోగి శరీర ధర్మం, అతని వ్యాధి తీవ్రతల్ని కూదా పరిగణలోకి తీసుకుంటాం. ఆ ఔషధాల ఎంపిక ఆయుర్వేద వైద్యుడికి అపారమైన అనుభవం ఉన్నప్పుడే సమర్థవంతంగా ఉంటుంది. సత్పలితాల్ని ఇస్తుంది. ఆయుర్వేద వైద్య చికిత్సలకు అనుబంధంగా ప్రకృతివైద్య చికిత్సల్ని కూడా అనుసందానం చేయడం వల్ల ఈ వైద్య చికిత్సలు అద్బుత ఫలితాల్ని ఇస్తున్నాయి. తెల్ల మచ్చల వ్యాధి కారణంగా ఏర్పడిన మారసిక దిగులు, ఆందోళనల్ని తొలగించడానికి యోగా, ప్రాణాయామాలను కూడా ఇందులో భాగంగా చేర్చాం. ఇలా బహుముఖాలుగా వైద్య చికిత్సలు అందించడం వల్లే ఆయుర్వేద వైద్యచికిత్సలు అనూహ్యమైన ఫలితాలనిస్తున్నాయి. శరీర సౌందర్యాన్ని పూర్వ వైభవాన్ని సంతరించుకుంటోంది. 
 
 
ఆర్‌ కె ఆయుర్వేద వైద్య బృందం
ఆర్‌ కె ఆయురే ్వదిక్‌ అండ్‌ సొరియాసిస్‌ సెంటర్‌
క్లినిక్స్‌: హైదరాబాద్‌, విజయవాడ, వైజాగ్‌, హన్మకొండ, కర్నూలు, తిరుపతి 
ఫోన్స్‌: 98492 54587, 040-23057483