చలివేళ చర్మం మెరిసేలా...

చలివేళ చర్మం జాగ్రత్త!
మార్కెట్‌లో ప్రత్యేక క్రీములు, సబ్బులు   
ప్రకృతి సహజ సంరక్షణ మేలంటున్న నిపుణులు
ఖర్చు తక్కువ.. ఉపయోగాలు అనేకం

చలి కాలంతో పాటే చర్మ సంబంధిత  వాధ్యులు వస్తాయి. చర్మ పొడిబారుతుంది... పగుళ్లు ఏర్పడతాయి.. వన్నె తగ్గుతుంది. వీటిని నివారించేందుకు మార్కెట్‌లో  వివిధ క్రీమ్‌లు లభ్యమవుతున్నాయి. ప్రకృతి వైద్య సూత్రాలను పాటిస్తూ ఇంట్లోనూ కొన్ని క్రీమ్‌లను తయారు చేసుకోవచ్చు. చలికాలం నుంచి శరీరాన్ని కాపాడుకోవడం ఎలా అనే దానిపై బ్యూటీషియన్లు, ప్రకృతి నిపుణులు అందిస్తున్న సూచనలు...
గుంటూరు: శీతాకాలంలో చర్మ రక్షణకు మార్కెట్‌లో వివిధ క్రీమ్‌లు లభ్యమవుతున్నాయి. వాటిని ఉపయోగించి చర్మాన్ని కాపాడుకోవచ్చు. వీటితోపాటు ప్రకృతి సిద్ధ సంరక్షణ చేసుకుంటే ఎంతో మేలని నిపుణులు చెబుతున్నారు.
దుమ్ముధూళి చర్మంపై పేరుకుని గరుకుగా మారితే గుప్పెడు పెరస పిండిలో చెంచా తేనె, చెంచా పచ్చిపాలు కలిపి మెత్తని ముద్దలా చేసుకోవాలి. దీన్ని వారానికి మూడు సార్లు నలుగులా అద్దుకుంటే చర్మం మృదువుగా ఉంటుంది.
చర్మం నిర్జీవంగా కనిపిస్తే బొప్పాయి గుజ్జలో చెంచా తేనె, పెరుగు కలిపి ముఖానికి పూత వేసుకోవాలి. పది నిమిషాలు ఉంచి గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే సరి పోతుంది. చర్మం నిగనిగలాడుతుంది.
చర్మం మృదువుగా మారాలంటే బంతిపువ్వు రేకులను ఎండబెట్టి పొడిచేయాలి. ఈ పొడిని రోజ్‌ వాటర్‌లో కలిపి ముఖానికి అద్దుకోవాలి. పావుగంట తరువాత మంచినీటితో కడిగేస్తే సరిపోతుంది. నిర్జీవంగా ఉన్న చర్మం మెరిసిపోతుంది. వారాని రెండుసార్లు ఇలా చేస్తే పగుళ్ళు తగ్గుతాయి.
తగినంత కీరదోస, రెండు చెంచాలు నిమ్మసరం, మూడు చుక్కలు తేనె కలిపి ఫేస్‌ ప్యాక్‌గా ఉపయోగిస్తే శీతాకాలంలో మంచిది. పగుళ్ళు, చర్మం పాలిపోవడం నిరోధిస్తుంది. 
రోజుకు కనీసం నాలుగైదు లీటర్లు నీళ్ళు తీసుకుంటూ ఉంటే చర్మం సహజసిద్ధంగా ఉం టుంది. రాత్రివేళల్లో జిడ్డు లేని నూనె రాసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.  రాత్రి సమయంలో శరీరానికి నూనె పట్టించి ఉదయం స్నానం చేస్తే చర్మం మృదువుగా ఉండటమే కాదు తేమను కోల్పోకుండా ఉంటుంది.  
 
మార్కెట్‌లో క్రీమ్‌లు..
మార్కెట్‌లో వివిధరకాల కంపెనీ క్రీములు అందుబాటులో ఉన్నాయి. పతంజలి సంస్థ పలు ఆయుర్వేదిక్‌ క్రీములను అందుబాటులోకి తీసువచ్చింది. అల్మండ్‌, అరోమా, నువ్వుల నూనెలు వివిధ పేర్లతో మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. రూ.150 నుంచి ఇవి లభ్యమవుతున్నాయి. శీతాకాలంలో పెదవులు పగుళ్ల నివారణకు లిప్‌బామ్‌లతోపాటు రాత్రిపూట పడుకునే ముందు వెన్న రాసుకోవడం వంటివి చేయాలి. మార్కెట్‌లో స్టాబెర్రీ, ఆరెంజ్‌, మ్యాంగో తదితర ప్లేవర్స్‌లో లిప్‌బామ్‌లు లభ్యమవుతున్నాయి. మంచుతో కూడిన గాలలకు వెంట్రుక లు చిట్లిపోయే ప్రమాదం ఉంది. మార్కెట్‌ వీటి సంరక్షణ కోసం అనేక రకాల బ్రాండెడ్‌ నూనెలు అందుబాటులోకి వచ్చాయి. 
చలి కాలంలో చర్మాన్ని సంరక్షించే క్రీములు మా ర్కెట్లో రూ.50 నుంచి లభ్యమవుతున్నాయి. ఇందులో కొన్ని ఉత్పత్తుల గరిష్ట ధర రూ.200 వరకు ఉంటుంది.  పాండ్స్‌ కంపెనీ సాఫ్ట్‌ గోయింగ్‌ స్కిన్‌ పేరుతో కోల్డ్‌ క్రీమును అం దుబాటులో ఉంచింది. ధర రూ.85. ఇమామీ కంపెనీ మాలీ కేసరి పేరుతో ఐదు రకాల వ్యాధుల నుంచి చర్మాన్ని సంరక్షించే క్రీమును తీసుకు వచ్చింది. దీని ధర రూ.135. నార్మల్‌ టూ డ్రై స్కిన్‌ పేరుతో లిక్వోరైజ్‌ కంపెనీ రూ.100 లో కోల్డ్‌ క్రీమును విక్రయిస్తోంది. వేజ్‌లేన్‌ కంపెనీ ఇంటెన్సివ్‌ కేర్‌ క్యాప్షన్‌తో మాయిశ్చ రైజర్‌ క్రీములు విడుదల చేసింది. వీటిధర సైజును బట్టి రూ.130 నుంచి రూ.200 వరకు ఉంది. హిమాలయ కంపెనీ రకరకాల ఫ్లేవర్స్‌లో కోల్డ్‌, మాయిశ్చ రైజర్‌ క్రీములు విక్రయిస్తోంది. వీటి ధర రూ. 200 వరకు ఉంది. పియర్స్‌ కంపెనీ పలు రంగుల్లో సబ్బులు విక్రయిస్తుంది. సైజును బట్టి ధరలు ఉన్నాయి.