చర్మం.. రక్తపోటు నియంత్రణి

27-10-2017: అధిక రక్తపోటును, గుండె కొట్టుకునే వేగాన్ని నియంత్రించడంలోనూ చర్మం కీలక పాత్ర పోషిస్తుందట. రక్తనాళాల్లో రక్త సరఫరా ఎలా ఉంటుందోనని యూకేలోని యూనివర్సిటీ ఆఫ్‌ కేంబ్రిడ్జ్‌, స్వీడన్‌కు చెందిన కరోలిన్‌స్కా ఇనిస్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు ఎలుకలపై పరిశోధనలు చేయగా రక్తపోటు నియంత్రణిగా పనిచేస్తూ హృద్రోగాలు రాకుండా అడ్డుకుంటుందని తేలిందట. వాతావరణంలో ఉండే ఆక్సిజన్‌ స్థాయులను పసిగట్టి తదనుగుణంగా రక్త పీడనాన్ని, సరఫరా వేగాన్ని మార్చుతుందని గుర్తించారట. చర్మంలో ఉండే ‘హెచ్‌ఐఎఫ్‌’ ప్రొటీన్లు రక్తపోటును క్రమబద్దీకరిస్తాయని పరిశోధకులు వెల్లడించారు.