చర్మం కాలిందా?

09-10-2017: వంటింట్లో అడపా దడపా చేతులు, వేళ్లు కాలుతూనే ఉంటాయి. ఈసారి కాలిన వెంటనే నీళ్ల కింద పెట్టడమే కాకుండా ఇదిగో ఈ చిట్కా ఉపయోగించండి. మంట చిటికెలో మాయమవటంతోపాటు గాయం కూడా త్వరగా మానుతుంది. అలోవేరా గుజ్జును కాలిన ప్రదేశంలో రాయాలి. అలోవేరా గుజ్జు చర్మం మీద పొరలా పరుచుకుంటుంది. దాంతో నరాల చివర్లు గాలికి ఎక్స్‌పోజ్‌ అవకపోవటంతో మంట అదుపులోకొస్తుంది. పైగా కలబంద గుజ్జు వల్ల గాయం త్వరగా మానటంతోపాటు, ఆ ప్రదేశంలో మచ్చ ఏర్పడకుండా ఉంటుంది.