టాటూ వేయించుకున్నారా?

ఆంధ్రజ్యోతి (01-11-2019): టాటూ వేయించుకోగానే సరిపోదు. దాని ప్రభావం తగ్గించుకుని, టాటూ అందాన్ని పెంచుకోవాలనుకుంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి!

టాటూ వేయించుకున్న 1 - 3 గంటల్లో బ్యాండేజీ తొలగించాలి.
 
తర్వాత యాంటీ సెప్టిక్‌ ఆయింట్‌మెంట్‌ రోజుకు మూడుసార్లు అప్లై చేసుకోవాలి.
 
స్నానం సమయంలో టాటూ తడవనివ్వకూడదు. టాటూకు ఎక్కువసేపు ఎండ తగలనివ్వకూడదు.
 
నాలుగో రోజు మాయిశ్చరైజర్‌ వాడడం మొదలు పెట్టాలి.
 
మూడు వారాలపాటు రోజులో వీలైనన్నిసార్లు మాయిశ్చరైజర్‌ అప్లై చేస్తూ ఉండాలి.
 
టాటూ పాడవకుండా సన్‌స్ర్కీన్‌ వాడాలి.
 
టటూ మానిపోయే సమయంలో గోకడం, గిల్లడం చేయకూడదు.