వెలుగులు విరజిమ్మే ఇ-చర్మం!

03-11-2017 బీజింగ్‌: మన చర్మంపై ఒత్తిడి పడితే కమిలిపోయి రంగు మారుతుంది. కానీ చైనాలోని హుజంగ్‌ యూనివర్సిటీ పరిశోధకులు రూపొందించిన ఎలకా్ట్రనిక్‌ చర్మంపై ఒత్తిడి పడితే మెరుస్తుంది. ఎక్కువ ఒత్తిడి పడితే వెలుగుతుంది! సాధారణంగా.. సముద్రంలో ఉండే జెల్లీ ఫిష్‌లపై ఒత్తిడిపడితే వాటి శరీరం మెరుస్తుంది. ఎక్కువ ఒత్తిడి పడితే చర్మం వెలుగులు విరజిమ్ముతుంది. జెల్లీ ఫిష్‌ను స్ఫూర్తిగా తీసుకుని పరిశోధకులు ఈ ఎలకా్ట్రనిక్‌ చర్మాన్ని తయారు చేశారు. భవిష్యత్తులో రోబోలకు, అవయవ మార్పిడి సమయంలో మనుషులకు ఈ ఎలకా్ట్రనిక్‌ చర్మాన్ని ఉపయోగిస్తామని వారు చెబుతున్నారు.