కొద్ది సమయంలోనే చర్మాన్ని మెరిపించాలంటే..

ఆంధ్రజ్యోతి (12-11-2019): ఉద్యోగం చేసే మహిళలకు చర్మ సంరక్షణ మీద దృష్టి పెట్టేంత తీరిక ఉండదు. అయితే కొద్ది సమయంలోనే చర్మాన్ని మెరిపించేందుకు కొన్ని టిప్స్‌ పాటిస్తే సరి. అవేమిటంటే...

 
షవర్‌ బాత్‌: ఆఫీస్‌ పని ముగించుకొని ఇంటికి వచ్చాక షవర్‌ బాత్‌ చేస్తే రిలీ్‌ఫగా ఉంటుంది. వేడినీళ్లతో షవర్‌ స్నానం చేస్తే చర్మ రంధ్రాలు తెరచుకుంటాయి. తరువాత నిమ్మ రసంతో మోచేతులు, మోకాళ్లు , పాదాల వద్ద మసాజ్‌ చేసినట్టు రాసుకోవాలి. తరువాత గోరువెచ్చని నీళ్లతో కడుక్కోవాలి. దీంతో మృతకణాలు తొలగి, చర్మం మృదువుగా మారుతుంది.
 
సహజ మాస్క్‌: రోజ్‌వాటర్‌లో యోగర్ట్‌ కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి మాస్క్‌లా వేసుకోవాలి. పావుగంటయ్యాక గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. తరువాత మాయిశ్చరైజర్‌ అప్లై చేయాలి.
 
కళ్ల మీద ఒత్తిడి తగ్గేలా: ల్యాప్‌టాప్‌, కంప్యూటర్‌ స్ర్కీన్‌ వంక ఎక్కువ సమయం చూడడం వల్ల కళ్ల మీద ఒత్తిడి పడుతుంది. కీరదోస ముక్కల్ని 15 నిమిషాలు కళ్ల మీద ఉంచాలి. కీరలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కళ్లను రిలాక్స్‌ చేస్తాయి. కళ్ల కింద వలయాలు తొలగిపోతాయి.