చర్మ సంరక్షణ కోసం...

01-02-2018: మీ చర్మ గుణం ఎలాంటిదైనా తేమను అందించాలి. లేదంటే పెళుసుగా మారుతుంది. చర్మానికి తేమ కోసం...

జిడ్డు చర్మం అయితే చిటికెడు కర్పూరం, టేబుల్‌ స్ఫూన్‌ తేనె కలిపిన మిశ్రమాన్ని చర్మంపైన మృదువుగా రాసి ఐదు నిమిషాల తరువాత కడగండి. దీనివల్ల చర్మం సహజంగా తేమను సంతరించుకుంటుంది. రక్త ప్రసరణ పెరుగుతుంది.
పొడి చర్మం అయితే టేబుల్‌ స్పూన్‌ తేనెలో కొంచెం బాదం నూనెను కలిపి రాస్తే మంచి ఫలితం ఉంటుంది.