స్నానం చేసేటప్పుడు అలా చేస్తే.. యమ డేంజర్

23-09-2017: బాత్రూమ్‌ను మనం రెగ్యులర్ గా వినియోగిస్తుంటాం. శరీరాన్ని శుభ్రం చేసుకునేందుకు రకరకాల పద్ధతులను పాటిస్తుంటాం. ఈ నేపధ్యంలో మనం కొన్ని తప్పులను కూడా చేస్తుంటాం. ఇటువంటివి శరీరంపై చెడు ప్రభావాన్నిచూపిస్తాయి. వీటినుంచి తప్పించుకునేందుకు నిపుణులు కొన్ని సలహాలిస్తున్నారు.

చాలా వేడిగా లేదా చాలా చల్లగా ఉన్ననీటితో స్నానం చేయడం వలన స్కిన్ టిష్యూస్ దెబ్బతింటాయి.

అత్యధిక సమయం పాటు షవర్‌చేస్తే మాయిశ్చర్ శాతం తగ్గిపోతుంది. దీంతో స్కిన్ డ్రైగా మారిపోతుంది. ఫలితంగా శరీరంపై ఇన్ఫెక్షన్ తయారవుతుంది.

తెల్లగా అయిపోవాలని ఎక్కువ సేపు శరీరంపై స్క్రబ్ చేయడం వలన చర్మం పైభాగం పగిలిపోయి ఇన్ఫెక్షన్‌కు దారితీస్తుంది.

మెడికేటెడ్ లేదా కెమికల్ బేస్డ్ సోప్‌ను అధికంగా వినియోగించడం వలన స్కిన్‌ను ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడే బాక్టీరియా నశించిపోతుంది.

షాంపూ వినియోగించిన తరువాత కండీషనర్ ఉపయోగించకపోతే జుట్టు డ్రైగా తయారవుతుంది. జుట్టు ఆకర్షణ తగ్గిపోతుంది.

స్నానం చేసిన తరువాత టవల్‌తో గట్టిగా రుద్దుకోవడం వలన జుట్టు, చర్మానికి హాని కలుగుతుంది.

షవర్ తరువాత మాయిశ్చరైజర్ రాసుకోపోతే స్కిన్ డ్రైగా మారిపోతుంది. దద్దుర్లు, దురదలు వచ్చే ప్రమాదం ఏర్పడుతుంది.