డెర్మటైటిస్‌కు సరైన చికిత్స

20-02-2018: డెర్మటైటిస్‌ అంటే చర్మం వాపు. చర్మం ఎరుపు రంగులోకి మారి దురద, మంట ఏర్పడి అవి బొబ్బలకు కారణమవుతాయి. ఇది శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా కుంగదీస్తుంది. శరీరంలో పేరుకుపోయే విషపదార్థాలు ఈ వ్యాధి రావడానికి ఒక కారణం. ఈ వ్యాధి వివిధ రకాలుగా ఉంటుంది.

 
కాన్‌టాక్ట్‌ డెర్మటైటిస్‌
దీన్ని స్పర్శ చర్మశోధ అంటారు. దీనికి గురైతే చర్మం మీద దద్దుర్లు వస్తాయి. అలర్జీని కూడా కలిగిస్తుంది. రబ్బరు తొడుగులు, ఆభరణాలలో ఉండే కోబాల్ట్‌ కారణంగా చర్మం అలర్జీకి గురవుతుంది. ఫేస్‌క్రీమ్స్‌, డియోడరెంట్స్‌ వల్ల కూడా ఇది వచ్చే అవకాశం ఉంది.
 
నుమ్ముల్లా డెర్మటైటిస్‌
ఇది నాణెం ఆకారంలో ఉంటుంది. ఇది సాధారణంగా కాళ్లు, చేతులు, భుజాలు, నడుము భాగాలపై ఎక్కువగా వ్యాపిస్తుంది. ఇది ఎక్కువగా 55 నుంచి 65 ఏళ్ల వయసు వారికి ఎక్కువగా సంభవించే అవకాశం ఉంది.
 
ఎగ్జిమా
ఇది ఓ రకమైన డెర్మటైటిస్‌. చర్మం ఎర్రగా కమిలిపోవడం, కొద్దిగా పొరలుగా తయారవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దురద ప్రధాన లక్షణం. ఈ వ్యాధి ప్రబలడం కూడా సులువుగా గుర్తించవచ్చు. మొదట చర్మం ఎరుపు రంగులోకి మారుతుంది. తర్వాత పొక్కులు వస్తాయి. ఇవి క్రమంగా నీటి బుగ్గల ఆకృతిలోకి మారతాయి.
 
సెబరియక్‌ డెర్మటైటిస్‌
ఇది ముఖ్యంగా ముఖం, జుట్టులోని స్కాల్ప్‌పై ఎక్కువగా వస్తుంది. చర్మం పసుపు రంగులోకి మారుతుంది. ఇంకా కనుబొమ్మల సమీపంలో, ముక్కు పక్కన కూడా వస్తుంది. అధిక ఒత్తిడి కారణంగా కూడా కావచ్చు.
 
కారణాలు
కొన్ని రకాల మందులు వాడటం వల్ల వస్తుంది
జుట్టు కోసం వాడే రంగులు, కుంకుమ మొదలైన పదార్థాల వల్ల డెర్మటైటిస్‌ వస్తుంది
జంతు చర్మాలతో తయారైన ఉత్పతుల్ల కారణంగా కూడా వ్యాపిస్తుంది.
బ్యాక్టీరియా, ఫంగల్‌ ఇన్ఫెక్షన్లు కూడా డెర్మటైటిస్‌ వ్యాప్తికి దోహదం చేస్తాయి.

లక్షణాలు

చర్మం ఎర్రగా కమిలిపోవడం
చర్మం పొరలుగా తయారవడం, వాపులు రావడం
 
వ్యాధి నిర్థరణ
స్కిన్‌ బయోప్సీ

హోమియో చికిత్స: డెర్మటైటి్‌సకు హోమియోలో మంచి మందులు ఉన్నాయి. హోమియోలో యాంటి మోనియమ్‌క్రుడమ్‌, అపిస్‌ మెల్లిఫికా, రస్‌టాక్సిన్‌కోటెన్‌డ్రాన్‌, సలేఫర్‌ వంటి మందులు డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి.