అర్టికేరియా సమస్యకు అద్భుత వైద్యం

ఆంధ్రజ్యోతి(16-10-2016): మానవ శరీర అవయవాల్లోకెల్లా చర్మం అతి పెద్దది.శరీర అంతర్గత అవయవాలకు అదొక రక్షణ కవచం కూడా. సాధారణంగా వాతావరణ మార్పులు, అలర్జీలు మరి కొన్ని ఆటో ఇమ్యూన్‌ వ్యాధుల మూలంగా ఎన్నో చర్మసమస్యలు ఎదురవుతుంటాయి. ఇవన్నీ ఒకేలా ఉండటంతో, ఎలాంటి చర్మవ్యాధితో బాధపడుతున్నామన్న విషయం తెలియక చాలామంది సతమతమవుతుంటారు. అలాంటి వాటిలో అర్టికేరియా ఒకటి. ఈ వ్యాధి తలెత్తిన వారి చర్మంపై ఉన్నట్లుండి దద్దుర్లు ఏర్పడటంతో పాటు విపరీతమైన దురద మొదలగు ఇతర లక్షణాలు కనిపిస్తాయి. ఇవి కొన్ని నిమిషాల నుంచి కొన్ని గంటల వరకు కనబడి, తదుపరి పూర్తిగా అదృశ్యమవుతాయి. మరికొందరిలో ఇవి దీర్ఘకాలికంగా కొనసాగుతాయి. వీటిని గుర్తించి, తగిన చికిత్స అందించకుండా నిర్లక్ష్యం చేస్తే, ఒక్కోసారి ఇవి ప్రమాదకరంగా మారే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ అర్టికేరియా వ్యాధి పట్ల అవగాహన పెంచుకోవడం ఎంతైనా అవసరం.
అర్టికేరియా అనేది ఒక సాధారణ చర్మసమస్య. ప్రతి ఐదుగురిలో ఒకరు తమ జీవితకాలంలో ఏదో ఒక సమయంలో ఈ సమస్య బారిన పడుతుంటారు. అన్ని వయస్సుల వారిని ప్రభావితం చేసే ఈ సమస్య ప్రభావం సీ్త్ర, పురుషులలో సమాన స్థాయిలో ఉంటుంది. అర్టికేరియాను ‘హీవ్స్‌’ అని కూడా అంటారు. దీని వల్ల చర్మంపై దురదతో కూడిన దద్దుర్లు ఏర్పడతాయి. కొందరిలో ఇవి 24 గంటల లోపున వాటంతట అవే తగ్గిపోతుంటాయి. 
అర్టికేరియా 2రకాలు
అక్యూట్‌ అర్టికేరియా: అర్టికేరియా లక్షణాలు 6 వారాల కంటే తక్కువ రోజులు ఉన్నట్లయితే దానిని అక్యూట్‌ అర్టికేరియా అంటారు. ఇది అర్టికేరియా సమస్యను ప్రేరేపించే అంశాలు ఎదురైనప్పుడు కలుగుతుంది. 
క్రానిక్‌ అర్టికేరియా: అర్టికేరియా సమస్య 6 వారాలకు మించి కొనసాగినట్లయితే దానిని క్రానిక్‌ అర్టికేరియా అంటారు. ఈ సమస్యకు గల కచ్చితమైన కారణాల పరంగా ఇంతవరకూ స్పష్టత లభించలేదు. కానీ ఈ సమస్యకు సంకేతాలుగా శరీరంలో అంతర్లీనంగా ఉండే వివిధ ఆరోగ్య సమస్యలు అంటే ముఖ్యంగా థైరాయిడ్‌, లూపస్‌ మొదలైన వాటి వలన అర్టికేరియా ఉత్పన్నమయ్యే అవకాశం కలదు. 
ఇవీ కారణాలు 
మన శరీరానికి సరిపడని పదార్థాలు లోనికి ప్రవేశించినప్పుడు వాటికి ప్రతిస్పందనగా చర్మంలో శోధం కలిగించే ప్రక్రియ ద్వారా. కొన్ని కణాలు హిస్టమిన్‌ తో పాటు మరికొన్ని ఇతర రసాయనాలను రక్తప్రసరణలోకి విడుదల చేయడం వల్ల అర్టికేరియా సమస్య ఏర్పడుతుంది. ఇది కొన్ని ఆటో ఇమ్యూన్‌ వ్యాధుల వల్ల కూడా రావచ్చు. ఇవే కాకుండా, నొప్పి నివారణకు ఉపయోగించే కొన్ని మందులు, కీటకాలు, పరాన్న జీవులు, ఇన్‌ఫెక్షన్లు కలిగించే బ్యాక్టీరియా, వైర్‌సలు, ఇందుకు కారణం కావచ్చు ఇవీ లక్షణాలు చర్మంపై ఎరుపు లేదా చర్మపు రంగులో ఏర్పడే దద్దుర్లు విపరీతమైన దురదను కలిగిస్తాయి ఈ దద్దుర్లు నొప్పి లేదా మంట, వాపు కలిగిస్తాయి. ఇవి కళ్లచుట్టూ బుగ్గలపైన, పాదాలు, చేతులు, పెదాలపై ఎక్కువగా ఏర్పడతాయి. వాపు గొంతులో ఏర్పడితే, ఆ వాపు వాయుద్వారాలకు అడ్డుగా నిలవడం వల్ల, ఒక్కోసారి ప్రాణాంతకంగా కూడా మారవచ్చు. ఈ దద్దుర్ల పరిమాణం స్థిరంగా ఉండకుండా, పెరగడం, తరగడం జరుగుతూ ఉంటుంది. వీటిని ప్రేరేపించే అంశాలకు గురైనప్పుడు ఆ తేడా కనిపిస్తూ, ఆ తర్వాత అదృశ్యమవుతూ ఉంటుంది. ఈ దద్దుర్ల పైన ఒత్తిడిని కలిగించినప్పుడు ఇవి తె ల్లగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. 
వ్యాధినిర్ధారణ కోసం
అక్యూట్‌ అర్టికేరియా వ్యాధి నిర్ధారణలో సాధారణంగా పరీక్షల అవసరమేమీ ఉండదు. దీర్ఘకాలికంగా ఉంటూ పదేపదే వచ్చే అర్టికేరియాకు మాత్రం సిబిపి, ఈ్‌సఆర్‌, టిఎ్‌సహెచ్‌ (థైరాయిడ్‌ స్టిములేటింగ్‌ హార్మోన్‌) ఏఎన్‌ఏ (యాంటీ న్యూక్లియర్‌ యాంటీబాడీస్‌ వంటి పరీక్షలు అవసరమవుతాయి. , అర్టికేరియల్‌ వాస్‌క్యులైటిస్‌ వ్యాధి నిర్ధారణకు పంచ్‌ బయాప్సి పరీక్ష చేయవలసి ఉంటుంది. 
హోమియో చికిత్స 
కాన్‌స్టిట్యూషనల్‌ హోమియోపతిలో భాగంగా, సూక్ష్మీకరణ పద్ధతిలో తయారైన హోమియో మందులతో రోగనిరోధక కణాలకు పునరుజ్జీవం కల్పించి, ఎలాంటి దుష్పలితాలు లేకుండా అర్టికేరియా సమస్యను పూర్తిగా తగ్గించవచ్చు. ఈ విశిష్ట చికిత్స హోమియో కేర్‌ ఇంటర్నేషనల్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. వ్యాధి రీత్యా రోగి శరీర నిర్మాణం, వ్యక్తిగత, మానసిక లక్షణాల పరిశీలన తదుపరి మాత్రమే అందించబడే ఈ చికిత్సతో అర్టికేరియాను పూర్తిగా నయం చేయవచ్చు. 
 
డాక్టర్‌ శ్రీకాంత్‌ మోర్లవర్‌ 
CMD
హోమియోకేర్‌ ఇంటర్నేషనల్‌ 
టోల్‌ ఫ్రీ : 1800 108 1212 
ఉచిత కన్సల్టేషన్‌ 9550001188/99 
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు