చలికాలంలో చెవిలో శబ్దాలా?

ఆంధ్రజ్యోతి (03-12-2019): చలికాలంలో చెవి సమస్యలు చాలా ఎక్కువగానే ఉంటాయి. ముఖ్యంగా, చెవుల్లో హోరు, వినిపించకపోవడం, చెవుల్లో తేనెటీగెల మోత వంటి శబ్దాలు కొంత మందిని చాలా ఇబ్బంది పెడుతుంటాయి. చెవి సంబంధమైన నాడులు బలహీనమవడం వల్ల చెవుల్లో శబ్దాలతో పాటు తలతిరగడం ఉన్నా, ఉంటే ‘శాలిసికం యాసిడం- 30’మందు బాగా పనిచేస్తుంది.

 
చెవుల్లో కొందరికి చీలుస్తున్నట్లు విపరీతమైన నొప్పి కలుగుతుంది. ఇలాంటి వారు ‘స్కిల్లా-మారిటిమా- 30’ మందు వేసుకుంటే త్వరితంగా ఉపశమనం లభిస్తుంది.
చెవులు దిబ్బడ వేయడంతో పాటు, గుబిలి పట్టడం, ఆ కారణంగా చెవుడు రావడం, చలికాలంలో ఒక సమస్య., ఇదే సమయంలో ముక్కునుంచి నల్లని రక్తం రావడం, జెల్లీ వంటి చిక్కటి మ్యూకస్‌ చేరడం, ముక్కులో దురద, దిబ్బడ ఉంటే ‘సెలీనియం- 30’ మందు బాగా ఉపయోగపడుతుంది.
 
కుడిచెవి వేడిగానూ, ఎడమ చెవి చల్లగానూ ఉండడంతో పాటు చెవుల్లో గోడగడియారపు టిక్‌టిక్‌ధ్వనులు, చెవుల్లో వాపు, చెవిపోటు వంటి సమస్యలు ఉంటే ‘టెరెబింత్‌- 30’మందు వేసుకోవాలి. దీని వల్ల చాలా వేగంగా ఆ సమస్యలనుంచి విముక్తి
పొందవచ్చు.
 
- డాక్టర్‌ బి. అనిల్‌ కుమార్‌,
హోమియో వైద్య నిపుణులు, హైదరాబాద్‌