వ్యాయామం వ్యసనమైతే ప్రమాదం!

బెర్లిన్‌, ఫిబ్రవరి 6: శరీరం ఫిట్‌గా ఉండాలంటే వ్యాయామం అవసరమే. కానీ.. అది వ్యసనంగా మారకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదేపనిగా అధిక వ్యాయామం చేస్తే ఆరోగ్యానికి హానికరమని జర్మనీలోని కార్ల్స్‌రుహే ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ శాస్త్రవేత్తలు తాజా అధ్యయనంలో వెల్లడించారు. ముఖ్యంగా అధికంగా తినే రుగ్మతతో బాధపడుతున్న వారికి ఇది చాలా ప్రమాదమని వారు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో తినే రుగ్మతలతో బాధపడే వారు నిస్పృహ, మానసిక స్థితి, ప్రతికూల ఆలోచనలను నియంత్రించడానికి వ్యాయామం చేసేందుకు మొగ్గుచూపుతారని గుర్తించారు. అయితే ఇది వ్యసనంగా మారితే అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉందని వారు వెల్లడించారు.