ఉప్పుతో గ్యాస్‌ సమస్య

గ్యాస్‌ సమస్య రావడానికి చాలా కారణాలున్నాయన్న సంగతి తెలిసిందే! అయితే ఉప్పు కూడా గ్యాస్ రావడానికి కారణమవుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఉప్పులో ఉండే సోడియం మ‌న జీర్ణాశ‌యంలోని ప‌దార్థాలు జీర్ణ‌మ‌య్యేట‌ప్పుడు వాటిపై ప్ర‌భావం చూపిస్తుంద‌ట‌. దీంతో గ్యాస్ బాగా ఉత్ప‌త్తి అవుతుంద‌ని వారంటున్నారు. అలాగే ఫైబ‌ర్ ఉన్న ప‌దార్థాల‌ను ఎక్కువ‌గా తిన‌డం వ‌ల్ల కూడా జీర్ణాశ‌యంలో గ్యాస్ బాగా పెరిగిపోతుంద‌ని వారు తేల్చారు. ప్ర‌పంచ వ్యాప్తంగా అధిక శాతం మందిని ఇబ్బంది పెడుతున్న ఈ సమస్యను అదుపు చేయాలంటే ఉప్పు త‌క్కువ‌గా, ఫైబ‌ర్ ఒక మోస్తరుగా ఉన్న ప‌దార్థాల‌ను తీసుకోవాల‌ని వారు సూచిస్తున్నారు. దీంతోపాటు అన్ని పోష‌కాల‌ను  స‌మ‌పాళ్ల‌లో తీసుకోవ‌డం ద్వారా జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరు మెరుగు ప‌డుతుంద‌ని, దీంతో జీర్ణాశ‌యం ప‌రంగా వ‌చ్చే అన్ని స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చ‌ని వారు చెబుతున్నారు.