కన్‌సీలర్‌ వాడుతున్నారా?

ఆంధ్రజ్యోతి (03-12-2019): నల్లమచ్చలు, మొటిమలు కనిపించకుండా హెవీమేకప్‌ వేసుకోవాల్సిన అవసరం లేదు. కన్‌సీలర్‌ ఉంటే చాలు వాటిని దాచేయొచ్చు. అయితే చర్మతత్వానికి సరిపడే కన్‌సీలర్‌ ఎంచుకోవడంతో పాటు దాన్ని సరిగ్గా ఉపయోగించడం తెలయాలి అంటున్నారు సౌందర్య నిపుణులు... అవేమిటంటే..

 
రెండు షేడ్స్‌ ఉండాలి: అన్ని సీజన్‌లకు ఒకే కన్‌సీలర్‌ సరిపోదు. కాబట్టి వేసవి, శీతాకాలంలో వాతావరణానికి తగ్గట్టుగా రెండు షేడ్స్‌ ఉన్న కన్‌సీలర్స్‌ వాడాలి. మిగతా రోజుల్లో ఈ రెండిటిని కలగలిపి వాడితే మీ స్కిన్‌టోన్‌కు చక్కగా సరిపోతుంది.
 
రెండు రంగులు: నల్లమచ్చలు, మొటిమల్ని దాచేయడానికి ఏ రంగు కన్‌సీలర్‌ పనికొస్తుందో తెలుసుకొని కొనాలి. పసుపురంగు కన్‌సీలర్‌ వాడితే ఎర్రమచ్చలు, కళ్ల కింది వలయాలు కనిపించవు. అలాగే ఆకుపచ్చ కన్‌సీలర్‌తో మొటిమలు, వాటి తాలూకు మచ్చల్ని దాచేయచ్చు.
 
సహజకాంతిలో: కన్‌సీలర్‌ అప్లై చేసేటప్పుడు తగినంత వెలుతురు ఉండాలి. లేదంటే మీ చర్మానికి ఏరకం సరిపోతుందో తెలియదు. కాబట్టి కిటికి గుండా సూర్యరశ్మి పడుతున్న చోట నిల్చొని కన్‌సీలర్‌ వాడాలి. ఇలాచేస్తే మీ స్కిన్‌టోన్‌కు కన్‌సీలర్‌ ఏదో తెలుస్తుంది.
 
చేతితో తాకొద్దు: మేకప్‌ రంగు కన్‌సీలర్‌ స్టిక్‌కు అంటేందుకు చేతితో ముట్టుకోవద్దు. సింథటిక్‌ కన్‌సీలర్‌ బ్రష్‌ సాయంతో కళ్ల కింద మూడు చుక్కలు పెట్టి మేకప్‌ బ్రష్‌తో స్ర్పెడ్‌ చేయాలి.
 
నో కన్‌సీలర్‌: కళ్ల కింద ఏర్పడే వలయాల మీద కన్‌సీలర్‌ రాయొద్దు. దీంతో అవి హైలైట్‌ అయి ఎబ్బెట్టుగా కనిపిస్తాయి. ముఖం మీద ఏర్పడే ముడతలు, గీతల మీద కన్‌సీలర్‌ అప్లై చేస్తే అవి మరింత స్పష్టంగా కనిపించే వీలుంది.