తుమ్ములు తగ్గే మార్గం లేదా?

నా వయస్సు 35 సంవత్సరాలు. నేను ఆరేళ్లుగా ఆస్తమాతో బాధపడుతున్నాను. స్థానికంగా ఎంత మంది డాక్టర్లకు చూపించుకున్నా ఫలితం లేదు. చలికాలం, వర్షాకాలంలో నా సమస్య మరింత తీవ్రమవుతోంది. మందులు వాడినపుడు ఉపశమనంగా ఉంటుంది. ఆపేస్తే మళ్లీ మామూలే. ఇటీవల స్నానం చేసినా 10 నిమిషాల పాటు తుమ్ములు వస్తున్నాయి. నా సమస్య తగ్గే మార్గం లేదా? తెలియజేయండి. 

- రాణి, జమ్మలమడుగు 
 
ఆస్తమా దీర్ఘకాలికంగా ఉండే వ్యాధి. ఇది పూర్తిగా తగ్గిపోయే అవకాశం చాలా తక్కువ. ముందుగా మీ ఊపిరితిత్తుల పనితీరును తెలుసుకోవడానికి లంగ్‌ ఫంక్షనల్‌ టెస్ట్‌ చేయించుకోండి. ఎక్స్‌రే కూడా అవసరమవుతుంది. అలాగే అలర్జీ వల్ల కూడా తుమ్ములు వస్తుంటాయి. కాబట్టి వ్యాధి నిర్దారణ పరీక్షలు చేయించుకుని మందులు వాడితే వ్యాధి అదుపులో ఉంటుంది. ముఖ్యంగా ఈ ఆస్తమా ఉన్న వాళ్లు చల్లగాలికి తిరగడం, కూల్‌డ్రింక్‌లు తాగడం లాంటి వాటికి దూరంగా ఉండాలి.
- డాక్టర్‌ సూరజ్‌ సక్సేనా, అలర్జీ వ్యాధి నిపుణులు