మద్యంతో టీబీ.. పోషకాహార లోపంతోనూ..

25-08-2017: అతిగా మద్యం సేవించడం, పోషకాహార లోపం వల్ల దక్షిణ భారతదేశంలో క్షయ(టీబీ) వేగంగా విస్తరిస్తోందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. మహిళల్లో పోషకాహార లోపం వల్ల 61 శాతం క్షయ బారిన పడినట్లు గుర్తించారు. ఆల్కాహాల్‌ తగ్గిస్తేనే పురుషుల్లో వస్తున్న ఈ వ్యాధిని 75 శాతం తగ్గించవచ్చని తెలిపారు. అమెరికాలోని బోస్టన్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌, తమిళనాడులోని జవహర్‌లాల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ పరిశోధకులు వేలాది టీబీ కేసుల్ని పరిశీలించి పోషకాహార లోపం, అతి మద్యాన్ని తగ్గిస్తే క్షయ వ్యాధికి అడ్డుకట్ట వేయొచ్చని తేల్చారు.