మా పౌడర్‌లో ఆస్‌బెస్టస్‌ లేదు

 

  • జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ స్పష్టీకరణ
  • దర్యాప్తునకు అమెరికా న్యాయశాఖ ఆదేశం
వాషింగ్టన్‌, జూలై 13: తమ సంస్థ ఉత్పత్తి చేసే బేబీ పౌడర్‌లో ఆస్‌బెస్టస్‌ ఉందన్న ఆరోపణలను జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ ఖండించింది. పౌడర్‌లో ఎలాంటి కేన్సర్‌ కారకాలు లేవని స్పష్టం చేసింది. అయితే.. వేలాది మంది కేన్సర్‌ వ్యాధిగ్రస్తులు, తమకు కేన్సర్‌ సోకడానికి ఆ సంస్థ చేసిన బేబీ పౌడరే కారణమని చేసిన ఫిర్యాదుల మేరకు అమెరికా న్యాయశాఖ విచారణకు ఆదేశించింది. తమపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమైనప్పటికీ.. ప్రభుత్వ విచారణకు పూర్తిగా సహకరిస్తామని ఆ సంస్థ ప్రకటించింది.