భారతీయుల గుండెకే ముప్పు ఎక్కువ

దుబాయ్(07-01-2017) : భారత ఉపఖండానికి చెందిన చాలామందిలో గుండెజబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు దుబాయ్‌లో డాక్టర్‌గా పనిచేస్తున్న దినేష్ బాబు చెబుతున్నారు. ఆయన మెడియర్ హస్పిటల్‌లో కార్డియాలజిస్టుగా పనిచేస్తున్నారు. ఆయన దగ్గరికి వచ్చే గుండె జబ్బుల కేసుల్లో ఎక్కువగా భారత ఉపఖండానికి చెందినవారే ఎక్కువగా ఉన్నారన్నారు. వారిలో ఎక్కువమంది రక్తనాళాల్లో కొవ్వు పేరుకుని ఉండటం వల్ల  గుండెజబ్బులు వస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకు వారు తీసుకునే ఆహారమే కారణమని ఆయన చెబుతున్నారు. మిగతా దేశాల్లోని ప్రజలకు గుండెజబ్బుల ముప్పు ఉన్నా, వారిలో కొవ్వు పేరుకుపోవడం ఇంతగా లేదని ఆయన అన్నారు. అంతేకాదు భారతీయుల్లో ఎక్కువమందికి ధమనుల సైజు తక్కువగా ఉంటుందని అందువల్లే చాలామందిలో కొవ్వు పేరుకుపోవడం మిగతా దేశాల ప్రజలతో పోలిస్తే, ఎక్కువగా ఉంటున్నట్లు ఆయన చెప్పారు.