బాలుడి కడుపులో 400 రాళ్లు

 

శస్త్రచికిత్స చేసి తొలగించిన వైద్యులు
ముస్తాబాద్‌, జనవరి 9: ఆ బాలుడికి కడుపు నొప్పి అంటే చూపించని ఆస్పత్రి లేదు. రకరకాల ఆస్పత్రులు తిప్పి వైద్య పరీక్షలు చేయిస్తే చివరకు బాలుడి పెద్దపేగుల్లో రాళ్లు ఉన్నట్లు తెలిసింది. దీంతో ఆపరేషన్‌ చేసిన వైద్యులు కడుపులో బయటపడ్డ రాళ్లను చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే బాలుడి కడుపులో నుంచి ఐదో.. పదో కాదు ఏకంగా 400 రాళ్లు బయటపడ్డాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటకు చెందిన ఆఫ్రాన్‌(5)కు తరచూ కడుపునొప్పి రావడంతో అతని తల్లిదండ్రులు ముస్తాబాద్‌లోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షలు చేసిన వైద్యులు బుధవారం పేగుల్లో నుంచి 400కు పైగా రాళ్లను తొలగించారు. కాగా, మట్టి తినే అలవాటు ఉన్న బాలుడు.. ఈ రాళ్లను కూడా మింగినట్లు అనుమానిస్తున్నారు.