వెంట వెంటనే కాన్పులైతే..

ఆంధ్రజ్యోతి,17-8-15: బిడ్డకు బిడ్డకు మధ్య కనీసం రెండు సంవత్సరాలు తేడా ఉండేట్టు చూసుకోవాలట లేకపోతే తల్లికి ఆస్టియోపొరోసిస్‌ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటున్నారు యేల్స్‌ విశ్వవిద్యాయానికి చెందిన పరిశోధకులు. ఆస్టియోపొరోసి్‌సలో క్యాల్షియం, విటమిన్‌-డి లోపం కారణంగా ఎముకలు కణజాలాన్ని కోల్పోయి పెళుసుగా తయారవుతాయట. ఈ పరిశోధన కోసం ఆస్టియోపొరోసి్‌సతో బాధపడుతున్న మెనోపాజ్‌ దశకు చేరని 239మంది మహిళలని, అలాగే ఎటువంటి ఎముకల బలహీనతలూ లేని వాళ్లని 298మందిని ఎంచుకున్నారు. ప్రెగ్నెన్సీలకి మధ్య కనీసం సంవత్సరమైనా వ్యవధి లేనివాళ్లు ఈ వ్యాధి బారినపడే అవకాశం నాలుగురెట్లు అధికంగానే ఉందని ఆ పరిశోధనలో వెల్లడైంది. మెనోపాజ్‌ దశ కంటే ముందే ఎముకలు బలహీనతపై ప్రెగ్నెన్సీల మధ్య వ్యవధితో పాటు బిడ్డకి పాలివ్వడం, మొదటి ప్రెగ్నెన్సీ అప్పుడు తల్లి వయసు వంటి అంశాలు ప్రభావాన్ని చూపుతాయి అని యాలే  విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్త డాక్టర్‌ గుల్సిన్‌ సాహిన్‌ ఇస్రాయ్‌ చెబుతున్నారు. పరిశోధనలో భాగంగా మెనోపాజ్‌ దశకు చేరుకోని మహిళలను పరీక్షించగా 27 సంవత్సరాల కన్నా తక్కువ వయసులో తల్లయిన వాళ్లలో  ఆస్టియోపొరోసిస్‌ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని వెల్లడైంది.