కీళ్ల నొప్పులతో నడి వయసులోనే ముసలితనం ముంచేసిందా?

26-12-2018: నా పేరు సరిత. వయసు 49 సంవత్సరాలు. నల్గొండ జిల్లా. నేను కొంతకాలంగా మోకాళ్ల నొప్పితో విపరీతంగా బాధపడుతున్నా. కొంత దూరం నడవాలన్నా, మెట్లు ఎక్కాలన్నా, దినచర్యలు నిర్వహించాలన్నా నొప్పి వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. మందులు వాడుతున్నా పూర్తిగా ఉపశమనం లభించడం లేదు. హోమియో చికిత్స ద్వారా శాశ్వత పరిష్కారం లభిస్తుందా? సలహా ఇవ్వగలరు.
 
మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీ సమస్య ‘‘ఆస్టియో ఆర్థరైటిస్‌’’ అని చెప్పవచ్చు. ఈ వ్యాధి వల్ల కీళ్లలోని ‘‘కార్టిలేజ్‌’’ మృదులాస్థి అరిగిపోయి, తద్వారా చుట్టూ ఉన్న కణజాలంపై ప్రభావం చూపుతుంది. ఈ సమస్యను సాధారణంగా 40 ఏళ్లు పైబడిన వారిలో చూస్తుంటాం. కానీ ప్రస్తుత జీవనశైలి కారణంగా తక్కువ వయసు వారిలో కూడా వస్తుంది. ఈ సమస్య వల్ల కింద కూర్చోలేక పోవడం, నొప్పి వల్ల రాత్రి పూట సరిగ్గా నిద్ర పట్టకపోవడం వంటి సమస్యలను మనం గమనించవచ్చు. కాన్స్‌టిట్యూషనల్‌ హోమియో వైద్య విధానం ద్వారా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉంది.
 
ఆస్టియో ఆర్థరైటిస్‌: సమస్య మొదలైన కొన్ని రోజులకు కార్టిలేజ్‌ క్రమంగా అరిగిపోతుంది. దీంతో క్రమేణా అది పలుచగా మారిపోతుంది. ఫలితంగా ఎముకల్లోని కణజాలం, శోధమునకు గురవుతుంది. దీంతో ఎముకల చివరి భాగాలు అదనంగా పెరుగుతాయి. వీటిని ‘ఆస్టియో పైట్స్‌’ అంటారు. వీటి ప్రభావం వల్ల సైనోవియల్‌ పొర కొద్దిగా ఉబ్బి, అదనపు ద్రవాన్ని విడుదల చేయడం వల్ల కీలు ప్రాంతంలో వాపు ఏర్పడుతుంది. ఈ రెండు ఎముకలూ ఒక దానితో ఒకటి రాపిడికి గురి కావడం వల్ల తట్టుకోలేనంత నొప్పి ఉంటుంది.
 
కారణాలు:
40 ఏళ్ల వయసు పైబడడం, ముఖ్యంగా స్త్రీలలో ఈ సమస్య ఎక్కువగా ఏర్పడుతుంది. అధిక బరువు ఉండడం, కీళ్లపై ఒత్తిడి కలిగించే పనులు చేయడం, గతంలో కీళ్లకు దెబ్బ తగలడం, కీళ్లలోని కార్టిలేజ్‌లో జన్యుపరమైన లోపాలు ఉండడం, కొన్ని ఇతర వ్యాధులు. (ఉదా: రూమటాయిడ్‌ ఆర్థరైటిస్‌)

లక్షణాలు:

కీళ్లలో నొప్పి, వాపు, చేతులతో తాకితే వేడిగా అనిపించడం.
కీళ్లు బిగువుగా మారడం, ముఖ్యంగా ఉదయాన్నే నిద్ర లేచిన తరువాత కొంత సమయం నడక కష్టంగా అనిపించడం.
కీళ్ల దగ్గర రాపిడి శబ్దాలు వినిపించడం.
తీవ్రమైన నొప్పి వల్ల నడిచే తీరులో వ్యత్యాసం కనిపించడం.
వెన్నెముక, ఆస్టియో ఆర్థరైటిస్‌కు గురయితే చేతులు, కాళ్లలో బలహీనత, మొద్దుబారడం, తిమ్మిర్లు వంటి లక్షణాలు కనిసిస్తాయి.
భారతదేశంలో 2000 సంవత్సరం నుంచి 46 మిలియన్ల ప్రజలు ‘‘ఆస్టియో ఆర్థరైటిస్‌’’తో బాధపడుతున్నారు. ప్రతి సంవత్సరం వీరి సంఖ్య పెరుగుతూనే ఉంది. 2018లో సుమారు 60 మిలియన్ల మంది ఆస్టియో ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌, బీహార్‌లో మహిళల్లో కన్నా పురుషుల్లో ఈ వ్యాఽధి ఎక్కువగా కనిపిస్తుంది. చాలామంది ఆస్టియో ఆర్థరైటిస్‌ వ్యాధితో హోమియోకేర్‌ ఇంర్‌నేషనల్‌ను సంప్రతించి, చికిత్స తీసుకుంటున్నారు. అందులో 85 శాతం మంది రోగులు చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పటికీ చాలామంది రోగులు చికిత్స తీసుకుంటున్నారు. ఈ వ్యాధి సంపూర్ణంగా నయం అయ్యే అవకాశముంది.
డాక్టర్‌ శ్రీకాంత్‌ మోర్లవర్‌ (సీఎండీ)
హోమియోకేర్‌ ఇంటర్‌నేషనల్‌
టోల్‌ ఫ్రీ 18001081212
ఉచిత కన్సల్టేషన్‌ 95500011/99
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి