సయాటికా సమస్యకు ఏకైక పరిష్కారం

ఆంధ్రజ్యోతి,23/05/15

సయాటికా...ఈ పదాన్ని ఆధునిక యుగంలో యుక్త, మధ్య వయస్సు వారిలో వినని వారు ఉండరు. ఈ నొప్పి వర్ణనాతీతంగా, భరింపరానిదిగా ఉండటమే కాకుండా దైనందిన జీవితంలో ఆటంకాన్ని కలిగిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఈ సమస్యతో తమ విధులు సరిగ్గా నిర్వర్తించలేకపోతున్నారు. అయితే ఈ సమస్యను త్వరగా గుర్తించి సరియైన చికిత్సను అందించడంతో పాటు దైనందిన జీవితంలో మార్పులు చేసుకోవడం, ఫిజియోథెరపీ, యోగ వంటివి చేయడం ద్వారా పూర్తిగా నివారించవచ్చు. ముఖ్యంగా సయాటికా అంటే ఆపరేషన్‌ వరకు వెళ్లాల్సి వస్తుందని చాలా మంది భయపడుతుంటారు. కానీ హోమియో మందులతో ఎటువంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేకుండా తగ్గించవచ్చు.
శరీరంలో అన్నిటి కన్నా పెద్ద నరం సయాటికా. ఇది కింది వీపు భాగం నుంచి పిరుదుల మీదుగా కాలు వెనక భాగం గుండా పాదాల వరకు ప్రయాణిస్తుంది. ఈ నరం ఇతర ఐదు నరాల (ఎల్‌4, ఎల్‌5, ఎస్‌1,ఎ్‌స2,ఎస్‌3) సమూహాలతో ఏర్పడి ఉంటుంది. వెన్నుపూస లోపల నుంచి ప్రయాణించు నరాలపైన ఒత్తిడి వల్ల కాలు వెనక భాగం నొప్పికి గురవుతుంది. దీనినే సయాటికా నొప్పి అంటారు. ఈ నొప్పి వీపు భాగంలో నుంచి పాదం వరకు ఉంటుంది. తిమ్మిర్లు, స్పర్శ తగ్గిపోవడం, మంటలు, నడకలో మార్పు వంటి లక్షణాలు కనిపిస్తాయి. 

కారణాలు

నర్వ్‌ కంప్రెషన్‌ : నరాలపై ఒత్తిడి పడటం వల్ల నొప్పి ప్రారంభమవుతుంది.
స్పైనల్‌ డిస్క్‌ హెర్నియేషన్‌ : ఎల్‌ 4, ఎల్‌ 5 నరాల రూట్స్‌ ఒత్తిడికి గురై సరియైన పొజిషన్‌లో వంగక పక్కకు జరిగి సయాటికా నొప్పి వస్తుంది. 
స్పైనల్‌ స్టెనోసిస్‌ : ఎముకల్లో ఏర్పడే స్పర్శ వల్ల వెన్నెముక కంప్రెస్‌ అవుతుంది. ఇది కూడా నొప్పికి కారణమవుతుంది. 
పైరిఫార్శిస్‌ సిండ్రోమ్‌ : దెబ్బలు, గాయాలు తగిలినప్పుడు పైరిపార్శిస్‌ కండరము వాచి నరాలపై ఒత్తిడిని కలగజేస్తుంది.
సాక్రోఇలియక్‌ జాయింట్‌ డిస్క్‌ ఫంక్షన్‌ : శారీరక శ్రమ, వ్యాయామం లేకపోవడం వల్ల కీలు సరిగ్గా పనిచేయక సయాటికా నొప్పి రావచ్చు.
ప్రెగ్నెన్సీ : గర్భిణుల్లో పిండం బరువు పెరిగి నరాలపై ఒత్తిడి పడటం వల్ల నొప్పి వస్తుంది.

పరీక్షలు

డాక్టర్‌ సమక్షంలో కొన్ని వ్యాయామాలు చేయడం ద్వారా సయాటికా నొప్పిని గుర్తించవచ్చు. డిస్క్‌ హెర్నియేషన్‌, డిస్క్‌ప్రొలా్‌ప్సని గుర్తించడానికి ఎమ్‌ఆర్‌ఐ స్కాన్‌ ఉపయోగపడుతుంది. నరంపై ఎక్కడ ఒత్తిడి పడుతుందో ఇందులో స్పష్టంగా తెలిసిపోతుంది. 

హోమియో చికిత్స

సయాటికా నొప్పి, వెన్నుపూస సమస్యలకు హోమియో వైద్య విధానంలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. ఎక్స్‌రే, ఎమ్‌ఆర్‌ఐ పరీక్షలు చేయించిన తరువాత సమస్యను నిర్ధారణ చేసుకుని చికిత్స అందించడం జరుగుతుంది. ఆపరేషన్‌ లేకుండానే మందులతో సయాటికా సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. 

లక్షణాలు - హోమియో మందులు

రస్‌టాక్స్‌: కండరాల వాపు వల్ల కలిగే నొప్పికి రస్‌టాక్స్‌ సరైన మందు. ఈ నొప్పి చల్లగాలికి ఎక్కువ అవుతుంది. ఎడమవైపు నొప్పి ఉంటుంది. నొప్పితోపాటు తిమ్మిర్లు, స్టిఫ్‌నెస్‌ ఉండి నొప్పి తొడల నుంచి కిందకు వ్యాపిస్తుంది. కూర్చొని లేస్తే నొప్పి విపరీతంగా ఉంటుంది. కొంతసేపు నడిచిన తర్వాత ఉపశమనం ఇచ్చే నొప్పికి ఇది మంచి ఔషధం. రస్‌టాక్స్‌ సర్వైకల్‌ స్పాండి లోసిస్‌, లుంబార్‌ స్పాండిలోసి్‌సకు కూడా పనిచేస్తుంది.
కోలోసింథ్‌: నొప్పి నరాలు లాగినట్లుగా భరించరానిదిగా ఉంటుంది. ఈ నొప్పి పిరుదుల నుంచి మోకాలు, పాదం వరకు పాకుతుంది. నొప్పి కదిలినా, ముట్టుకున్న, చల్లటి వాతావరణంలో ఎక్కువ అవుతుంది. వేడికాపు, ఒత్తిడి వల్ల నొప్పి నుంచి కొద్దిగా ఉపశమనం కలుగుతుంది. కుడివైపు కాలికి వచ్చే సయాటికాకు మంచి మందు.
రోడోటెన్‌ట్రాన్‌: సర్వైకల్‌ స్పాండిలోసి్‌సకు ఇది మంచి ఔషధం. నొప్పి ఎక్కువగా వేసవి వాతావరణంలో వస్తుంది. స్టిఫ్‌నెస్‌ ఎక్కువగా మెడ భాగంలో ఉండి నొప్పి భుజాల వరకు పాకుతుంది. విశ్రాంతి తీసుకోకుంటే నొప్పి ఎక్కువ అవుతుంది. వాతావరణం మార్పుల వల్ల వచ్చే నొప్పి ఈ మందుతో తగ్గుతుంది. 
కాస్టికమ్‌: కాస్టికమ్‌ నరాలపై బాగా పనిచేస్తుంది. కండరాల శక్తి కోల్పోయి, మంట, భరించ రాని నొప్పి ఉన్నవారికి ఇది మంచి మందు. మెడ భాగంలో నొప్పి ఉండి భుజాల వరకు స్టిఫ్‌నెస్‌ ఉంటుంది. ఎడమవైపు వచ్చే సయాటికా నొప్పికి ఇది మంచి ఔషధం.
 
డాక్టర్‌ మురళీ అంకిరెడ్డి, ఎం.డి., హోమియో
స్టార్‌ హోమియోపతి 
సికింద్రాబాద్‌, ఫోన్‌ : 8977336677