స్పాండిలైటిస్‌ - ఇక నో ప్రాబ్లమ్‌

ఆంధ్రజ్యోతి,03-01-12

మనిషిని అచేతనావస్థతలోకి నెట్టేసే వ్యాధులలో ముఖ్యమైనది స్పాండిలైటిస్‌. నడుమునొప్పి, మెడనొప్పితో మొదలై శరీర కదలికలను పూర్తిగా నియంత్రించగల స్పాండిలైటిస్‌కు జెనెటిక్‌ హోమియో చికిత్సావిధానంతో సులభంగా నయం చేయవచ్చంటున్నారు మనూస్‌ హోమియో వైద్య నిపుణులు డాక్టర్‌ శ్రీకర్‌ మను.

మెడ నొప్పికి, నడుమునొప్పికి అతి సాధారణ ముఖ్య కారణం స్పాండిలైటిస్‌. చిన్న చిన్న నొప్పులను అశ్రద్ధ చేయడంతోపాటు వెన్నెముకకు చెందిన ఎముకలలో జరిగే దీర్ఘకాలిక మార్పుల కారణంగా మొదలయ్యే ఈ స్పాండిలైటిస్‌ చాలా మందిలో అకస్మాత్తుగా బయటపడి శరీర కదలికలను పూర్తిగా నియంత్రించే పరిస్థితికి కూడా దారితీయవచ్చును. వయసుతోపాటు వెన్నుపూసలో జరిగే సహజ మార్పులకు ఒక ప్రేరేపకం తోడై సహజ నిర్మాణాన్ని దెబ్బతీసి తద్వారా మొదలయ్యే రకరకాల రోగ లక్షణాల సమూహానికి ముఖ్య కారణంగా ఈ స్పాండిలైటిస్‌ని గుర్తించవచ్చును.

సాధారణ లక్షణాలు

ఆధునికత ముసుగులో అలవర్చుకున్న సుఖాలకు ప్రతిఫలంగా అన్ని వయసుల వారిలో మొదలవుతున్న ఈ స్పాండిలైటిస్‌ మెడ నొప్పి లేదా నడుము నొప్పితో మొదలై భుజాలు, చేతులు, కాళ్ల, తల వంటి భాగాలకు నొప్పి వ్యాపిస్తుంది. తలనొప్పి, చెవులలో శబ్దం రావడం, కళ్లు తిరగడం, చేతులు, కాళ్లలో తిమ్మిర్లు, సయాటికా, కండరాలు బిగుసుకుపోవడం, నడుము కదలికలు పరిమితం కావడం జరుగుతుంది.

ప్రమాద సూచికలు

నడక, కాళ్ల కదలికలలో అసమతుల్యత. మూత్రం, లేదా విరేచనంపైన నియంత్రణ కోల్పోవడం. దీర్ఘకాలంగా జ్వరం వంటి లక్షణాలతో బాధపడడం. అకస్మాత్తుగా స్పృహ కోల్పోవడం. చాలాకాలంగా అరిచేతులు, కాళ్లలో తిమ్మిర్లు, మంటలు ఉండడం. డిస్క్‌ సమస్యల కారణంగా నరాలపై ఒత్తిడి పడి తద్వారా మొదలయ్యే లక్షణాలు కనపడడం. కాళ్లలో లేదా చేతులలో బలం తగ్గడం. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్తపడడం మంచిది.

ముఖ్యమైనరకాలు

సర్వైకల్‌ స్పాండిలైటిస్‌: మెడలో ఎముకలను ఎక్కువగా ప్రభావితం చేయడం సాధారణం. మధ్య వయసు వారిలో ఎక్కువగా కనిపించే ఈ రకం వయసు పెరుగుతున్న కొద్దీ వెన్నెముక అంతటా వ్యాపించే అవకాశం ఉంది.

లంబార్‌ స్పాండిలైటిస్‌: వెన్నెముక కింది భాగంలో నొప్పితో కూడిన లక్షణాలు మొదలవడం ముఖ్య సంకేతం. స్త్రీలలో ఎక్కువ శాతం కనిపిస్తూ రకరకాల దుష్ప్రభావాలకు దారితీసే స్థితిగా దీన్ని వైద్య పరిశోధన అధ్యయనాలు పేర్కొన్నాయి.

యాంకిలూసింగ్‌ స్పాండిలైటిస్‌: వెన్నెముకను ప్రభావితం చేసే ఈ స్పాండిలైటిస్‌ని ఒక ఆటో ఇమ్యూన్‌ డిజార్డర్‌గా పేర్కొనవచ్చు. వెన్నుపూస, ఎముకలు, బిగుసుకుపోవడం దీని ముఖ్య లక్షణం.

వ్యాధి నిర్ధారణ

శారీరక పరీక్షలు, కేసు హిస్టరీతోపాటు ఎక్స్‌రే, సిటి స్కాన్‌, ఎంఆర్‌ఐ వంటి ఆధునిక పరిజ్ఞానం ద్వారా వ్యాధి నిర్ధారణ జరగడం సులభం. వీటితోపాటు హెచ్‌ఎల్‌ఎ బి-27, ఆర్‌ఎ, సిఆర్‌పి, ఈస్‌ఆర్‌ వంటి రక్త పరీక్షలు అవసరాన్ని బట్టి సూచించడం జరుగుతుంది. వెన్నుపూసకు గాయాలు, ఆర్థరైటిస్‌, టిబి వంటి వ్యాధులకు సరైన చికిత్స తీసుకోకపోవడం, సరైన శారీరక శ్రమ లేకపోవడం, కొన్ని రకాల మందుల దుష్ప్రభావాలు, పౌష్ఠికాహార లోపం, హార్మోన్‌ల అసమతుల్యత వల్ల స్పాండిలైటిస్‌ లక్షణాలు మొదలుకావచ్చును.

హోమియో చికిత్స
రోగ మూలకారణాన్ని అన్వేషించి తద్వారా అనారోగ్యం కారణంగా ప్రబలిన రకరకాల లక్షణాలను అంచనా వేసి సరైన జెనెటిక్‌ మందుల ద్వారా సంపూర్ణ ఆరోగ్యం చేకూర్చే అవకాశం కేవలం హోమియో మందులతో ఉన్నట్లు నిపుణుల అధ్యయనాల్లో తేలింది. అయితే రోగికి సంబంధించి సంపూర్ణ సహకారం, జీవితాంతం తీసుకోవలసిన జాగ్రత్తలు వంటివి ఫలితాలకు ముఖ్య నిర్దేశకాలు అవుతాయి. జీవితాంతం మందులను వాడవలసిన అవసరం లేకపోవడం, ఆహార నియమాలపై నిబంధనలు లేకపోవడం ఆధునిక హోమియో వైద్య విశిష్టత. మనిషి మనిషికి మారే చికిత్సా విధానంలో హోమియో వైద్యుల పర్యవేక్షణ కచ్చితంగా అవసరం. సొంత వైద్యాలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం.
 
డా. శ్రీకర్‌ మను
ఫౌండర్‌ ఆఫ్‌ డా. మనూస్‌ హోమియోపతి,
ఫోన్‌ : 9032108108
 9030 339  999