స్పాండిలైటిస్‌కు శాశ్వత పరిష్కారం

ఆంధ్రజ్యోతి,29/10/14
 
యుక్తవయసులో వెన్నునొప్పా! ఆంకిలోజింగ్‌ స్పాండిలైటిస్‌ కావచ్చు. చాలామందికి వెన్నునొప్పి  వయస్సు పైబడిన వారిలోనే ఉంటుందని తెలుసు. కాని చిన్న వయసువారిలో వచ్చే వెన్నునొప్పులలో ఆంకిలోజింగ్‌ స్పాండిలైటిస్‌ ఒక కారణం. ఆంకిలోజింగ్‌ స్పాండిలైటిస్‌ చాలా ప్రమాదకరమైన వెన్నుకు సంబంధించిన జబ్బు. దీనిని ఎంత త్వరగా గుర్తించి చికిత్స చేయించుకుంటే వెన్నెముకలో ఏర్పడిన వైకల్యాన్ని అదుపు చేయవచ్చంటున్నారు హోమియో వైద్యనిపుణులు డాక్టర్‌ శ్రీకాంత్‌ మొర్లావర్‌. 

ఆంకిలోజింగ్‌ స్పాండిలైటిస్‌ ముఖ్యంగా 20 నుంచి 30 సంవత్సరాల వయస్సు ఉన్న వారిలో వచ్చే అవకాశం ఉంటుంది. స్త్రీ పురుషులలో 1:3 నిష్పత్తిలో ఈ వ్యాధిన బారినపడతారు. ఆంకిలోజింగ్‌ స్పాండిలైటిస్‌ వ్యాధి బారినపడిన వారిలో 90 శాతం మందికి హెచ్‌ఎల్‌ఏ-బి 27 యాంటిజెన్‌ ఉండవచ్చు. మానవ శరీర నిర్మాణంలో వెన్నెముక అతి ముఖ్యమైనది. దీని నిర్మాణం చాలా క్లిష్టమైనది. వెన్నెముక ఒక చిన్న ఎముకల సముదాయం. ఈ ఎముకలు శరీరంలోని స్థానాన్ని బట్టి సర్వైకల్‌ (సీ1, సీ7), థొరాసిక్‌(టి1-టి12), ల్యుంబార్‌(ఎల్‌1-ఎల్‌5), శాక్రం(ఎస్‌1-ఎస్‌5) మరియు కాక్సి-4 ఎముకలు మొత్తంగా 33 ఎముకల సముదాయం. మృధులాస్ఠి అనే స్పాంజిలాంటి పదార్థం. లిగమెంట్స్‌ వీటికి తోడుగా కండరాలతో నిర్మితమై స్ర్పింగ్‌లాగా అన్ని వైపులా కదలికలకు తోడ్పడుతుంది. వెన్నెముక మెదడు నుంచి వచ్చే వెన్నుపామును మరియు దాని నుంచి వచ్చే ఇతర నరాలను తగిన వీలు కల్పిస్తూ కాపాడుతుంది. వెన్నెముకకు వచ్చే సాధారణ వ్యాధులు సర్వైకల్‌ స్పాండిలైటిస్‌, లుంబార్‌ స్పాండిలైటిస్‌, ఆంకిలోజింగ్‌ స్పాండిలైటిస్‌

ఆంకిలోజింగ్‌ స్పాండిలైటిస్‌: ఇది ఒక ఆటో ఇమ్యూన్‌ డిసీజ్‌. ఇది మనలోని రోగనిరోధక వ్యవస్థ అసమతుల్యతల వల్ల వచ్చే జబ్బు. ఇందులో ముఖ్యంగా వెన్నెముకలో ఉండే లిగమెంట్లు, కార్టిలేజ్‌లకు వ్యతిరేకంగా యాంటిబాడీస్‌ తయారై దాడి చేస్తాయి. ఆంకిలోజింగ్‌ స్పాండిలైటిస్‌లో ముఖ్యంగా తుంటి కీళ్లు, వెన్నెముకలో ఉండే ల్యుంబార్‌ స్పైన్‌ కలిసిపోయి కదలికలను కోల్పోతుంది. ఇదే విధంగా వెన్నెముకలో ఉండే చిన్న చిన్న వెన్నుపూసలు, దాని మధ్యలో ఉండే కణజాలంలో ఫైబ్రోసిస్‌ కణజాలం ఏర్పడి వెన్నెముక తన సహజ కదలికలను కోల్పోతుంది. ఇలా కదలికలను కోల్పోయి గట్టిగా మారిన వెన్నెముక బొంగుకర్రల తయారవుతుంది. దీనినే బాంబోస్పైన్‌ అంటారు. ఈవ్యాధి బారినపడిన వారు వంగలేరు, మెడ, నడుము కదలికలు ఆగిపోవడంవల్ల చాలా ఇబ్బంది పడుతుంటారు. ఈ వ్యాధి తీవ్రత అధికంగా ఉన్నప్పుడు మాత్రం వెన్నెముకతో పాటు ఛాతీ పక్కటెముకలు కూడా కదలికలు కోల్పోయి శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. 

రోగ లక్షణాలు: ముఖ్యంగా రోగ లక్షణాలు యుక్త వయసులో నెమ్మదిగా ప్రారంభమవుతాయి. వ్యాధి తీవ్రతను బట్టి వివిధ రకాల రోగ లక్షణాలు ఉంటాయి. వ్యాధి ప్రారంభ దశలో సాధారణం నుండి అతి తీవ్రమైన తుంటి, నడుం నొప్పి ఉండవచ్చు. నడుం పట్టేయడం లేదా బిగుసుకుపోవటం. వ్యాధి ముదిరితే మెడనొప్పి ఉండవచ్చు. మెడ బిగుసుకు పోయి సాధారణ కదలికలు సాధ్యం కాకపోవచ్చు. 40శాతం ఆంకిలోజింగ్‌ స్పాండిలైటిస్‌ ఉన్న వారిలో కంటికి సంబంధించిన లక్షణాలు ఉంటాయి. కళ్లు ఎర్రగా మారటం, కంటి నొప్పి, వెలుతురును చూడలేకపోవటం వంటి లక్షణాలు ఉండవచ్చు. కొన్ని సందర్భాలలో కంటిచూపు మందగిస్తుంది. నీరసం, అలసటగా ఉండటం, స్వల్ప జ్వరం ఉండటం వంటి లక్షణాలు కూడా ఉంటాయి.

కాంప్లికేషన్స్‌: స్పైనల్‌ ఫ్రాక్చర్‌- వెన్నుపూసలు ఆస్టియో సోరోసిస్‌కు గురయ్యే అవకాశం ఉంది. అంకిలోజింగ్‌ స్పాండిలైటిస్‌ వ్యాధి తీవ్రంగా ఉంటే వెన్నుముకలోంచి వచ్చే నరాలు ఒత్తిడికి గురవడం వల్ల కాళ్లు, చేతులు తిమ్మిర్లు రావటం, మంటలు రావడం, సూదులతో గుచ్చినట్టు ఉండటం, సత్తువ కోల్పోవటం వంటి లక్షణాలకు దారితీస్తుంది. ఊపిరితిత్తులకు సంబంధించిన ఇబ్బంది. చాలా కాలం నొప్పి మాత్రలు వాడటం వల్ల మూత్రపిండాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది.

రోగ నిర్ధారణ పరీక్షలు: సాధారణంగా అంకిలోజింగ్‌ స్పాండిలైటిస్‌ను రోగ లక్షణాలతో నిర్ధారణ చేయవచ్చు. సీబీపీ, ఈఎస్సార్‌, సి-రియాక్టివ్‌ ప్రొటీన్‌, ఎక్స్‌రే, ఎంఆర్‌ఐ, స్పైన్‌, హెచ్‌ల్యాబ్‌ 27, ఆంటిలోజిన్‌ టెస్ట్‌లతో పాటు ఇతర వ్యాధి నిర్ధారణ పరీక్షల ద్వారా వ్యాధి తీవ్రతను  గుర్తించవచ్చు.

హోమియో వైద్యం: ముందు చెప్పిన విధంగా ఇది ఒక ఆటోఇమ్యూన్‌ డిసీస్‌. దీనికి హోమియోకేర్‌ ఇంటర్నేషనల్‌లో సరైన జెనటిక్‌ కాన్‌స్టిట్యూషనల్‌ ట్రీట్‌మెంట్‌ విధానం వల్ల వ్యాధి తీవ్రత పెరగకుండా చూడటమే కాకుండా, వ్యాధిని పూర్తిగా నయం చేసే అవకాశం ఉన్నది. అంకిలోజింగ్‌ స్పాండిలైటిస్‌ని త్వరగా గుర్తించి వైద్యం చేస్తే వెన్నెముక పూర్తిగా పాడవకుండా నివారించవచ్చు. నొప్పిని సంపూర్ణంగా నయం చేయవచ్చు.
 
డాక్టర్‌ శ్రీకాంత్‌ మొర్లవార్‌ (సీఎండీ)
హోమియోకేర్‌ ఇంటర్నేషనల్‌ ప్ర్తె.లి.
 ఫోన్‌ : 9550001199/88
టోల్‌ ఫ్రీ : 1800 102 2202