కీళ్లు దృఢంగా ఉండాలంటే?

29-10-2019: కీళ్లు తేలికగా అరిగిపోకుండా ఉండాలంటే నిర్దిష్టమైన పదార్థాలు తీసుకోవాలి. కీళ్ల మధ్య మృదులాస్థి గట్టిపడిపోకుండా చేసే ఆ ఆహారం ఏదంటే?
 
నీళ్లు: కీళ్ల దగ్గర ఉండే మృదులాస్థి, ఇతర కణజాలాల మధ్య రాపిడి పెరగకుండా ఉండడం కోసం ‘సైనోవియల్‌ ఫ్లూయిడ్‌’ అనే ద్రవం ఉంటుంది. కీళ్లు కదిలేటప్పుడు ఈ ద్రవం ఆ ప్రదేశంలో ఒరిపిడి లేకుండా చేస్తుంది. ఈ ద్రవం సరిపడా తయారవాలంటే రోజుకు రెండు లీటర్లకు తగ్గకుండా నీళ్లు తాగుతూ ఉండాలి.
 
ఉల్లి, వెల్లుల్లి: ఎముకలు, మృదులాస్థి, టెండాన్ల తయారీకి తోడ్పడే ఖనిజ లవణాలు ఉల్లి, వెల్లుల్లిలో పుష్కలంగా ఉంటాయి. కాబట్టి కీళ్లు, మృదులాస్థి, టెండాన్లు, కొల్లాజెన్‌ ఆరోగ్యంగా ఉండాలంటే ఉల్లి, వెల్లుల్లి తరచుగా తింటూ ఉండాలి.
 
విటమిన్‌ సి: నారింజ, బత్తాయి, స్ట్రాబెర్రీ, నిమ్మలో ఉండే ఒమేగా 3, విటమిన్‌ సిల శరీరంలో తలెత్తే ఇన్‌ఫ్లమేషన్‌ను కుంటుపరుస్తాయి. కీళ్ల దగ్గర ఉండే మృదులాస్థి, కొల్లాజెన్‌ వృద్ధికి దోహదపడతాయి.