ఈ జ్యూస్‌తో కీళ్ల నొప్పులు దూరం!

25-06-2018: కీళ్ల నొప్పులకు పైపూతలు, నోటి మాత్రలు సరిపోవు. అంతర్గతంగా కీళ్ల మధ్య మృదులాస్థిని పెంచే ఆహారమూ తీసుకోవాలి. ఇదిగో ఈ జ్యూస్‌ ఆ కోవకు చెందినదే!
 
కావలసినవి
క్యారట్లు - 6, - సెలరీ స్టాక్స్‌ - 3
పైనాపిల్‌ ముక్కలు - 1 కప్పు,
నిమ్మకాయ - అర చెక్క
 
తయారీ ఇలా
పైన చెప్పిన వాటన్నిటినీ బ్లెండర్‌లో వేసి తిప్పాలి.
వడగట్టుకుని చల్లగా తాగేయాలి.
ఉప్పు, చక్కెర జోడించకూడదు.
పరగడుపునే తాగితే ఫలితం ఉంటుంది.
(పైనాపిల్‌లోని ‘బ్రోమిలీన్‌’ అనే ఎంజైమ్‌ సహజసిద్ధమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ సబ్‌స్టెన్స్‌గా పని చేస్తుంది. కాబట్టి ఈ రసం తీసుకుంటే తరచుగా వాస్తూ, నొప్పి పెట్టే కీళ్ల సమస్య తగ్గుతుంది)