ఐదు కారణాల వెన్నునొప్పికి పంచకర్మలతో విముక్తి

ఆంధ్రజ్యోతి,09-07-13

దూలాలు పగుళ్లు పడుతుంటే,  సిమెంటు పూతలతో ఏమవుతుంది? డిస్కులు అరిగి ఒరిగిపోతున్నప్పుడు  మెడకు, నడుముకు బెల్టులు బిగదీసుకుంటే ఏమిటి  ప్రయోజనం? పెయిన్‌ కిల్లర్లు, స్టెరాయిడ్లు, సర్జరీలు ఎలా కాపాడతాయి? వాటి వల్ల ఏదైనా ఉపశమనం కలిగినా అది తాత్కాలికమే మరి! వెన్ను నొప్పి శాశ్వతంగా పోవాలంటే వాతాన్ని హరించే చికిత్సలే చేయాలి. ఆయుర్వేదం ఆ పనే చేస్తుంది. అందుకే అద్భుతాలు జరుగుతున్నాయి.  వెన్నెముకే కాదు, జీవితమూ స్థిరంగా నిలబడాలంటే ఆయుర్వేదం ఒక్కటే మార్గం అంటున్నారు ఆయుర్వేద నిపుణులు డాక్టర్‌ వర్థన్‌.
 

వెన్నునొప్పి. కొందరికి ఇదసలు విషయమే కాదు. కొందరికి మాత్రం ఇదో పెద్ద అసౌకర్య కారకం అయితే,  చాలా మందికి ఇదొక న్యూసెన్స్‌. దైనందిన జీవితాన్ని చిందరవందర చేసే బాధాకరమైన ఒక తీవ్ర సమస్య. కోట్లాదిమందిని తమ ఉద్యోగ, వ్యాపారాల విద్యుక్త ధర్మాలకు దూరం చేసే ఒక తీవ్ర సమస్య వెన్నునొప్పి. ప్రపంచ వ్యాప్తంగా  తరుచూ డాక్టర్లను సంప్రదించేలా చేసే రెండవ అతి పెద్ద కారణం కూడా ఇదే. . ఊపిరి ఆడకుండా చేసే ఆస్తమా లాంటి శ్వాసకోశ వ్యాఽధులు మొదటి కారణమైతే ఆ రెండవ కారణం వెన్నునొప్పి సమస్యే. ఎక్కువ మందిలో ఇది వయసు పైబడిన కారణంగా వస్తూ ఉంటుంది. మొత్తంగా చూస్తే 60 ఏళ్లు దాటితే గానీ, వయసు పైబడినట్లు కాదు. కానీ, వెన్నెముక మాత్రం 30 ఏళ్లకే క్షీణించడం మొదలెడుతుంది. అందుకే 30 ఏళ్లకే చాలా మందిలో వెన్నునొప్పి సమస్యలు మొదలవుతాయి.  గుండె జబ్బులు, కేన్సర్‌ తరువాత  ఇతర వైద్యవిధానాల్లో  అంత భారీ ఎత్తున డబ్బు  ఖర్చు అయ్యేది వెన్నునొప్పికే. అంత ఖర్చు చేసినా ఆ వైద్య విధానాలన్నీ  తాత్కాలిక ఉపశమనాన్ని ఇవ్వగలవే గానీ, సమస్యను సమూలంగా పెరికి వేయలేవు. అతి  తక్కువ ఖర్చుతో వ్యాధిని వేళ్లతో సహా పెకిలించి వేసేది ఎప్పటికైనా ఆయుర్వేదం ఒక్కటే.

మూల కారణాలు ఐదు
శరీర భంగిమా లోపాలు, అంతర్గత వ్యాఽధులు, అధిక  బరువు, శరీర శ్రమ లేకపోవడం, మానసిక ఒత్తిళ్లు ఇవే ఐదు. 

భంగిమ లోపాల్లో ....శరీర భంగిమల్లోని ఆ  లోపాలేమిటి? వె న్నెముకకు ముడివడి ఉండే కండరాలు, లిగమెంట్లు, టెండాన్లు, ఫేసెట్‌ జాయింట్లు ఇవే శరీర భంగిమను నిటారుగా నిలబెడుతూ ఉంటాయి. వీటిలో ఏ ఒక్కదానిలో లోపం ఉన్నా, శరీరం అటో ఇటో వంగిపోతుంది. భంగిమలోనే లోపాలుంటే, కండరాలు, లిగమెంట్లు, టెండాన్లు, ఫేసెంట్లు జాయింట్లు ఒత్తిడికి లోనై అంతిమంగా వెన్నుపూసల్లో గానీ, డిస్కుల్లో గానీ సమస్యలు మొదలవుతాయి.

అంతర్గత వ్యాధులు: కీళ్లు అరిగిపోయే ఆర్థరైటిస్‌గానీ, స్పాండిలైటిస్‌ గానీ, ఎముకలు గుల్లబారిపోయే ఆస్టియో పొరోసిస్‌ గానీ, ఇవన్నీ వెన్ను సమస్యలకు కారణం కావచ్చు. అలాగే డిస్కుల్లో క్షీణగతి ఏర్పడటం కారణం కావ చ్చు. గనేరియా, సిఫిలిస్‌ వంటి సుఖవ్యాధులు  కూడా వెన్నునొప్పికి కారణం కావచ్చు. ఇవే కాకుండా దీర్ఘకాలికంగా ఉండే మధుమేహం, అధిక రక్తపోటు కూడా ఈ సమస్యకు దారి తీయవచ్చు. వీటికి తోడు అధిక బరువు, శరీర శ్రమలేని  ఉద్యోగ వ్యాపారాలు, శారీరక మానసిక ఒత్తిళ్లు ఇవన్నీ కారణమవుతాయి.

ఇవీ లక్షణాలు
నొప్పి నడుము లేదా మెడ భాగానికే పరిమితమై ఉండవచ్చు. లేదా శరీరంలోని  ఇతర భాగాలకూ వ్యాపించవచ్చు. సమస్య పెరిగితే సూదులతో పొడిచినట్లు, మొద్దుబారినట్లు అనిపించవచ్చు. అప్పటికీ వైద్య చికిత్సలు అందకపోతే, తలనొప్పి, కళ్లు తిరిగినట్లు అనిపించడం, ఒక్కోసారి కళ్లు మరీ తిరిగిపోయి హఠాత్తుగా కింద పడిపోనూ వచ్చు. నాడీ వ్యవస్థ ఒత్తిడికి గురైతే, లైంగిక సమస్యలూ తలెత్తవచ్చు. స్త్రీలలో రుతుక్రమంలో తేడాలు రావచ్చు. 

వెన్నునొప్పి రావడనానికి ప్రధానంగా ఐదు మౌలిక కారణాలు ఉన్నాయన్నది తెలిసిందే. అయితే  ఈ ఐదింటికి  ఐదు విభిన్నమైన వైద్య చికిత్సలు  జరగాలి. ఆ విభిన్నమైన విధానాలే ఆయుర్వేదంలోని పంచకర్మ చికిత్సలు. 

ఆయుర్వేదం విశిష్టత ఏమిటి?
ఐదు విభిన్న మార్గాల్లో అంటే పంచకర్మ చికిత్సలతో ఒక బలిష్టమైన , ఆరోగ్యవంతమైన వెన్ను వ్యవస్థను ప్రసాదిస్తుంది.  ఈ పంచకర్మ చికిత్సా విధానాలు కేవలం నొప్పిని నియంత్రించడానికే పరిమితం కాకుండా, నొప్పికి మూలకారణమైన వాతాన్ని హరించే చికిత్సలు చేస్తుంది. అయితే,  ధాతుక్షయం  వల్ల ఏర్పడిన వాతమా? నాడీ వ్యవస్థలో అంతరాయాలు ఏర్పడే మార్గావరోధం వల్ల ఏర్పడిన వాతమా?  ఏది కారణమో పరిశీలించి లక్షణాలకు కాకుండా  ఆ వాతానికి  చికిత్స చేస్తాం. పంచకర్మ చికిత్సలతో పాటు మేరు  చికిత్సలు చేస్తాం.  అందుకే సమస్య సమూలంగా శాశ్వతంగా తొలగిపోతోంది. వెన్నునొప్పినుంచి  శాశ్వతంగా విముక్తి పొందాలనుకునే వాళ్లు,  ఆయుర్వేద మేరు చికిత్సా నిపుణుల వద్దకు, అంటే ఆయుర్వేద స్పైన్‌ స్పెషలిస్టు వద్దకు వెళ్లాలి. ఈ చికిత్సల వల్ల  వెన్ను నొప్పి తాలూకు లక్షణాలనుంచి బయటపడతారు. అంతే కాదు జీవితంలో మరోసారి మెడనొప్పి గానీ, వెన్నునొప్పి గానీ వచ్చే అవకాశమే ఉండదు. అంతే కాదు నొప్పి పూర్తిగా తొలగిపోవడంతో పాటు మీ కదలిక సహస్థితికి వచ్చేస్తాయి. మీ వెన్ను వ్యవస్త అంతా పునరుజ్జీవం పొందుతుంది. సర్జరీ అవసరం లేకుండానే  నొప్పి పూర్తిగా తొలగిపోతుంది.  వెన్నెముక  సహజంగా, దృఢంగా మారుతుంది. క్షణం క్షణం క్షీణిస్తూ వెళుతున్న మీ వె న్ను వ్యవస్థ శక్తివంతంగా సమగ్రంగా మారుతుంది.
 

డాక్టర్‌ వర్ధన్‌ 

ది కేరళ ఆయుర్వేదిక్‌ కేర్‌, 

స్పెషాలిటీ, పంచకర్మ సెంటర్‌, స్కైలేన్‌ థియేటర్‌ లేన్‌, బషీర్‌బాగ్‌, హైదరాబాద్‌

బ్రాంచీలు: దానవాయి పేట - రాజమండ్రి,ఎన్‌ ఆర్‌ పేట-  కర్నూలు

ఫోన్‌: 9866666055, 8686848383