కీళ్లనొప్పులకు ఆధునిక హోమియో చికిత్స

27-06-2018: నేటి ఆధునిక జీవనం కీళ్లపైన మరింత ఒత్తిడి తీసుకొస్తోంది. ఎక్కువ కూర్చోవడం తగినంత శారీరక శ్రమ లేకపోవడం, బరువు పెరగడం లాంటి కారణాలు కీళ్లనొప్పులకు పరోక్షంగా దోహదం చేస్తున్నాయి. వంశపారంపర్య కారణాల వల్ల కూడా ఈ సమస్యలు చుట్టే అవకాశం లేకపోలేదు. శరీరరక్షణ వ్యవస్థకు సంబందించి లోపాలు కూడా కీళ్లజబ్బులను పెంచుతాయి, వీటన్నిటికీ తోడు ప్రమాదాల్లో గాయపడటం వల్ల కీళ్లు దెబ్బతిని చాలా సందర్భాల్లో అంగవైకల్యాన్ని తీసుకురావచ్చు. కీళ్లను అవసరానికి మంచి ఉపయోగించడం వల్ల అవి బలహీనపడే ప్రమాదం ఉంది.

 
నడవడమే కష్టం... ఎందుకంటే?
కీళ్లలో సమస్య ఉన్నప్పుడు మోకాళ్లు లేదా ఇతర కీళ్ల భాగం విపరీతమైన నొప్పి, వాపు బిగుతుగా ఉండటం, నడవడానికి ఇబ్బంది కలిగిస్తాయి. మెల్లమెల్లగా కీళ్ల నిర్మాణంలో స్పష్టమైన తేడా కనిపిస్తుంది. దీనికి చికిత్స తీసుకోకపోతే అంగవైకల్యం వచ్చే అవకాశం ఉంది. కీళ్లఓ అరుగుదల, నష్టం ఎక్కువైన తర్వాత కీళ్ల కదలిక తగ్గుతుంది. కండరాల పటుత్వంలో అసమానతలు ప్రారంభమవుతాయి. కొన్ని రకాల పనులు చేయడానికి వీలుండదు. కూర్చొని లేచినప్పుడు, మెట్లు ఎక్కడం, దిగడం లాంటివి చేసేటప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయి.
 
కీళ్లలో జరిగే మార్పులు
కీళ్లు అతుక్కుని ఉండే భాగాన్ని ఆర్టిక్యులర్‌ కార్టిలేజ్‌ అంటారు. కీళ్ల సమస్య ఉన్నప్పుడు ముందుగా ఈ ఆర్టిక్యులర్‌ కార్టిలేజ్‌ నుంచే సమస్యలు మొదలవుతాయి. ఏ కారణం వల్లనైనా కీళ్లు ప్రభావితమైతే ఈ కార్టిలేజ్‌ పల్చబడిచ ముడతలు పడుతుంది. ఫలితంగా కీళ్ల కదలికలకు అంతరాయం ఏర్పడుతుంది. దీని పక్క భాగంలోని రక్తనాళాలు ఉబ్బడం ద్వారా కార్టిలేజ్‌కు రక్తసరఫరా జరుగుతుంది. ఈ మార్పు వల్ల ఆస్టియోసైట్స్‌ ఏర్పడతాయి. సాధారణంగా ప్రతి 40 రోజులకు పాత ఎముక కణాలు చనిపోయి కొత్తగా పుడుతూ ఉంటాయి. ఆస్టియో ఆర్థరైటిస్‌ సమస్య ఉన్నవారికి ఈ కణాలు ఎముక అరిగిన చోట కాకుండా వేరే చోట ఏర్పడతాయి. తద్వారా ఈ ఆస్టియోపైట్స్‌ కీళ్లను రాపిడికి గురిచేస్తాయి. దీని వల్ల కీళ్లు గట్టిపడటం, వాపు మొదలైనవి కదులుతాయి. కీళ్ల లోపల ద్రవం సన్నని రంఽధ్రాలు ద్వారా ఎముకల మధ్యలోకి ప్రవేశించి గడ్డలుగా ఏర్పడతాయి. క్రమంగా కీళ్లలోని జిగురు పదార్థం తగ్గడం వల్ల కీళ్ల కదలికలో ఇబ్బంది ఎక్కువవుతుంది.
 
హోమియోలో ఆపరేషన్‌ అవసరం లేదు
కీళ్ల నొప్పులతో బాధపడుతున్నన వారికి రక్తపరీక్షలు, ఎక్స్‌రే, ఎమ్మారై స్కానింగ్‌ ద్వారా కీళ్లసమస్యలకు కారణాలను నిర్ధారించవచ్చు. చాలా సందర్భాల్లో కీళ్ల నొప్పులు ముఖ్యంగా ఆస్టియో ఆర్ధరైటిస్‌ తగ్గాలంటే కీళ్ల మార్పిడి చికిత్స తప్ప గత్యంతరం లేదనుకుంటారు. కాని ఆపరేషన్‌ లేకుడా జబ్బును తగ్గించగల మందులను అందుబాటులోకి తెచ్చింది ఆధునిక హోమియో వైద్యం. ఇందులోని మందులు ఇన్‌ఫెక్షన్లకు కారణమైన హానికరమైన పదార్థాలను బయటకు పంపించి వాపును తగ్గిస్తాయి. దెబ్బతిన్నభాగానికి రక్తసరఫరా చేసి గాయం త్వరగా మానడానికి సహకరిస్తాయి. ఆస్టియో ఆర్థరైటిస్‌ తొలిదశలోనే చికిత్స ఆరంభిస్తే దెబ్బతిన్న కార్టిలేజ్‌ పునరుద్ధరించగల అవకాశం ఉంది. సమస్య నిర్లక్ష్యం చేస్తే, ఆపరేషన్‌ తప్పనిసరి అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. 
 
డాక్టర్‌ కె.శ్రీనివాస గుప్తా, ఎం.డి హోమియోస్టార్‌ హోమియోపతి
సికింద్రాబాద్‌, ఫోన్‌ నంబర్‌:9246800011
www.starhomeopathy.com