కీళ్ల నొప్పులు మాయం!

21-08-2018: ఆస్టియో ఆర్థరైటిస్‌ లేదా రుమాటాయిడ్‌ ఆర్థరైటిస్‌ వీటిల్లో ఏదో ఒక సమస్యతో బాధపడేవారు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 10 శాతం దాకా ఉన్నారు. మౌలికంగా, పలు ఇతర రుగ్మతలకు మల్లే కీళ్ల వాతానికి కూడా మలబద్ధకం, అస్తవ్యస్త జీర్ణవ్యవస్థలే ప్రధాన కారణాలు. రోజుకోసారి మల విసర్జనకు వెళుతున్నా, చాలా మందికి సాఫీగా జరగ దు. ఇలా పొట్టలో మిగిలిపోయిన వ్యర్థ, విష పదార్థాలు తిరిగి రక్తప్రసరణ వ్యవస్థలోకి ప్రవేశిస్తాయి. ఇవి మరీ ఎక్కువైనప్పుడు వాటిని మూత్ర పిండాలు సంపూర్ణంగా వడక ట్టలేవు. ఫలితంగా యూరిక్‌ యాసిడ్‌ లాంటి విషపదార్థాలు కీళ్లల్లో కేంద్రీకృతమవుతాయి. కీళ్లు వాయడానికి, నొప్పులు కలగడానికి ఇవే ప్రధాన కారణాలు. అయితే, మల విసర్జన సాఫీగా జరిగేలా చేసి, ఆ తర్వాత జీర్ణవ్యవస్థను చక్కదిద్దే ఔషధాలు మూలికా వైద్యంలో ఉన్నాయి.
 
 కీళ్ల వాతం వల్ల ఎముకలు గుల్లబారతాయనీ, బలహీనపడతాయనీ చాలా మంది అనుకుంటారు. కానీ, ఎముకలు గుల్లబారడం, బలహీనపడటం వల్లే కీళ్ల వాతం వస్తుందనేది వాస్తవం. అయితే ఎముకలు ఇలా గుల్లబారే సమస్యను మూలికా క్యాల్షియం క్యాప్సుల్స్‌ ద్వారా అధిగమించే వీలుంది. వీటివల్ల కొద్ది రోజుల్లోనే ఫలితం కనిపిస్తుంది. ఆ తర్వాత అవసరాన్ని బట్టి వాటిని కొనసాగించవచ్చు.
కీళ్లలోనూ, మడమల మీద ఇతర చోట్లా క్యాల్షియం గూడు కట్టినప్పుడు కూడా ఈ క్యాల్షియం టాబ్లెట్లు రోగులకు ఉపశాంతిని ఇస్తాయే గానీ, హాని చేయవు. వాస్తవం ఏమిటంటే, దేహంలో క్యాల్షియం తక్కువైనప్పుడు, చాలీచాలని క్యాల్షియంతో ఏం చేయాలో దేహవ్యవస్థకు అర్థం కాదు. ఫలితంగా దేహంలో ముఖ్యంగా కీళ్ల చుట్టుపక్కల కొన్ని చోట్ల క్యాల్షియం చేరడం, మరికొన్ని చోట్ల లోపించడం జరుగుతుంది.
కీళ్ల వాతం వచ్చినప్పుడు చీల మండల పైన, మోచేతుల పైన గూడులోనూ, మెడ చుట్టూరా కాలరు బోను పెరిగితే, దానికి క్యాల్షియం అధికమైనందున పెరిగాయని కాదు. అవి క్యాల్షియం లోపాల వల్ల ఏర్పడిన వికృత పరిణామాలని గ్రహించాలి. అలాంటి వాళ్లకు క్యాల్షియం క్యాప్సుల్స్‌ ఎంతో మేలు చేస్తాయి.
రోగికి నొప్పుల నుంచి తాత్కాలిక ఉపశమనం కలిగించడానికి రసాయన పదార్థాలేమీ వాడనవసరం లేదు. ఉమ్మెత్త, వావిలి, అడ్డసర, పుదీనా, కర్పూరం, గుగ్గిలం వంటి మూలికా ఔషధాలు బాగా పనిచేస్తాయి. అయితే, కీళ్లలోని వాపులు, నొప్పులు పూర్తిగా నయం కావాలంటే, కీళ్లలోని విషపదార్థాలను కరిగించి తీసి, మూత్రపిండాల్లో వాటిని వేరుచేసి, మూత్రకోశం ద్వారా విసర్జన అయ్యేట్లు చేయాలి. వాచిన కీళ్లల్లో ర క్తప్రసరణ అధికం చే యడానికి, మూత్ర పిండాలు శక్తివంతంగా వ్యర్థపదార్థాలను వే రు చేయడానికి మూత్ర విసర్జనను పెంచడానికి, అల్లం, వెల్లుల్లి, మిరప, అశ్వగంధి, చిన్న పల్లేరు లాంటి మూలికా ఔషధాలు బాగా పనిచేస్తాయి.
డాక్టర్‌ జి. లక్ష్మణ రావు
కన్సల్టెంట్‌ హెర్బలిస్ట్‌,
ఆస్ట్రేలియన్‌ హెర్బల్‌ క్లినిక్‌
మెహదీపట్నం, హైదరాబాద్‌