వెన్నునొప్పే అనుకుంటే అసలుకే ముప్పు

ఆంధ్రజ్యోతి,12-02-13: ఏళ్ల పర్యంతంగా వెన్నునొప్పితో బాధపడుతున్న వారికి ఆ తరువాత మొదలైన లైంగిక సమస్యల మీదికి దృష్టి వెళ్లదు. వెన్నునొప్పి తగ్గాక ఆ విషయం చూద్దాంలే అనుకుంటారు. కానీ, లైంగిక సమస్య తలెత్తడానికి వెన్నునొప్పే అసలు కారణమని వారు గుర్తించరు. ఈ నాటి శీఘ్రస్ఖలన సమస్య రేపటి నపుంసకత్వానికి మూలమవుతుందని కూడా చాలా మందికి తెలియదు. అందుకే వెన్నునొప్పికీ, లైంగికలోపాలకూ అసలు కారణాల్ని గుర్తించి వైద్యం చేసే ఆయుర్వేదాన్ని ఆశ్రయించమంటున్నారు ఆయుర్వేద వైద్యనిపుణులు డాక్టర్‌ వర్థన్‌.

ఏళ్లు గడుస్తూ పోతే, వెన్నునొప్పి ఒకదశలో అంగవైకల్యంగా పరిణమిస్తుంది. వెన్నునొప్పి కొందరిలో తాత్కాలికంగా ఉండిపోయి, ఆ తరువాత కనుమరుగైపోతుంది. మరికొందరిలో క్రానిక్‌గా మారిపోయి శరీరంలోని వివిధ భాగాలను తీవ్రమైన దుష్పరిణామాలకు గురిచేస్తుంది. ఆ క్రమంలో దైనందిన జీవితం నుంచి లైంగిక జీవితం దాకా అన్నీ దెబ్బ తింటూ వెళతాయి. సమస్య క్రానిక్‌గా మారుతున్న క్రమంలో మానవ జీవితం మూడు దశల్లో క్షోభకు గురవుతూ ఉంటుంది. వాటిలో ముందుగా శారీరకమైన నొప్పి మొదలై, ఆ వ్యధతో మానసికమైన ఆనారోగ్యం మొదలవుతుంది. అంతిమంగా అది లైంగిక అశక్తత, నపుంసకత్వం దాకా వెళుతుంది. వెన్నునొప్పే కదా అని నిర్లక్ష్యంగా ఉండిపోతే, అది మొత్తం జీవితాన్నే చేజేతులా జారవిడుచుకోవడమే అవుతుంది. వెన్ననొప్పి, ఏదో వృత్తిపరంగా వెనుకంజ వేసేలా మాత్రమే కాదు, లైంగిక శక్తిని దెబ్బ తీసి దాంపత్యబంధాన్ని కూల్చేసే దాకా వెళుతుంది.

ఎంత సంకీర్ణమో...

వెన్ను నిర్మాణం అనేది ఒక పెద్ద సంకీర్ణ వ్యవస్థ. ఆ భాగంలోని కండరాలు, లిగమెంట్లు, టెండాన్లు, డిస్కులు. నరాలు, వెన్నుపాము అదో పెద్ద సమ్మేళనం. వీటిలో ఎక్కడ ఏ కాస్త దెబ్బ తగిలినా వెన్ను నొప్పి మొదలవుతుంది. సమస్య ఏమిటంటే, వెన్నునొప్పి శారీరకంగానే ఉండిపోకుండా అది లైంగిక వాంఛను కూడా దెబ్బ తీస్తుంది. ముందు వెన్ను భాగంలో నొప్పిగానే మొదలైనా, ఆ తరువాత ఆయా బాగాల్లో మొద్దుబారినట్లు, పొడిచినట్లు ఉండడం, శరీరమంతా శక్తిహీనమై చివరికి లైంగిక సమస్యలు మొదలవుతాయి ఇంకా అలాగే కొనసాగితే అది నపుంసకత్వానికి దారి తీస్తుంది. అదే సమయంలో వెన్నునొప్పినుంచి ఉపశమనానికి అదేపనిగా వేసుకుంటూ పోయే అల్లోపతి పెయిన్‌ కిల్లర్స్‌, దిగులు, ఆందోళన తగ్గడానికి ఇచ్చే యాంటీ డిప్రెషంట్‌ మాత్రలు, నర్వ్‌ స్టిములెంట్‌ మాత్రలు ఇవన్నీ అంతిమంగా లైంగిక శక్తిని దెబ్బ తీస్తాయి. దీర్ఘకాలికంగా ఈ మాత్రలతోనే గడిపితే ఏదో ఒక దశలో నపుంసకుడ్ని చేసి వదిలేస్తుంది. 

శీఘ్రస్ఖలనం చిన్న సమస్యా?

ముందు అంగస్తంభనలోపాలతో మొదలయ్యే సమస్య ఒక దశలో శీఘ్రస్ఖలన సమస్యకు బీజం పడుతుంది. ఆ తరువాత అదే నపుంసకత్వం దాకా తీసుకువెళుతుంది. దాని మూలాలు చాలా లోతైనవి. అత్యాధునికమైన ఎంఆర్‌ఐ రిపోర్టుల్లో వెన్నెముక నిర్మాణంలో వచ్చిన తేడాలు కనిపిస్తాయే తప్ప, వెన్నునొప్పి రావడానికి గల అసలు కారణం మాత్రం కనిపించదు. అందుకే అల్లోపతి వైద్య శాస్త్రం ఈ నాటికీ వెన్నునొప్పి మూలాల్ని అర్థం చేసుకోలేకపోయింది. అయితే, వెన్నునిర్మాణం ఎంత సంకీర్ణమైనదో అంగస్థంభన అన్నది కూడా అంతే సంకీర్ణమైనది. దానికి కారణం వెన్ను, నాడీవ్యవస్థ, హార్మోన్లు, మెదడు, భావోద్వేగాలు ఇవన్నీ ఇందులో అంతర్భాగంగా ఉండడమే. అంతకన్నా మించి, ఇందులో వాతం అత్యంత కీలకపాత్ర పోషించడం మరో ప్రధాన కారణం. మౌలికంగా వెన్ను నొప్పి వెనుక లైంగిక లోపాల వెనుక కూడా వాత ప్రకోపమే మూలంగా ఉంటుంది. అందుకే అల్లోపతి వైద్యులకు వెన్నునొప్పి సమస్య ఎప్పటికీ ఒక అంతుచిక్కని విషయంగానే ఉండిపోయింది. 

రెండింటికీ ఒకే సారి 
నొప్పి ముందు కండరాల్లోనే మొదలైనా క్రమంగా అది డిస్కుల దాకా వెళుతుంది. ఆ పక్కకు జరిగిన డిస్కుల ఒత్తిడితో వెన్నుపాము దె బ్బతిని చివరికి అది అంగస్థంభనలోపాలకు, శీఘ్రస్ఖలనానికీ దారి తీస్తుంది. నొప్పి ఒకవేళ కండరాలకే పరిమితమై ఉంటే ఏవో కొన్ని మాత్రలతో తగ్గిపోవచ్చు అలా కాకుండా, డిస్కులు నరాలు దెబ్బతినేదాకా వెళితే, అది నపుంసకత్వం వైపే నడిపిస్తుంది. లైంగిక స్పందనలు కలగడానికి లైంగిక అవయవాలకూ, మెదడుకూ మధ్య వెన్నెముక ఒక వంతెనలా ఉంటుంది. ఒకవేళ ఆ వెన్నెములోనే లోపాలు ఉంటే పంచేంద్రియాల మధ్యనుండే మొత్తం సమన్వయమే దెబ్బ తింటుంది. వాస్తవానికి అంగస్తంభనలకూ, స్ఖలనాలకూ సంబంధించిన కేంద్రాలు ఉండేది వెన్నులోనే. ఒకవేళ ఆ వెన్నే దెబ్బ తింటే ఇక స్తంభనలు ఎలా వస్తాయి? శీఘ్రస్ఖలన సమస్యతో పాటు ఎవరికైనా వెన్నునొప్పి కూడా ఉంటే తక్షణమే డాక్టర్‌ను సంప్రదించడం చాలా అవసరం. ఎందువల్ల అంటే ఈనాటి శీఘ్రస్ఖలన సమస్య రేపు రాబోయే నపుంసకత్వానికి ముందస్తు హెచ్చరిక. ఆ హెచ్చరికకు స్పందించి వెంటనే సమస్య మూలాలు తెలిసిన ఆయుర్వేద చికిత్సలు తీసుకుంటే శీఘ్రస్ఖలన సమస్య అంతటితో ఆగిపోయి. లైంగిక శక్తి నిలబడుతుంది. అయితే, వాత హర చికిత్సలతో పాటు, మేరు చికిత్స,వాజీకరణ చికిత్సలను సంయుక్తంగా చేసినప్పుడే వె న్నునొప్పి సమస్యలు, లైంగిక సమస్యలు ఏకకాలంలో తొలగిపోతాయి. నడుము వంగిపోయి, మనసు కుంగిపోయి కాకుండా నిండైన ఆత్మవిశ్వాసంతో సాగిపోయే రోజులు మొదలవుతాయి. 
 
డాక్టర్‌ వర్ధన్‌
ది కేరళ ఆయుర్వేదిక్‌ కేర్‌, 
స్పెషాలిటీ, పంచకర్మ సెంటర్‌, స్కైలేన్‌ థియేటర్‌ లేన్‌, బషీర్‌బాగ్‌, హైదరాబాద్‌, బ్రాంచ్‌: దానవాయి పేట, రాజమండ్రి
ఫోన్‌: 9866666055, 8686848383