వెన్నునొప్పికి సర్జరీ సమాధానమా?

ఆంధ్రజ్యోతి,08-10-13

వెన్నునొప్పికి అసలు కారణమైన ధాతుక్షయాన్ని నివారించే ప్రయత్నమేదీ చేయకుండా దృష్టినంతా డిస్కుల మీదే పెడితే ఏమవుతుంది? సర్జరీ కోసం పరుగెడితే  ఏమొస్తుంది? మలమూత్రాలు కూడా ఆగిపోయిన అనివార్య పరిస్థితిలో తప్ప, తాత్కాలిక  ఉపశమనానికి సర్జరీకి వెళ్లడం ఎందుకు? ఆయుర్వేదం వెన్నునొప్పి మూలాలను తొలగిస్తుంది.  ప్రత్యేకించి ఆయుర్వేదంలోని  మేరు చికిత్స, బృహ్మణ చికిత్సలు  వెన్నునొప్పినుంచి మీకు  శాశ్వత విముక్తి కలిగిస్తాయి అంటున్నారు, ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్‌ వర్ధన్‌. 
 

డిస్కు అత్యంత సున్నితమైనది. అందుకే అది 20 ఏళ్లనుంచే క్షీణించడం మొదలెడుతుంది. మౌలికంగా డిస్కులో రెండు పొరలు ఉంటాయి. ఉపరి భాగంలో గట్టిగా ఉండే ఆన్యులస్‌ ఫైబ్రోసిస్‌ ఒకటి. లోపల మెత్తగా ఉండే జలానిటస్‌ న్యూక్లియస్‌ ఫల్పోసిస్‌ ఒకటి. లోపలి భాగంలో ఉండే న్యూక్లియస్‌ పల్పోసిస్‌లో నీరు ఎక్కువగా ఉంటుంది. అయితే వయసు పెరిగే కొద్దీ నీటి పరిమాణం తగ్గుతూ వెళుతుంది. సాధారణంగా 50 ఏళ్లు వస్తేగానీ వృద్దాప్యం మొదలైనట్లు కాదు. కానీ, వెన్నెముక విషయంలో వయసు లెక్కలు వేరుగా ఉన్నాయి. శరీరంతో పాటే కాకుండా వెన్నెముకకు వృద్దాప్యం రావడం అనేది 20 ఏళ్లకే మొదలవుతుంది. డిస్కు తన బిగువునూ స్థిరత్వాన్ని కోల్పోవడం, ఆన్యులస్‌ ఫైబ్రోసిస్‌లో పగుళ్లు ఏర్పడటం ఒక దశ. ఇది 20 నుంచి 40 ఏళ్ల లోపు వారిలోనే కనిపిస్తుంది. ఇక 40 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్కుల్లో డిస్కుల్లో నాలుగు దశల్లో సమస్య ఉంటుంది.ఈ నాలుగూ 40 నుంచి 60 ఏళ్లలోపు వారిలోనే వస్తాయి. డిస్కుల మధ్య ఒరిపిడి పెరిగి డిస్కులు, పూసలు బిగుసుకుపోయే స్టెబిలైజేన్‌, యాంకైలోసిస్‌ అనే సమస్యలు ఇది డిస్కుల ఒరిపిడిలో ఏర్పడే బొడిపెలు ఏర్పడే సమస్య. ఇది 60 ఏళ్లు పైబడిన వారిలోనే వస్తుంది. 50 ఏళ్ల వ్యక్తి డిస్కులో నీరు సమృద్ధిగా ఉంటుంది. డిస్కు బలంగా ఉంటుంది. 70 ఏళ్ల వారిలోని డిస్కులోని నీరు బాగా తగ్గిపోతుంది. డిస్కు బాగా బలహీన పడుతుంది.

డిస్కు క్షీణించిన లక్షణాలు

నడుము భాగంలో అయితే ప్రధానంగా ఎల్‌-4, ఎల్‌-5 డిస్కుల్లో నొప్పి ఎక్కువగా కనిపిస్తుంది. మెడ భాగంలో అయితే సి-5, సి-6లో ఎక్కువగా కనిపిస్తుంది. నడుము బాగంలోని డిస్కులు నరాల మీద ఒత్తిడి కలిగిస్తే అది సయాటికాకు దారి తీస్తుంది. మెడలో అయితే, సర్వైకల్‌ రేడికులోపతికి దారి తీస్తుంది. ఇతర లక్షణాల్లో డిస్కు ఉన్నచోటే నొప్పి రావచ్చు లేదా కాలినొప్పి కూడా రావచ్చు. ఈ కాలినొప్పినే మనం సయాటికా ఆంటాం. ఈ నొప్పి కొందరికి అప్పుడప్పుడు వచ్చిపోతుంది. కొందరికి ఎక్కువ సేపు వంగిపనిచే సినా లేదా బరువులు ఎత్తినా నొప్పి వస్తుంది. కొందరికి కూర్చుంటే నొప్పి తగ్గుతుంది. కానీ తుమ్మినా దగ్గినా నొప్పి ఎక్కువవుతుంది. నొప్పి మరీ ఎక్కువైతే కండరాలు బలహీనపడతాయి. ఇంద్రియశక్తిలో లోపాలు ఏర్పడతాయి. మెడ బాగంలోని డిస్కుల్లో సమస్య ఉంటే ఆ డిస్కుల్లోనే నొప్పి రావచ్చు లే దా భుజం నొప్పి కూడా రావచ్చు. చేయి లాగినట్లు అనిపించవచ్చు రెండింటిలోనూ పొడిచినట్లు, మొద్దుబారినట్లు, కండరాలు క్షీణించడం కావచ్చు. వేళ్లల్లో కూడా పొడిచి నట్టు , మొద్దుబారినట్లు అనిపించడం ఉంటుంది. సమస్య మరీ తీవ్రమైతే పక్షవాతం వచ్చే ప్రమాదం కూడా ఉంది. 

ఇతర వైద్యాల వైఫల్యాలు

ఇతర విధానాల్లో బెడ్‌రెస్ట్‌ సూచిస్తారు, పెయిన్‌ కిల్లర్స్‌, ఇస్తారు. ఫిజియో థెరపీ, ఎపిడ్యూరల్‌ షాట్స్‌ ఇస్తారు. సయాటికా నరానికే నేరుగా ఇంజెక్షన్‌ చేస్తారు. ఇవేవీ ఫలితాన్ని ఇవ్వలేందటూ చివరికి సర్జరీ చేయించుకోవలసిందే అంటారు. ఇవన్నీ తాత్కాలిక ఉపశమనాన్ని ఇస్తాయే కానీ, సమస్యను సమూలంగా తొలగించడానికి ఎంతమాత్రమూ పనికిరావు. సర్జరీతో అదృష్టవశాత్తూ అతి కొద్ది మందే సమస్యనుంచి బయటపడ్డారు. సర్జరీతో సమస్య ఏమాత్రం తగ్గకపోగా మరెన్నో దుష్ప్రభావాలకు లోనైన దురదృష్టవంతులే చాలా ఎక్కువ. ఒక్కో సర్జరీ దుష్ప్రభావంతో పక్షవాతానికి గురయ్యే ప్రమాదం కూడా ఉంది. వాస్తవానికి తొలిసారి సర్జరీ చేయించుకున్నప్పుడే సమస్య తొలగిపోతే సర్జరీ వల్ల మీకు ఎంతో కొంత మేలు జరిగినట్లు. ఒకవేళ రెండవ సారి సర్జరీ చేయించుకునే స్థితి ఏర్పడిందీ అంటే ఆ తరువాత ఎన్ని సర్జరీలు చేయించుకున్నా వృధాయేనని గ్రహించాలి.

ఆయుర్వేదాన్ని ఆశ్రయించి...

వెన్నునొప్పికి మూలమైన ధాతుక్షయాన్ని నివారించడానికి, ఆయుర్వేదంలోని ధాతువృద్ధి చికిత్సలు తీసుకోండి. అలాగే మేరు చికిత్సలు, బృహ్మణ చికిత్సలు, వాత హర చికిత్సలు తీసుకోవడం ద్వారా మీ సమస్యనుంచి పూర్తిగా విముక్తిని పొందండి. అసలు సర్జరీకి వెళ్లడానికి ముందు ఒక్కసారి ఆయుర్వేద నిపుణుల్ని సంప్రదించండి. మేరు చికిత్సలు, పంచకర్మ చికిత్సలు ఇవేవీ కాకపోయినా, కొన్నిసార్లు కేవలం కొన్ని ఆయుర్వేద మాత్రలతోనే మీ సమస్య తొలగిపోవచ్చు. ఒకవేళ అవసరమైతేనే మేరు చికిత్సలు, పంచకర్మ చికిత్సలకు వెళ్లవచ్చు. సమస్య మరీ తీవ్రమై మలమూత్రాలు కూడా ఆగిపోయిన దశలో తప్ప ఇతర దశల్లో సర్జరీలకు వెళ్లి సాధించేది ఏమీ ఉండదు. ఆయుర్వేదం మీ సమస్యలకు ఏ దుష్ప్రభావాలూ లేని సంపూర్ణ వైద్యం అందిస్తుంది. అందుకే ఆయుర్వేదాన్ని కేవలం ఒక వైద్య విధానంగా కాకుండా మీ జీవితానికి తోడుగా తీసుకోండి. ఆయుర్వేదాన్ని, స్వీకరించండి, అనుసరించండి, ఆ క్రమంలో ఆయుర్వేదపు అద్భుత ఫలితాలను ఒకసారి చవిచూశాక ఆయుర్వేదాన్ని మీరు మనస్పూర్తిగా ప్రేమిస్తారు. ఆయుర్వేదాన్ని మీ జీవితంలో భాగం చేసుకుంటారు. ఇది వాస్తవం.

డాక్టర్‌ వర్ధన్‌ 

ది కేరళ ఆయుర్వేదిక్‌ కేర్‌, 

స్పెషాలిటీ పంచకర్మ సెంటర్‌, స్కైలేన్‌ థియేటర్‌ లేన్‌, బషీర్‌బాగ్‌, హైదరాబాద్‌,

 బ్రాంచీలు: దానవాయి పేట - రాజమండ్రి, ఎన్‌ ఆర్‌ పేట-  కర్నూలు

ఫోన్‌: 9866666055, 8686848383