వెన్నునొప్పికి ఆయుర్వేదమే తిరుగులేని వైద్యం

ఆంధ్రజ్యోతి,07-05-13
 
ఒక డి స్కును సరిచేస్తే, మరో డిస్కు  దెబ్బతింటుంది. సిమెంట్‌ నింపడం ద్వారానో, కృత్రిమ డిస్కును అమర్చడం ద్వారానో  సరిచేద్దాం అనుకుంటే అలా ఎన్ని డిస్కులకు  సిమెంట్‌ వే స్తారు? ఎన్ని కృత్రిమ డిస్కులు అమరుస్తారు? అయినా, అదేమీ శాశ్వత పరిష్కారం కాదు కదా! వెన్నునొప్పికి అసలు కారణమైన ధాతుక్షయాన్నీ, మార్గావరోధాన్నీ నిరోధించకుండా, అందుకు  మూల కారణమైన వాతప్రకోపాన్ని నియంత్రించకుండా ఈ సమస్యలు ఎప్పటికైనా పోతాయా? సర్జరీ లేకుండానే వెన్నునొప్పిని మాయం చేసే ఆయుర్వేదం మీ సన్నిధిలోనే  ఉండగా అటూ ఇటూ పరుగులు తీయాల్సిన పనేముంది అంటున్నారు, ఆయర్వేద  నిపుణులు డాక్టర్‌ వర్ధన్‌. 
 
ఒక రోజు కొన్ని వందల మైళ్ల దూరం నేనొక్కడ్నే డ్రైవింగ్‌ చేశాను. ఆ ప్రయాణం ముగిసే నాటికి నా వెన్నుభాగంలోని కండరాలన్నీ వడలిపోయి  ఆ తర్వాత బిగుసుకుపోయాయి. ఆ తరువాత క్రమంగా వెన్నునొప్పి మొదలయ్యింది.  రోజురోజుకూ ఆ నొప్పి పెరుగుతూ వచ్చింది. ఒక దశలో ఏ కాస్త కదిలినా భరించలేని నొప్పి కలగసాగింది. తాత్కాలికంగానే అయినా ఈ బాధలనుంచి ఉపశమనం పొందడానికి డాక్టర్‌ సలహా మేరకు అదే పనిగా పెయిన్‌ కిల్లర్స్‌ వేసుకోవడం అలవాటు చేసుకున్నాను  ఫలితంగా కడుపు ఉబ్బరం, మంట మొదలయ్యాయి. వీటన్నిటితో పాటు తీవ్రమైన మలబద్దకం సమస్యలు కూడా వచ్చాయి. న్యూరాలజిస్టును కలిస్తే  ఎంఆర్‌ఐ తీయించమన్నాడు. ఎల్‌4-ఎల్‌5, ఎల్‌5-ఎస్‌1 డిస్కుల్లో సమస్య ఉందని  రిపోర్టుల్లో స్పష్టమయ్యింది. ముఖ్యంగా డిస్కు గుజ్జులో సహజంగా ఉండే తేమ తగ్గిపోయిందని తేలింది. దీనికి తోడు సి5-సి6, సి6-సి7 డిస్కుల్లో వాపు వచ్చినట్లు బయటపడింది. ఇక సర్జరీ ఒక్కటే మార్గం అని చెప్పారు.   నాకు సర్జరీ చేయించుకోవడం బొత్తిగా ఇష్టం లేదు. రోజులు అలా గ డిచిపోతూనే ఉన్నాయి. నొప్పి మరీమరీ ఎక్కువవుతూ నా శరీరం కుడివైపు వంగిపోయింది. దీనికి తోడు వెన్ను భాగమంతా సూదులతో గుచ్చిన టు,్ల మొద్దుబారిపోతున్నట్లు ఉంటోంది. తిమ్మిర్లు, మంటలు బాగా వేధిస్తున్నాయి. ఇవన్నీ చాలవన్నట్లు  అంగస్థంభన సమస్యలు శీఘ్రస్ఖలన సమస్యలూ మొదలయ్యాయి.  ఇలా ఒక్కొక్కటిగా పలురకాల సమస్యలు తలెత్తి జీవితం చాలా దుర్భరంగా మారిపోయింది. ఇంకా ఇలాగే బతకడం నావల్ల కాదు.ఈ సమస్యలనుంచి మీరు నాకు విముక్తి కలిగిస్తారా? సర్జరీ లేకుండా నా వెన్నునొప్పినుంచి పూర్తిగా బయటపడే వైద్య చికిత్సలు మీ వద్ద ఏమైనా ఉన్నాయా?ఆ వివరాలు తెలియచేయండి.

-డి రత్నాకర్‌, నిజామాబాద్‌

వాస్తవానికి ప్రకృతిలోని  అత్యంత  విశేషమైన  నిర్మాణాల్లో కెల్లా వెన్నెముక చాలా విశిష్టమైనది. మొత్తం శరీర సౌధానికి ఇదొక మూలస్థంభం లాంటిది. అయితే, వెన్నెముకలో ఏ కాస్త తేడా వచ్చినా పరిస్థితి అంతా తారుమారవుతుంది. శరీరమంతా శిధిల మందిరంగా మారిపోతుంది. భారతదేశంలోని దాదాపు 90 శాతం మంది ఏదో ఒక దశలో ఈ వెన్నునొప్పికి గురవుతూనే ఉంటారు.దాదాపు 40 ఏళ్లు పైబడిన నాటి నుంచే చాలా మందికి ఈ వెన్నునొప్పి సమస్యలు మొదలవుతాయి. కొన్ని జన్యుపరమైన కార ణాలు కూడా ఇందుకు కారణం కావచ్చు. గంటల కొద్దీ కంప్యూటర్‌ ముందు కూర్చునే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు, రోజంతా నిలబడే ఉండే సెక్యూరిటీ సిబ్బంది, పోలీసు సిబ్బంది, నర్సులు, టీచర్లు, రోజంతా వంగిపనిచేసే వ్యవసాయ కార్మికులు , ఈ నొప్పికి ఎక్కువగా గురయ్యే  అవకాశం ఉంది. శరీర శ్రమ బొత్తిగా లేనివారు, అతిగా పొగతాగేవారు స్థూలకాయులు కూడా వెన్నునొప్పికి ఎక్కువగానే గురవుతారు. అయితే బాహ్యంగా కనిపించే  ఈ తరహా కారణాల్లో ఏ ఒక్కటీ లేకుండానే కొందరికి వెన్నునొప్పి రావచ్చు. ముందు ఏదో కాస్త అసౌకర్యంగా అనిపించే ఈ సమస్య, క్రమంగా ఒక దశలో ఎవరో కత్తులతో పొడుస్తున్నంత తీవ్రంగా నొప్పి బాధిస్తుంది. క్రమంగా మనిషిని కదల్లేకుండా  చేసి ఒక అంగవైకల్యం లాంటి స్థితిని క లిగిస్తుంది.

మూల సమస్యలు మూడు

 కండరాల్లో వాపు ఏర్పడటం అందులో మొదటిది. ఎక్కువ సేపు కూర్చుని పనిచేసే వాళ్లల్లో, ఎక్కువ సేపు నిలబడి పనిచేసే వాళ్లలో , ఎక్కువ బరువులు  ఎత్తేవాళ్లలో  కండరాలు బిగుసుకుపోయి వాటికి రక్తప్రసరణ సరిగా అందదు. ఫలితంగా కండరాలు తమ విద్యుక్తధర్మాన్ని నిర్వహించడంలో విఫలమైపోతాయి. మౌలికంగా వెన్నెముక మీద పారా స్పైనల్‌  కండరాలు, స్పైనల్‌ కండరాలు  అని, అబ్డామినల్‌ కండరాలు అని ఉంటాయి. ఇవన్నీ  వెన్నెముకను ఆనకుని ఉంటాయి. దెబ్బతినడం వల్ల గానీ, ఇతర కారణాల వల్లగానీ,  ఈ కండరాల్లో ఏదైనా తేడా వచ్చినప్పుడు కండరాల్లో వాపు ఏర్పడి వెన్ననొప్పి మొదలవుతుంది.

డిస్కుపైన ఒక వలయంలా అనిలార్‌ ఫైబ్రోసిస్‌ అని ఉంటుంది. డిస్కులోపల న్యూక్లియస్‌ పల్పోసిస్‌ అనే గుజ్జు ఉంటుంది. ఈ గుజ్జు కారణంగానే  వెన్నుపూసల మధ్య ఈ డిస్కు ఒక కుషన్‌లా పనిచేస్తూ ఉంటుంది. డిస్కుల మీద ఒత్తిడి పెరగడం వల్లగానీ, దెబ్బ తగలడం వల్లగానీ, శక్తికి మించి బరువులు ఎత్తడం వల్లగానీ, డిస్కుమీద ఒత్తిడి పడి, డి స్కు చుట్టూ ఉండే వలయం పగులు బారుతుంది. ఇది ఒక మోస్తరు నొప్పినుంచి మొదలై, భరించలేనంత తీవ్రమైన నొప్పిగా మారవచ్చు. 

సయాటిక్‌ నరం దెబ్బ తినడం మూడవ మూలసమస్య. ఇది ఎల్‌3- ఎల్‌4 నుంచి ఎస్‌3  దాకా ఈ నరం ఉంటుంది. ఈ నరం శరీర సంకేతాలను కండరాలనుంచి మెదడుకు చేరవేస్తుంది.  ఏ కారణంగానైనా ఈ సయాటిక్‌ నరం దెబ్బతినిపోతే, అది సయాటికా సమస్యకు  దారి తీస్తుంది. దీనివల్ల ఆ భాగమంతా మొద్దుబారడం, తిమ్మిరి రావడం, పోట్లు, మంటలు మొదలవుతాయి. 

ఇవీ లక్షణాలు 

వెన్నునొప్పిగానీ, మెడనొప్పి గానీ,  వ చ్చినప్పుడు  న డుము భాగంలో, ఛాతీ వెనుక భాగంలో నొప్పి  వస్తుంది. నడుము భాగంలో మొదలయ్యే ఈ నొప్పి పిరుదులు, తొడ వెనుక భాగం, పిక్కలు, మడమల దాకా వ్యాపిస్తూ వెళుతుంది. ఛాతీ వెనుక భాగంలో నొప్పి మొదలైతే, అది  మెడ, భుజాలు, చేతులు, వేళ్లు ఇలా పాకుతూ వెళుతుంది. మెడ ఉపరి భాగంలో సమస్య ఉంటే ఆ ప్రభావం మొత్తం తలమీదంతా ఉంటుంది. ఈ నొప్పి చెవి వెనుక, కన్ను, ముక్కు, నోరు, దవడ భాగాలకూ విస్తరించవచ్చు. ఈ నొప్పి ఒక మోస్తరుగా మొదలై, కత్తికోతలాంటి బాధ, మంట కలుగవచ్చు. ఆయా భాగాల్ని ఏ  కాస్త కదిల్చినా నొప్పి ఎక్కువవుతుంది. కొందరికి రాత్రిపూట నొప్పి అధికమవుతుంది. కొందరిలో  ఎక్కువ గంటలు కదలకుండా కూర్చున్నప్పుడు నొప్పి అధికం కావచ్చు. కొన్నిసార్లు కడుపులోనూ నొప్పి అనిపించవచ్చు.  ఒక దశలో మూత్ర విసర్జన, మలవిసర్జన ల మీద అదుపు కోల్పోయే స్థితి కూడా ఏర్పడవచ్చు. వీటితో పాటు, పురుషుల్లో అయితే అంగస్తంభన లోపాలు, శీఘ్రస్ఖలన సమస్యలు మొదలవుతాయి. స్త్రీలలో అయితే, హార్మోన్‌ వ్యవస్థ సమతుల్యత కోల్పోవడం, జననాంగం పొడిబారిపోవడం వంటి సమస్యలు మొదలవుతాయి. వెన్నెముక బలంగా దెబ్బతిన్నప్పుడు ఒక్కోసారి పక్షవాతం వచ్చే అవకాశం కూడా ఉంది. అందుకే  వె న్నునొప్పిగానీ,  మెడనొప్పి గానీ, భుజం నొప్పిగానీ, నాలుగు వారాలకు మించి కొనసాగుతూ ఉంటే వెంటనే నిపుణుడైన డాక్టర్‌ను సంప్రదించడం చాలా అవసరం.

ఆయుర్వేద వ్యాధి నిర్ధారణ

కేవలం రోగి పరీక్ష ఒక్కటే కాదు ఆయుర్వేదం రోగ పరీక్షకు కూడా అంతే ప్రాముఖ్యం ఉంటుంది. అందుకు దశవిధ పరీక్షలు, అష్ఠవిధ పరీక్షలు అని ఉంటాయి. వీటి ద్వారా  వ్యాధి అధమంగా ఉందా? మధ్యమంగా ఉందా? తీవ్రంగా ఉందా అన్నది  తేలుతుంది. చికిత్సల్లో అధిక భాగం ఈ అంశాల మీద ఆధారపడే ఉంటాయి. రోగి ప్రకృతిని పరీక్షించడం కూడా చికిత్సలో అత్యంత కీలకం. మొత్తంగా చూస్తే  8 రకాల ప్రకృతులు ఉంటాయి. ఆ  ప్రకృతిని అంచనా వేయడం అన్నది కేవలం నాడీ పరీక్ష ద్వారానే సాధ్యమవుతుంది.  వెన్నునొప్పికి గల  అసలు కారణాల్లోకి వెళితే, శరీరంలోని  వాతం సమతుల్యతను  కోల్పోవడమే  అసలు కారణం. కండరాల వాపు వల్ల వచ్చిన నొప్పి గానీ, డిస్కుల మీద ఒత్తిడి పడటం వల్ల వచ్చే నొప్పిగానీ, నరాలు దెబ్బతినడం వల్ల వచ్చిన నొప్పిగానీ, శరీరంలో వాతం ప్రకోపం చెందడం వల్ల తతెల్తే సమస్యలే. వాతం ప్రకోపం చెందడం లేదా వాతం సమతుల్యత కోల్పోవడానికి కారణం  సప్తధాతువుల్లో ఏవో కొన్ని క్షీణించే, ధాతుక్షయ సమస్యగానీ, శోతస్సుల్లో  అంతరాయం ఏర్పడే మార్గావరోధ సమస్యలు ప్రఽధాన కారణాలుగా ఉంటాయి. ముందు వాతం ఒక్కటే సమతుల్యతను కోల్పోయినా, ఆ క్రమంలో పిత్తం కఫం కూడా సమతుల్యతను కోల్పోతాయి. ఇది 42 రకాల వాత లక్షణాలను కలిగిస్తుంది. వెన్నునొప్పిని అలాగే నిర్లక్ష్యం చేస్తూ వెళితే, అది 80 రకాల వాతరోగాలను కలిగిస్తుంది. రోగిపరీక్ష, రోగ పరీక్ష ద్వారా నాడీ పరీక్ష ద్వారా దోషాలు, ధాతువులు, మలాలు, ఆమం, అగ్ని  వీటన్నిటినీ పరీక్ష చేసి వ్యాధి నిర్ధారణ చేస్తాం. పరీక్షల్లో వ్యాధి సప్తఽధాతువుల్లో ఏ ధాతువు  దాకా వెళ్లింది. ఏ దోషం దాకా వెళ్లింది. అనే విషయాలన్నీ ఆయుర్వేదం పరిశీలిస్తుంది.. ఈ వివరాలేవీ ఎంఆర్‌ఐలో దొరకవు. ఆయుర్వేదం నిన్నటి, నేటి, రేపటి పరిస్థితులు ఈ మూడింటినీ పరిగణనలోకి తీసుకుని వైద్య చికిత్సలు అందిస్తుంది.

సమూల వైద్యం
 వెన్నునొప్పి సమస్యలు రావడానికి అస్థిధాతువు లోపాలే  అసలు  కారణం. అందుకే అస్థిధాతువు దెబ్బ తినడానికి గల వాత ప్రకోపాన్ని ఆయుర్వేదం  ముందు నియంత్రిస్తుంది. వాత ప్రకోపాన్నీ, ధాతుక్షయాన్ని, మార్గావరోధాన్నీ తొలగించగలగడమే ఇక్కడ ప్రధాన కర్తవ్యంగా ఉంటుంది. అందుకే ఆయుర్వేదం ఆ దిశగానే పనిచేస్తుంది. ఇదంతా వెన్నెముక నిర్మాణాన్నీ, దాని కార్యశీలతను, మెదడుకూ దానికీ ఉన్న అనుబంధాన్నీ అర్థం చేసుకోవడం వల్లే ఆయుర్వేదం వెన్ను సమస్యలకు అంతటి సమర్థవంతమైన వైద్య చికి త్సలు అందించగలుగుతోంది. చికిత్సలో వాత హర చికిత్సలతో పాటు, మేరు చికిత్సలు, మర్మ చికిత్సలు, పంచకర్మ చికిత్సలు చేస్తున్నాం. వీటి వల్ల కండరాల వాపు, డిస్కుల పైని ఒత్తిడి, తగ్గించగలుగుతున్నాం, అలాగే దెబ్బతిన్న సయాటికా నరాన్ని  తిరిగి పూర్వస్థితికి తేగలుగుతున్నాం. ఇందులో భాగంగానే ధాతు వృద్ధి చికిత్సలు, బృహ్మణ చికిత్సలు చేస్తూ  ప్రకోపిత వాతాన్ని సామాన్య స్థితికి తేగలుగుతున్నాం. వీటన్నిటి ద్వారా కేవలం వెన్నునొప్పి తగ్గడమే కాదు,  పరిపూర్ణ ఆరోగ్యాన్ని, సంపూర్ణ  ఆయువృద్ధినీ కలిగిస్తున్నాం. మూలాన్ని  మరిచి మందు రాస్తే ఏ గాయమైనా ఎప్పటికి మానుతుంది? మూల సమస్యను గురిపెట్టి వైద్యం చేసే ఆయుర్వేద వైద్యమే ఎప్పటికైనా వెన్నునొప్పి నుంచి శాశ్వతంగా విముక్తి కలిగిస్తుంది.
 

డాక్టర్‌ వర్ధన్‌, 

ది కేరళ ఆయుర్వేదిక్‌ కేర్‌, 

స్పెషాలిటీ, పంచకర్మ సెంటర్‌, స్కైలేన్‌ థియేటర్‌ లేన్‌,  బషీర్‌బాగ్‌, హైదరాబాద్‌

బ్రాంచీలు: దానవాయి పేట - రాజమండ్రి ఎన్‌ ఆర్‌ పేట-  కర్నూలు

ఫోన్‌: 9866666055, 8686848383