విరిగిన వెన్ను అతికింది

ఆంధ్రజ్యోతి,07/01/14: విరిగిన వెన్నెముకను అతికించవచ్చని, ఆయుర్వేద వైద్య విధానంలో వస్తున్న కొత్త ఆధునిక పద్ధతులతో ఈ సమస్యను సర్జరీ లేకుండా సరిచేయవచ్చని ప్రసిద్ధ ఆయుర్వేద వైద్య నిపుణుడు డాక్టర్‌ బుక్కా మహేశ్‌ బాబు ఈ కేస్‌ స్టడీ ద్వారా వివరిస్తున్నారు.

అతను ప్లే గ్రౌండ్‌లో చాలా సీరియస్‌గా ఫుట్‌బాల్‌ ఆడుతున్నాడు. అతని ఆటతీరు చూసి చాలా రోజుల తరువాత కనిపించడంతో ఎంతో క్యూరియాసిటీతో ‘అరేయ్‌ కళ్యాణ్‌ ఎలా ఉన్నావురా?’ అంటూ గట్టిగా అరిచాడు పవన్‌. ‘‘అరె నువ్వా’’ అంటూ ‘‘ఆట తరువాత కలుస్తా’’నని అన్నాడు కళ్యాణ్‌. ఆట ఎప్పుడు ఆయిపోతుందా అంటూ ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తుండగానే కళ్యాణ్‌ మెరుపు వేగంతో రావడంతో పవన్‌ అవాక్కయ్యాడు. స్నేహితుడు రాగానే ప్రశ్నల వర్షం కురిపించి ఉక్కిరిబిక్కిరి చేశాడు. ‘‘ఏరా? యాక్సిడెంట్‌ ఎలా అయింది? నువ్విక కాలేజీకి రావని కూడా విన్నాను. నిన్ను మళ్లీ ఇలా ఫుట్‌బాల్‌ ఆడుతూ చూస్తానని కలలో కూడా ఊహించలే’’దంటూ రెస్టారెంట్‌ వైపు లాక్కెళ్లాడు పవన్‌. 

ఒక్కసారిగా కళ్యాణ్‌ కళ్లు ఎరుపెక్కి కంఠం గద్గద స్వరంగా మారింది. అదో పీడకల అంటూ జరిగిన కథ మొదలుపెట్టాడు కళ్యాణ్‌. ‘‘ఆ రోజు ఉదయమే షాపుకు వెళుతుంటే గౌతమ్‌ తన కొత్త బండి మీద దిగబెడతానని వెనక సీట్లో కూర్చోమన్నాడు. సడన్‌గా బండి రెయిజ్‌ చేశాడంతే. కన్ను మూసి తెరిచేంతలో బండి గాల్లోకి లేచింది. నేను ఎగిరి అల్లంత దూరంలో కంకరరాళ్ళ గుట్టపై పడ్డాను. లేద్దామంటే నా వల్ల కాలేదు. కాళ్లు పట్టు తప్పాయి. వీపులో భరించలేని నొప్పి. బొడ్డు కింది భాగమంతా స్పర్శ తగ్గిపోయింది. 

జాగ్రత్తగా వీపు కదలనివ్వకుండా చెక్కబల్లపై పడుకోబెట్టారు. ప్రమాదం మా ఇంటి ముందే జరగడంతో అమ్మా, నాన్న తొందరగా రియాక్ట్‌ అయ్యారు. ఏ ఆస్పత్రికి తీసుకెళితే బాగుంటుందని ఆలోచన చేశారు. మాకు తెలిసిన బంధువులు ఇలాంటి పరిస్థితుల్లోనే ఆపరేషన్‌ చేయించుకున్నారు. పెద్ద హాస్పిటల్‌లో సూపర్‌ స్పెషాలిటీ డాక్టర్లు ఆపరేషన్‌ చేసినా సక్సెస్‌ కాలేదు. లక్షలు ఖర్చు చేసినా ఫలితం లేకుండా పోయింది. చివరకు అతను బెడ్‌కే పరిమితమయ్యారు. అందుకే నేను సర్జరీ జోలికి వెళ్లకుండా మంచి డాక్టర్ల గురించి సమాచారం సేకరించాను. అందులో ఒక ఆయుర్వేద డాక్టర్‌ సలహాతో ముందుగా కేవలం ఎక్స్‌రే తీయించారు. దాంట్లో వీపు కింది భాగంలో నడుంలో ఎల్‌-1 వెన్నెముక ఫ్రాక్చర్‌ అయిందని తెలిసింది. తరువాత ఎంఆర్‌ఐ స్కానింగ్‌ తీయించమన్నారు. వెన్నెముక ఎల్‌1, ఎల్‌2 మధ్య ఉన్న డిస్క్‌ కూడా జరిగి చితికిందని తేలడంతో ఆపరేషన్‌ చేయించుకోవాల్సి వస్తుందని భయమేసింది. అయితే ఆయుర్వేద వైద్యుడైనప్పటికీ గట్టి భరోసా ఇవ్వడంతో ఆయుర్వేద చికిత్స తీసుకోవడమే మంచిదని మా కుటుంబ సభ్యులంతా గట్టిగా నిర్ణయించుకున్నారు’’ అని చెప్పాడు.

అలా అనగానే మిత్రుడు గట్టిగా నవ్వుతూ ‘‘ఆయుర్వేద చికిత్సతో నయమైందంటే నమ్మలేకపోతున్నాను. పథ్యాలు గట్రాచేశావా? ఇంతకీ ఎవరా డాక్టర్‌?’’ అంటూ ‘‘సర్జరీతోనే ఇలాంటి కేసులు నయం కావడం లేదు. ఆయుర్వేద చికిత్సతో తగ్గడం ఆశ్చర్యంగా ఉంది’’ అన్నాడు. మిత్రుని ప్రశ్నకు బదులుగా ‘‘ఆయుర్వేద చికిత్సలో నూతన పోకడలు చాలా వచ్చాయి. వెన్నునొప్పితో బాధపడే వారు ఎమర్జెన్సీ పరిస్థితుల్లో వచ్చినప్పటికీ ఆయుర్వేద వైద్యం తీసుకుని నయమైన వారు చాలా మందే ఉన్నారు’’ అని చెప్పాడు. 

‘‘చికిత్స ఎలా జరిగింది? ఔషధాలు చేదుగా ఉన్నాయా? ఎలాంటి జాగ్రత్తలు చెప్పారు? ఎంతకాలం పట్టింది?’’ అని అడుగుతూనే వీపుపైన తడిమి చూస్తూ ‘‘ఆపరేషన్‌ లేకుండా, ఒంటిపై కత్తిగాటు లేకుండా భలే తగ్గిపోయిందిరా’’ అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు మిత్రుడు.

‘‘చికిత్స 16 వారాలపాటు జరిగింది. చెదిరిన డిస్క్‌లు సెట్‌ అవడానికి, ఎల్‌1 వెన్నెముక అతకడానికి, వాపు, నొప్పి తగ్గడానికి, నరాలకు జీవశక్తి రావడానికి ఆయుర్వేద నానో ఔషధాలు ఇవ్వడం జరిగింది. కొన్ని ఔషధాలు అడవులలో సేకరించిన మూలికలతో తయారు చేసి ఇచ్చారు. ఆరు వారాల తరువాత నడుంకు బెల్ట్‌ సహాయంతో లేచి నెమ్మదిగా నడవగలిగాను. తరువాత మల మూత్రాలపై పూర్తి నియంత్రణ వచ్చేసింది. ఆరు నెలలు గడిచేసరికి బాగా నడవగలిగాను. అటు తరువాత మ్యాచ్‌ ఆడే స్థాయి వరకు చికిత్స కొనసాగింది’’ అంటూ కళ్యాణ్‌ చెప్పుకొచ్చాడు. 

‘‘తైల చికిత్సలు ఏమైనా చేశారా?’’ అంటూ పవన్‌ ఆత్రుతగా అడిగాడు. ‘‘మర్దనలు, తైల చికిత్సలు వంటివి ఏమీ లేవు. కానీ కదలకుండా ఉండాలనీ, బరువులు ఎత్తవద్దనీ, కుడి, ఎడమ వైపు సైతం తిరిగవద్దనీ చెప్పడం జరిగింది. ఇంకా టూ వీలర్‌ నడిపే సమయంలో, బస్సులో నుంచి దిగేటప్పుడు, బస్సు వెనక సీట్లో కూర్చున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు. బోన్‌సూప్‌, పప్పు ధాన్యాల కట్లు, ఎండలో కూర్చోవడం, వాకింగ్‌ కొన్ని ప్రత్యేక వ్యాయామాలు చేయాలని సూచించారు. గోధుమలు, సోయ, గుడ్లు, సజ్జలు, రాగులు, తాజా కూరగాయలు, దంపుడు బియ్యం, పళ్లు తినమని సూచించారు. వీటి వల్ల వెన్ను మరింత ధృడమవుతుందని అన్నారు. చికిత్స తరువాత గతంలో మాదిరిగా ఆడగలుగుతున్నాను. సూక్ష్మ, స్థూల పోషకాలతో వెన్ను ఎముకలు దృఢంగా మారతాయంటూ ఆయన చెప్పినవి తు.చ తప్పకుండా పాటించడంతో జీవచ్ఛవంగా మారకుండా పునరుజ్జీవితుడియ్యాను’’ అని అతను వివరించాడు. ఈ డాక్టర్‌ ‘ఆరోగ్యవేదం-ఆయుర్వేదం’ ఇప్పుడు ఓం సీవీఆర్‌ చానెల్‌లోనూ, ‘ఆయుష్మాన్‌ భవ’ పేరుతో సీవీఆర్‌ హెల్త్‌ చానెల్‌లో ప్రసారమవుతున్నాయి  అంటూ ముగించాడు కళ్యాణ్‌.

డాక్టర్‌ బుక్కా మహేశ్‌బాబు
గురు ఆయుకేర్‌ మల్టీ స్పెషాలిటీ
ఆయుర్వేద హాస్పిటల్‌ 
చందన బ్రదర్స్‌ ఎదురుగా
చిక్కడపల్లి,బోడుప్పల్‌ (హైదరాబాద్‌), మధురవాడ(విశాఖపట్నం)
 ఫోన్‌: 98853 06096,
  040-2761 8612