యోగాతో ఒత్తిడి దూరం

ఆంధ్రజ్యోతి: ఒత్తిడి సర్వసాధారణం. ప్రతి ఒక్కరూ ఏదో ఒక దశలో, ఏదో ఒక విధమైన ఒత్తిడికి లోనవుతారు. ఒత్తిడి కేవలం మానసికంగానే కాదు, పిల్లల శారీరక ఎదుగులపైనా ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. ప్రతి రోజూ కొంత సమయాన్ని యోగా కోసం కేటాయించుకోవాలి. రోజూ 10 నుంచి 20 నిమిషాల సేపు విద్యార్థులు యోగా చేస్తే మంచింది. ఆ తరువాత పది నిమిషాలు ధ్యానం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
 
ఎవరైనా చేసేందుకు వీలయ్యే సులువైన, శాసీ్త్రయమైన పద్ధతి యోగ. మానవుని వెన్నెముకకు దిగువన ‘కుండలిని’ నిద్రావస్థలో ఉంటుంది. సహజయోగ చేయడం వల్ల కుండలిని మేల్కొలిపి శరీరంలో మిగతా చోట్ల ఉన్న ఏడు శక్తి ఉత్పాదక కేంద్రాలను ఉత్తేజపరుస్తుంది. ఇలా ఒక్కో కేంద్రాన్ని ఉత్తేజపరుస్తూ చివరగా మన తలను చేరుతుంది. అది చేరిన వెంటనే వ్యక్తి ఒక రకమైన ప్రశాంతతకు లోనవుతాడు.చేతులకు చల్లని గాలి తగిలిన అనుభూతి కలుగుతుంది. ఈ అనుభూతిని ‘చైతన్య’ అని అంటారు. 

ఒత్తిడికి కారణాలు 
 • ఏకాగ్రత కుదరకపోవడం 
 • విద్యార్థుల మధ్య తీవ్ర పోటీ 
 • ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడం 
 • కుటుంబ సభ్యుల మఽధ్య వైరుధ్యాలు 
 • అనారోగ్య సమస్యలు 
 • కెరీర్‌ పట్ల భారీ అంచనాలు 
 • జ్ఞాపకశక్తి లోపించడం 
 • కొన్ని సబ్జెక్టుల్లో బలహీనంగా ఉండటం
 • చేతి రాత సరిగా లేకపోవడం
 • యోగా, ధ్యానంతో సమస్యలను సులభంగా అధిగమించవచ్చు. 


ప్రయోజనాలు 
 • ఏకాగ్రత కుదురుతుంది 
 • ఒత్తిడిని జయించడం 
 • స్వీయ అవగాహన 
 • లక్ష్యం పట్ల ఫోక్‌స్డగా ఉండడం 
 • అవాంతరాల పట్ల సానుకూల దృక్పథం 
 • రోగ నిరోధక శక్తి వృద్ధి 
 • ఆత్మవిశ్వాసం 

శ్రీ మాతాజీ నిర్మళాదేవి 
ఆంధ్రప్రదేశ్‌ 9885041837 
ఠఠఠ 
తెలంగాణ 
986601647974ాృబిఇ్థ