ధ్యానంతో నొప్పులు మాయం?

ఆంధ్రజ్యోతి, 15-11-2015: ఒళ్లు నొప్పులతో తరచూ బాధపడుతున్నారా? ధ్యానం దీనికి శక్తివంతమైన మందంటున్నారు అధ్యయనకారులు. ప్రయోగాల్లో ఉపయోగించే మందు కన్నా కూడా మెడిటేషన నొప్పుల్ని బాగా తగ్గిస్తుందని చెప్తున్నారు. ది వేక్‌ ఫారెస్ట్‌ బాప్టిస్ట్‌ మెడికల్‌ సెంటర్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం చేశారు. ధ్యానం వల్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందుతారని అధ్యయనకారులు గుర్తించారు. ప్రయోగాల్లో నొప్పి తగ్గడానికి వాడే మందుల కన్నా కూడా మెడిటేషన మెదడులో విభిన్నమైన మార్పులను తెస్తుందని అధ్యయనకారులు చెప్పారు. చాలా ప్రత్యేకమైన రీతిలో మైండ్‌ఫుల్‌నెస్‌ మెడిటేషన ఒళ్లు నొప్పులను తగ్గిస్తుందని అధ్యయనకారులు తెలిపారు. ఈ స్టడీని రెండంచెలుగా చేశారు. ఒకటి పెయిన రేటింగ్స్‌ను పరిశీలించడం. రెండవది బ్రెయిన ఇమేజింగ్‌. ప్రయోగంలో భాగంగా మందులు ఇచ్చే రిలీ్‌ఫనే మైండ్‌ఫుల్‌ మెడిటేషన కూడా ఇస్తోందా లేదా అన్న విషయాన్ని స్టడీలో పరిశీలించారు. బ్రెయినలోని భాగాలను ప్రేరేపించి శరీర నొప్పుల్ని మెడిటేషన తగ్గిస్తోంది. ప్రయోగంలో వాడే మందులు పెయిన ప్రోసెసింగ్‌ భాగాల్లో బ్రెయిన యాక్టివిటీని తగ్గించడం ద్వారా నొప్పిని నియంత్రిస్తాయి. బ్రెయినలోని థలామస్‌ అనే భాగం మెడిటేషన సమయంలో డి-యాక్టివేట్‌ అవుతుంది. ఆ టైములో తప్ప మిగతా సమయాల్లో మాత్రం థలామస్‌ మామూలుగానే పనిచేస్తుంది. మొత్తానికి ఈ ప్రయోగం వల్ల తేలిందేమిటంటే తీవ్ర నొప్పిని సైతం మైండ్‌ఫుల్‌నెస్‌ మెడిటేషన తగ్గిస్తుంది.