ఎనర్జీనిచ్చే ప్రాణాయామం

ఆంధ్రజ్యోతి, 09-11-2015: శ్వాసతోనే శరీరానికి కావలసిన ఎనర్జీ లభిస్తుంది. అవయవాలన్నీ సక్రమంగా పనిచేయాలంటే వాటికి తగినంత ఆక్సిజన్‌ అందుతుండాలి. ప్రాణాయామంతో శరీరానికి ఆక్సిజన్‌ ఎక్కువగా అందుతుంది. ఎనర్జీ లెవెల్స్‌ పెరుగుతాయి. ఇంకా ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. ఆ విశేషాలు ఇవి.
 
  • మెదడు, శరీరం సేదతీరడానికి ప్రాణాయామం చక్కగా ఉపయోగపడుతుంది. పది నిమిషాలు బ్రీతింగ్‌పై దృష్టి కేంద్రీకరించడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ప్రతిరోజు ప్రాణాయామం చేయడం వల్ల మెదడుకు రక్త సరఫరా మెరుగై మైండ్‌ రిలాక్స్‌డ్‌గా ఉంటుంది. 
  • ప్రాణాయామాన్ని రెగ్యులర్‌గా ప్రాక్టీస్‌ చేయడం వల్ల ఊపిరితిత్తులకు గాలి పీల్చుకునే సామర్థ్యం పెరుగుంది. ఫలితంగా శరీరానికి అందే ప్రాణవాయువు పరిమాణం కూడా పెరుగుతుంది. 
  • శరీరంలోని అన్ని భాగాలకు సరిపడా ఆక్సిజన్‌ అందడం వల్ల జీవక్రియలు సాఫీగా సాగుతాయి. దీనివల్ల శరీరంలోని టాక్సిన్స్‌ బయటకు వెళ్లిపోతాయి. ఫలితంగా ఆరోగ్యం మెరుగవడంతో పాటు చర్మ సౌందర్యం పెరుగుతుంది. 
  • ప్రాణాయామం వల్ల పొట్ట కండరాలు బలపడతాయి. శరీరంలో అనవసరమైన కొవ్వు పెరగదు. 
  • క్రమం తప్పకుండా ప్రాణాయామం చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది.