యోగముద్రాసనంతో అదుఫు!

13-11-2017: మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనం చేకూర్చే భంగిమ యోగముద్రాసనం.ఈ ఆసనాన్ని తరుచూ వేస్తుంటే పాంక్రియాస్‌ గ్రంధి చురుగ్గా పనిచేస్తుంది. తద్వారా మధుమేహం అదుపులోకి వస్తుంది.

యోగముద్రాసనం వేసే విధానం!
 
పద్మాసనంలో కూర్చోవాలి. రెండు చేతులను వెనుక నడుమ వద్దకు తీసుకురావాలి. కుడిచేతి మణికట్టును, ఎడమచేతితో పట్టుకోవాలి.
చేతులు రెంటిని వెనక్కు లాగి, కుంభకము(గాలిని లోపలే ఆపుట), రేచకము (గాలిని బయటకు వదులుట) చేయాలి.
శరీరాన్ని నిటారుగా ఉంచి దీర్ఘశ్వాస (పూరకము) తీసుకోని నుదురు నేలను తాకేలా నెమ్మదిగా ముందుకు వంగాలి. వీలయినంత సేపు ఆ స్థితిలో (కుంభకము) ఉండాలి.
నెమ్మదిగా తలతో ప్రారంభించి శరీరాన్ని పూర్వస్థితికి వచ్చి శ్వాస తీసుకోవాలి.