యోగాతో వెన్నునొప్పి మాయం!

07-03-2018: పలు ఆరోగ్య సమస్యలకు యోగా పరిష్కారం చూపిస్తుందన్న సంగతి తెలిసిందే! ఇప్పుడు అది వెన్నునొప్పి నుంచి కూడా యోగా ఉపశమనం కలిగిస్తుందని అమెరికా, లండన్‌లలో చేసిన వేరు వేరు అధ్యయనాల్లో వెల్లడైంది. సుమారు 1100 మంది స్త్రీ పురుషుల మీద అధ్యయనాలు చేశారు. వీరందరూ, బ్యాక్‌ పెయిన్‌తో బాధపడుతున్నవారే! వీరి చేత కొన్ని నెలల పాటు యోగాసనాలు వేయించారు. ఇలా ఆసనాలు వేసిన వారిలో చాలా మందికి వెన్నునొప్పి తీవ్రత తగ్గడాన్ని అధ్యయనకారులు గుర్తించారు. అయితే కేవలం యోగా కారణంగానే వెన్నునొప్పి తగ్గదనీ, దాని నివారణకు మందులు తీసుకుంటూనే యోగాసనాలు వేస్తే మంచి ఫలితాన్ని పొందవచ్చని వారు స్పష్టం చేస్తున్నారు.