రోజూ యోగా, ధ్యానంతో ఉల్లాసం

08-09-2017: రోజుకు కనీసం 25 నిమిషాల పాటు యోగా, ధ్యానంతో మెదడు పనితీరు మెరుగై, ఉల్లాసంగా ఉంటామని తాజా అధ్యయనంలో తేలింది. యోగాతో శరీర అవయవాలు ఉత్తేజితమవుతాయని, మెదడుకు రక్త ప్రసరణ పెరుగుతుందని, ధ్యానంతో మెదడులోని అభిజ్ఞా విధులు మెరుగవుతాయని కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్‌ వాటర్లూ పరిశోధకులు చెబుతున్నారు. ముఖ్యంగా హత యోగా ప్రధానమైనదని వెల్లడించారు.