వాళ్లూ కాఫీ తాగొచ్చు

ఆంధ్రజ్యోతి(26-11-15): గర్భిణీలు కాఫీ తాగితే కడుపులో బిడ్డపై దుష్ప్రభావం చూపిస్తుందనే అభిప్రాయం ఉంది. కానీ ఇది తప్పంటున్నారు అధ్యయనకారులు. గర్భిణీలు మితంగా కాఫీ తాగడం వల్ల కడుపులో బిడ్డ తెలివితేటలకు వచ్చే ప్రమాదం ఏమీ లేదంటున్నారు. కొలంబ్‌సలోని ఒక పిల్లల ఆస్పత్రి చేసిన స్టడీలో ఈ విషయం వెల్లడైంది. భవిష్యత్తులో పిల్లల తెలివితేటలు, ప్రవర్తనల మీద  కెఫైన్‌ ఎలాంటి ప్రభావం చూపిస్తుదనే అంశంపై   స్టడీ  చేశారు. ఇందులో కెఫైన్‌ పిల్లల ఐక్యూని తగ్గించడంగాని, ప్రవర్తనా పరమైన సమస్యలు పెరగడానికిగాని  దారితీయడంగాని లేదని తేలింది. గతంలో గర్భిణీలు కూడా కాఫీని బాగా తాగేవారు. దీని ప్రభావం గర్భిణీల పిల్లలపై ఏమైనా పడిందా అనే విషయాన్ని అధ్యయనకారులు శోధించారు. ఇందులో భాగంగా 2,197 గర్భిణుల రక్తంలో కాఫీ మార్కర్‌ను పరిశీలించారు. కెఫైన్‌లోని ముఖ్యమైన మెటబొలైట్‌ పేరాగ్జాన్‌థైన్‌ అనే రసాయనానికి, పిల్లల ఐక్యూ, ప్రవర్తనా పరమైన సమస్యలకు పరస్పర సంబంధం ఏమైనా ఉందా అనే విషయాన్ని పరిశీలించారు. నాలుగు, ఏడు సంవత ్సరాల  వయసు  పిల్లల ఐక్యూ, వారి ప్రవర్తనలను అధ్యయనం చేశారు. పిల్లల్లో ఎలాంటి మార్పు రాలేదని గమనించారు.  గర్భిణులు రోజుకు ఒకటి లేదా రెండు కప్పుల కాఫీ తాగడం వల్ల పుట్టబోయే పిల్లలకు పైన చెప్పిన సమస్యలేవీ తలెత్తవని అధ్యయనకారులు ఈ స్టడీలో తేల్చారు.