సంతాన సాఫల్యానికి ఉత్తమ వైద్యం

ఆంధ్రజ్యోతి(18-06-130): సంతానం అన్నది కేవలం పునరుత్పత్తి అవయవాలకు మాత్రమే పరిమితమైనది కాదు. అది మొత్తం శరీరవ్యవస్థ మీద ఆధారపడి ఉంటుంది. అందుకే సంతాన సాఫల్యానికి దంపతులిద్దరి  ఆరోగ్యం ఎంతో ముఖ్యమని ఆయుర్వేదం చెబుతుంది. అయితే ఆధునిక వైద్య విధానాలు  స్త్రీ పురుషుల  శుక్ర, శోణితాలను  (అండం)ఫలధీకరణ చెందించి లోనికి ప్రవేశపెడితే చాలనుకుంటున్నాయి. అందుకే ఐవిఎఫ్‌ చికిత్సలు చాలా వరకు విఫలంమైపోతున్నాయి. ఒకవేళ సంతానం కలిగినా ఆ శిశువుల్లో చాలా మంది అంత ఆరోగ్యంగా ఉండడం లేదు. ఇందుకు భిన్నంగా ఆయుర్వేదం మొత్తం శరీర వ్యవస్థ్థనే శక్తివంతం చేసి దంపతులను సంతానానికి పూర్తి యోగ్యంగా మారుస్తుంది. ఫలితంగా సంతాన శక్తే కాదు, వారి లైంగిక శక్తి కూడా పెరుగుతుంది. అందుకే ఆయుర్వేద చికిత్సతో కలిగే శిశువుతో పాటు ఆ దంపతులు కూడా జీవితాంతపు ఆరోగ్యాన్ని పొందుతారంటున్నారు ఆయుర్వేద  వైద్య నిపుణులు  డాక్టర్‌ వర్థన్‌.
 

సంతానం లేని దాంపత్య జీవితానికి సార్థకత ఏముంటుంది? వాస్తవానికి సంతానం కలగడం అన్నది అత్యంత సహజ పరిణామమే. కాకపోతే దంపతుల్లో ఎవరో ఒకరు గానీ, లేదా ఇద్దరూ గానీ, అనారోగ్యంతో లేదా ఏవో కొన్ని లోపాలతో ఉన్నప్పుడే సంతానానికి అంతరాయం ఏర్పడుతుంది. దంపతులు ఇరువురూ ఆరోగ్యంగా ఉన్నప్పుడే వారికి కలిగే శిశువు కూడా  ఆరోగ్యంతో ఉంటుంది. దంపతుల ఆరోగ్యం పట్టించుకోకుండా సంతానం మీదే దృష్టి పెడితే వ చ్చే ఫలితాలు ఆశించిన రీతిలో ఉండవు.  ఇంద్రియాలూ, వాత పిత్త కఫాలనే త్రిదోషాలూ, రసమూ, రక్తమూ, మాంసం, మేధస్సు, అస్తి, మజ్జ, శుక్రం అనే సప్తధాతువులూ మొత్తంగా బాగుండడాన్నే ఆర్యోగం అంటాం. మనం తీసుకునే ఆహార పానీయాల ద్వారా అంతిమంగా ఏర్పడేది శుక్ర ధాతువు. ఈ శుక్ర ధాతువు స్త్రీ పురుషులు ఇరువురిలోనూ ఉంటుంది. మౌలికంగా హార్మోనల్‌ యంత్రాంగానికి  సంబంధించిన  ఎండోక్రినల్‌ వ్యవస్థే శుక్రధాతువు. జీర్ణవ్యవస్థ సర్వ సమగ్రంగా ఉంటేనే ఈ శుక్రధాతువు కూడా పరిపక్వ స్థితిలో ఉంటుంది. అయితే, ఆధునిక జీవన శైలి, ఆహారపు అలవాట్లు ఇవన్నీ చాలా వరకు ఈ శుక్రధాతువును దెబ్బ తీసే విధంగానే ఉంటున్నాయి. రస ధాతువునుంచి మొదలుకుని, శుక్ర ధాతువుదాకా అన్నీ క్షీణదిశగానే వెళుతున్నాయి. ఇవన్నీ పునరుత్పత్తి వ్యవస్థ మీద తీవ్రమైన దుష్ప్రభావాన్ని కలిగిస్తున్నాయి. ఫలితంగా సంతాన లేమి సమస్యలు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి.  ఈ స్థితిని అధిగమించడానికి మొత్తం శరీర వ్యవస్థను మలినాలనుంచి  విముక్తం చేసి సర్వశక్తి వంతంగా మలుచుకోవలసి ఉంది. అందుకు అద్భుతంగా తోడ్పడేదే ఆయుర్వేదం. 

శుక్రకణాల సంఖ్య తగ్గిపోయినప్పుడు అల్లోపతి వైద్యులు ఆ కణాలను పెంచడానికని ఏవో మందులు ఇచ్చేస్తున్నారు. కానీ, ఆ కణాలు తగ్గడానికి గల అసలు కారణం ఏమిటో కనుగొనే దిశగా ఎవరూ వెళ్లడం లేదు. నిజానికి  అతని జీవన విధానంలోని స్థితిగతులన్నిటినీ పరిశీలించాలి అవేమీ చేయకుండా కేవలం ఏవో మాత్రలు ఇచ్చి పంపడం సంపూర్ణ చికిత్స కాదు.  శుక్రకణాల సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు వాటిని పెంచడానికి అల్లోపతిలో మూడునాలుగు మాసాల పాటు వాడేందుకు కొన్ని మందులు సూచిస్తారు. అయితే అవి వాడుతున్న ఆ మూడు నాలుగు మాసాలూ శుక్రకణాల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. కాకపోతే ఓ ఆరుమాసాల్లో ఆ సంఖ్య మందులు వాడటానికి ముందున్న స్థాయికే పడిపోతుంది. కేవలం శుక్రకణాలను పెంచడమే లక్ష్యంగా  చికిత్సలు సాగిన పరిణామమే ఇది. ఆయుర్వేద మందులతో ఆ మూడు నాలుగు మాసాలే కాదు  పెరిగిన ఆ సంఖ్య ఎప్పటికీ అలాగే ఉంటుంది. వాస్తవానికి కణాల సంఖ్య అన్నది కేవలం సంతానికే కాదు, ఆ వ్యక్తి జీవ చైతన్యానికే  ప్రతీకగా ఉంటుంది. 

నాడీ వ్యవస్థలోని లోపాలనే వాత వైగుణ్యం అంటారు. నిజానికి గర్భ ధారణ జరగడానికి నాడీ వ్యవస్థ సవ్యంగా పనిచేయడం చాలా ముఖ్యం. వీటితో పాటు బహిష్టు సంబంధిత సమస్యలు, సుమారు 20 రకాల  స్త్రీ లైంగిక సమస్యలు  సంతాన లేమికి కారణ మవుతాయి. వాత వైగుణ్యం ఏర్పడినప్పుడు  శుక్రకణాలను స్వీకరించే తత్వం స్త్రీలో తగ్గిపోతుంది. వాతం ఐదురకాలు. వీటిలో చివరిది అపాన వాతం.  శుక్రశోణితాలు కలవడం, గర్భం రావడం అన్నది ఈ అపాన వాయువు పరిధిలోనే ఉంటుంది. అపాన వాయువు సరిగా ఉన్నప్పుడే గర్భధారణ సులువుగా జరుగుతుంది. అపాన వాతం సరిగా లేకపోతే రుతుక్రమం సరిగా ఉండదు. హార్మోన్‌లు సరిగా విడుదల కావు. నాడీవ్యవస్థ సరిగా పనిచేయదు. ఫలితంగా గర్భధారణకు అనువైన  పరిస్థితి కరువైపోతుంది. అయితే అపాన వాయువును సరియైన స్థితికి తెచ్చే ఆయుర్వేదానికి ఉంది. 

సంతాన సాఫళ్యం కోసం ఆధునిక వైద్యులు చేస్తున్న ఐవిఎఫ్‌ విధానంలో ఏం జరుగుతోంది? శుక్రకణాన్నీ, అండాన్నీ బయటే ఫలదీకరణ చేయించి గర్భంలోకి ప్రవే శపెడుతున్నారు. నిజానికి గర్భధారణకు శుక్రశోణితాలు రెండూ నాణ్యంగా ఉండాలి. ఆరెండూ కలిసి గర్భాశయలో సరిగ్గా నిలబడగలగాలి. ఈ ప్రక్రియ సహజసిద్ధంగా జరిగిందే అయితే గర్భంలోకి ప్రవేశించగానే గర్భాశయ వ్యవస్థ అంతా క్రమబద్ధం అవుతుంది. హార్మోన్లన్నీ విడుదల అవుతాయి. పిండం ఏర్పడుతుంది. అలా కాకుండా  లోనికి ప్రవేశపెట్టడం వల్ల చాలా సార్లు అది కిందికి జారిపోతుంది. అందుకే కొంత మంది ఐదారుసార్లు  ఐవిఎఫ్‌ చేయించుకున్నా ఫలితం ఉండటం లేదు. ఆయుర్వేదంలో అలా ఉండదు. ఉత్తర వస్తి క్రియ ద్వారా గర్భాశయాన్ని మొత్తం శుభ్ర చేస్తాం. శుక్రశోణితాలు కలిసాక అవి లోపల స్థిరపడటానికి అవసరమైన  పరిస్థితి కలిపించే విధానాలన్నీ ఆయుర్వేదంలో ఉన్నాయి. దీనివల్ల శిశువు ఎదిగే క్రమం చాలా సహజంగా ఆరోగ్యవంతంగా ఉంటుంది. 

రుతుక్రమ దోషాలు గర్భధారణకు పెద్ద ఆటంకంగా ఉంటాయి. అయితే ఈ దోషాలను హార్మోన్‌  మాత్రలు ఇచ్చే అవసరం లేకుండానే చక్కదిద్దే మందులు ఆయర్వేదంలో ఉన్నాయి.  అల్లోపతి విధానంలో నిరంతరంగా హార్మోన్లు ఇవ్వడం వల్ల చాలా సార్లు అసలు సమస్య అలాగే ఉండిపోయి ఊబకాయం వచ్చేస్తోంది. కొంతమందికి మాత్రలు కాకుండా  హార్మోన్‌ ఇంజెక్షన్లు ఇస్తారు. వీటివల్ల కలిగే దుష్ప్రభావాలు మరీ ఎక్కువ.  అయితే, ఈ కృత్రిమ హార్మోన్ల వల్ల కూడా కొందరిలో  అండం విడుదల అవుతుంది. కానీ, ఆ అండం నాణ్యంగా, ఆరోగ్యంగా  ఉండదు. అండం నాణ్యంగా ఉంచగలిగే మందులు  ఆయుర్వేదంలో సమృద్ధిగా ఉన్నాయి. .కేవలం శుక్రాన్నీ, అండాన్ని ఫలదీకరణ చెందించి అండాశయంలోకి ప్రవేశపెట్టే వరకే పరిమితమయ్యే ఐవిఎఫ్‌  చికిత్సలు ఐదారుసార్లు తీసుకున్నా  చాలాసార్లు ఫలితం లేకపోవ డానికి మొత్తం శుక్రశోణితాల నాణ్యతను  పట్టించుకోకపోవడమే కారణం.  శుక్రకణాల్లో నాణ్యత లేకపోయినా కొందరికి సంతానం కలగవచ్చు. కానీ, ఆ శిశువు ఆరోగ్యంగా ఉండే అవకాశాలు చాలా తక్కువ. అయినా ఐవిఎఫ్‌ ఖర్చు లక్షల్లోనే ఉంటుంది. అదే ఆయుర్వేదంలో అయ్యే ఖర్చు చాలా స్వల్పం. కొంత మంది ఆరేడుసార్లు ఐవిఎఫ్‌ చేయించుకుని కూడా  ఫలితం లేక చివరికి ఆయుర్వేద చికిత్సల కోసం వచ్చిన వాళ్ల సంఖ్య కూడా తక్కువే మీ కాదు. 

స్త్రీలలోని  గర్భాశయ, రుతుక్రమ సమస్యలు కావచ్చు. పురుషుల్లోని శుక్ర కణాల సంఖ్య లేదా వాటి నాణ్యత సమస్య కావచ్చు. వాటి మూల కారణాలను తొలగించే దిశగా ఆయుర్వేదం పనిచేస్తుంది.  సంతానం కోసం చేసే చికిత్సలకు ముందు శరీరంలోని కల్మషాలన్నిటినీ బయటికి పంపే చికిత్సలు చాలా ముఖ్యం. ఆ తరువాతే పంచకర్మ చికిత్సలు ఆ తరువాత రసాయన చికిత్సలు, వాజీకరణ చికిత్సలు చేయాలి. శరీరాన్ని చైతన్యపరిచే రసాయన చికిత్సలో భాగంగా సర్వాంగధార, నవరకిడి, నస్యకర్మ చికిత్సలు కూడా ఉంటాయి. వీటితోపాటు  గర్భాశయ, జననాంగ భాగాల్లో ఉండే ఇన్‌ఫెక్షన్లను తొలగించేందుకు ఉత్తరవస్తి చికిత్స చేయవలసి ఉంటుంది. దీని వల్ల గర్భాశయ లోపాలతో పాటు, గర్భనాళాల్లోని అడ్డంకులు కూడా తొలగిపోతాయి. 

మొత్తంగా చూస్తే శుక్రశోణితాల ఫలదీకరణకే పరిమితం కాకుండా మొత్తం శరీర వ్యవస్థనంతా ఒక సమున్నత స్థితిలో నిలబెట్టే ప్రక్రియలన్నీ ఆయుర్వేదంలో ఉంటాయి. వీటివల్ల  అంగస్తంభన సమస్యలున్నా  పోయి లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. అలాగే  అప్పటిదాకా ఉన్న ఇతర జబ్బులెన్నో నయమవుతాయి. సంతానం కోసం భార్యాభర్తలు ఇద్దరూ ఆయుర్వేద చికిత్సలు తీసుకోవాలి.  మొత్తంగా అన్ని చికిత్సలకూ కలిపి మూడు నుంచి ఆరు మాసాల దాకా పడుతుంది.  ఆయుర్వేద సంతాన సాఫళ్య చికిత్సతో శిశువే కాదు దంపతుల ఆరోగ్యం కూడా దివ్యంగా ఉంటుంది. జీవితాంతపు ఆరోగ్యం సొంతమవుతుంది. 
 
 
డాక్టర్‌ వర్ధన్‌ 
ది కేరళ ఆయుర్వేదిక్‌ కేర్‌, 
స్పెషాలిటీ, పంచకర్మ సెంటర్‌, స్కైలేన్‌                          థియేటర్‌ లేన్‌,బషీర్‌బాగ్‌, హైదరాబాద్‌,                                                                బ్రాంచీలు: దానవాయి పేట - రాజమండ్రి,                                    ఎన్‌ ఆర్‌ పేట-  కర్నూలు
ఫోన్‌: 9866666055, 8686848383