వీలైతే ఇంజక్షన్‌.. లేకుంటే మాత్ర!

గర్భ నిరోధానికి రెండు సరికొత్త పద్ధతులు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 5: దేశంలో అందుబాటులో ఉన్న కుటుంబ నియంత్రణ పద్ధతులను మరింత విస్తృతం చేసే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కొత్తగా మరో రెండు విధానాలను ఆవిష్కరించింది. వీటిలో ఒకటి ఇంజక్షన్‌, రెండు మాత్ర. వీటి ద్వారా అత్యంత సులువుగా, సురక్షితంగా కుటుంబ నియంత్రణ పాటించవచ్చని కేంద్ర తెలిపింది. ఇంజక్షన్‌, మాత్రలు అన్ని వైద్య కళాశాలలు, జిల్లా ఆస్పత్రుల్లో ఉచితంగా లభిస్తాయని పేర్కొంది. ప్రస్తుతం మహారాష్ట్ర, యూపీ, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, కర్ణాటక, హరియాణా, పశ్చిమ బెంగాల్‌, ఒడిసా, ఢిల్లీ, గోవాల్లో ఇవి అందుబాటులో ఉన్నాయని ఓ ప్రకటనలో వివరించింది. ఇంజక్షన్‌ ‘అంతర’ మూడు మాసాల వర కు, మాత్ర ‘చయ్యా’ వారంపాటు పనిచేస్తుందని తెలిపింది. ‘మిషన్‌ పరివార్‌ వికా్‌స’లో భాగంగా ఈ రెండు పద్ధతులను ఆవిష్కరించినట్టు పేర్కొంది.